రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఆధార్ కార్డులతో ఏజెన్సీల ముందు క్యూకట్టిన మహిళలు
: తెలంగాణలో మహిళలంతా ఆధార్ కార్డులు పట్టుకుని గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. ఆధార్ ఈ-కేవైసీ అయితేనే కాంగ్రెస్ ప్రకటించిన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం వర్తిస్తుందని వస్తున్న వార్తలే అందుకు కారణం. అయితే. అసలు విషయం తెలిసాక ఉసూరుమంటూ మళ్లీ ఇంటికి చేరుతున్నారు. ఇంతకీ ఈ-కేవైసీ ఏందీ.. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌కు సంబంధం ఏంటీ..?
గ్యాస్ సిలిండర్
: తెలంగాణలో ఆసక్తకిర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రచారం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే దిశగా సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే.. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధి పది లక్షలకు పెంపును అమల్లోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు. కాగా.. మిగిలిన హామీలను కూడా.. వీలైనంత తొందరగా అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్తోంది. అయితే.. కాంగ్రెస్ ఇచ్చిన మరో కీలక హామీల్లో ఒకటైనా రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీని కూడా త్వరలోనే ప్రారంబించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచి మహిళలు ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.
అదేంటీ.. పథకం ప్రారంభించకముందే మహిళలు క్యూలు కట్టటమేంటీ అనుకుంటున్నారా.. అక్కడే ఉంచి అసలు కిటుకు. అయితే.. ఈ పథకం కోసం ఈ-కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రాదని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకేముంది.. ఈ- కేవైసీ చేయించుకునేందుకు మహిళలందరూ తమ ఆధార్ కార్డులు పట్టుకుని గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు.
చిన్నారులలో నమ్మకం మరియు భద్రతా భావం కలిగించడం ఎలా..!
అసలు విషయమేమిటంటే.. కేంద్ర ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ-కేవైసీ చేసుకొని మహిళలందరు వెంటనే చేయించుకోవాలని ప్రకటించింది. కాగా.. ఈ ప్రకటనకు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి లింకు పెట్టి వార్తలు ప్రచారం కావటంతో.. మహిళలు ఆందోళన పడ్డారు. అయితే.. కేంద్రం ప్రకటించిన ప్రకటనకు తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌కు ఎలాంటి సంబంధం లేదు అని గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఈ-కేవైసీ పూర్తి కానీ వారికి మాత్రమే చేస్తున్నామని తెలిపాయి. తెలంగాణలో గ్యాస్ లబ్ధిదారులందరూ ఈ విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఏజెన్సీలు సూచిస్తున్నాయి.
No comments:
Post a Comment