Tuesday, 26 December 2023

లోక కళ్యాణార్థమే వాసవి మాతకు కోటి పుష్పార్చన*

 *లోక కళ్యాణార్థమే వాసవి మాతకు కోటి పుష్పార్చన*




- వైశ్య గురు శ్రీ శ్రీ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ కర కమలములచే సూర్యాపేట వాసవి మాతకు లక్ష లక్ష పుష్పార్చన


- భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి ఆశీస్సులు అందజేసిన మహా స్వామీ.


లోక కళ్యాణార్థమే తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా 102 వాసవి మాత దేవాలయాల్లో వాసవి మాతాకు కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు,  వైశ్య గురు సేవా సమితి రాష్ట్ర కోశాధికారి ఈగ దయాకర్ గుప్త లు  తెలిపారు. సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవి మాత దేవాలయంలో వైశ్య గురు, కర్ణాటక రాష్ట్రం హాల్దిపూర్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ కరకమలములచే కన్నుల పండువగా వాసవి మాతాకు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యత అభివృద్ధి కోసం, ప్రపంచ శాంతిని పెంపొందించేందుకు శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ చేతుల మీదుగా 102 దేవాలయాల్లో కోటి పుష్పార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే నేడు సూర్యాపేట వాసవి మాతకు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు సింగిరికొండ సురేందర్, కోశాధికారి పోలా రాధాకృష్ణ, దేవాలయ పూజారి అన్నవజ్జుల క్సుష్ణమూర్తి, సింగిరి కొండ రవీందర్, తల్లాడ సోమయ్య,  గుండా శ్రీధర్,  గుండా శ్రీనివాసులు,  దేవరశెట్టి సత్యనారాయణ,  తాళ్లపల్లి రామయ్య, పసుపర్తి కృష్ణమూర్తి,  గోపారపు రాజు,  ఉప్పల గోపాలకృష్ణ,  పబ్బ ప్రకాష్, బెలిధే అంజయ్య,  పైడిమర్రి కేశవులు,  ఈగ రామయ్య, చిలుకల స్వాతి శ్రీనివాస్, బచ్చు పురుషోత్తం మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.

No comments:

Post a Comment