పూజారికి దక్షిణ ఇవ్వటం..
ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాము ..దక్షత కలిగిన వారికి సమర్పించుకునేది దక్షిణ ..
ప్రదక్షిణ అనేది మనము మనకుగా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలడము ప్రదక్షిణము,ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనము ప్రదక్షిణము భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము.
సమర్పణ ఎందుకు?
సాధారణముగా మనకు ఏ పని చేసి పెట్టినా వారు ఎవరు అయినా వారికి వారి కష్టానికి డబ్బులు లేక వారి కష్టానికి ప్రతిఫలము ఇవ్వడము ధర్మము .ఒకవేళ అలా ఇవ్వకపోతే అది పెద్ద అధర్మం ..
ఇది నేను కాదు, వాల్మీకి రామాయణములో భరతుడు చెప్పిన ధర్మము.ఇప్పుడు పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వడమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వేదము అంటేనే దైవము, మానవ నేత్రముకి కనిపించని దైవము మంత్ర రూపములో వేదరాశిలో నిక్షిప్తమయి మనకు వినిపిస్తారు,
మన సాధనకు మార్గము చూపి తనలో మనని తన వైపు నడిపించేదే వేదము. అటువంటి దైవముకి కానీ వేదముకి కానీ వెల కట్టే సొమ్ము ఎంత ?
పూజాదికాలు యజ్ఞ యాగాదులు చేయగలిగే దక్షత కలిగినవారు ఎవరు ?
కేవలము పూజారులే .. పూజారులకు దక్షిణ ఇచ్చేదీ వేదము చదివే దక్షత పొందిన దక్షులు కనుక. వారిలో ఉన్న వేదముకి విలువ, ఆ వేదముకి విలువ కట్టేంత వారము కాదు, ఈ విషయము గ్రహించాలి. వారికి దక్షిణ ఇవ్వడము అంటే మనము ఇవ్వగలిగినంత ఇవ్వడము కానీ 10 రూపాయలో లేక 100 రూపాయలో విలువ కట్టి ఇవ్వడము కానే కాదు. అది తప్పు . గుడిలో పూజ లేక అర్చన లేక హారతి లేక ఇతర ఎటువంటి క్రతువులు చేయించుకున్నా పూజారి గారికి దక్షిణ తప్పకుండా ఇవ్వవలసిందే.నియమం అనరు కానీ ఇది తప్పకుండా పాటించ వలసిన ధర్మం మరియు ఆచారం .. దక్షిణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకి పూర్తి ఫలితము ఎలా దక్కుతుంది.. ?
ఇది వాస్తవము మరియు సత్యము. పూజారులకు వారి సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడము చేత వారు సంతృప్తి చెందడము చేత పొందేవి ఏమిటంటే ?
1) వారి కంఠము, స్వరము , ఊపిరితిత్తులను అనుక్షణమూ నొప్పిస్తూ, అనుగుణముగా లయబద్ధముగా ఉపయోగిస్తూ మంత్రభాగము తప్పు దొర్లకుండా దేవతలను ఆవాహనము చేస్తూ పూజాదికాలు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలము, దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మము కోసము ఇవ్వడము.
2) జీవులను ఉద్ధరించడము దైవ ధర్మము, వేద రూపమున తనను స్మరించి సర్వ మనవాళికి శుభము కలిగించే మనకు మరియు దైవముకు సాధనముగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మేర దక్షిణ ఇస్తే, తన ధర్మము కోసము ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవము కూడా సంతృప్తి చెందుతారు. ఏవరికి ఎప్పుడూ ఋణపడి ఉండకూడదు.
3) ఉచితంగా ముహూర్తాలు, జాతకాలు అడగకూడదు.
జ్యోతిష్యునికి,పురోహితునికి ఎప్పుడూ ఋణపడిపోకూడదు.
వారి ద్వారా సేవలను తీసుకున్నప్పుడు తప్పక వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారిని గౌరవిస్తూ ఉంటే ..
వారి ఆత్మ సంతృప్తి మనకు దీవెనల రూపంలో మంచిని కలుగజేస్తాయి.
No comments:
Post a Comment