Sunday, 31 December 2023

ప్రజలు,అభిమానులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలుకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 


కామెంట్స్ :-*


• ప్రజలు,అభిమానులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు


•  నాకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎవరు హైదరాబాద్ కు రావొద్దు


•  ప్రతిష్టాత్మకంగా.. “ప్రజాపాలన” కార్యక్రమం నిర్వహించాలి


•  ప్రతీ నాయకుడు, కార్యకర్త.. గ్రామాల్లో, వృద్దులకు, నిరక్షరాస్యులకు అండగా ఉంటూ  “అభయహస్తాన్ని” విజయవంతం చేయాలి


• వచ్చే వారంలో నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చి ప్రతీ ఒక్కరిని కలుస్తా


•  నాకు ఇవ్వడం కోసం బోకేలు, శాలువాలు కొనవద్దని  ...  అదే డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కు జమ చేయండి


• పదేళ్లుగా ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణం చేసుకునేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం.

Wednesday, 27 December 2023

5 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు!*





 *All of you 5 minutes ee message chudandi evariki inaa use avochhu* 


*🔊5 guarantees : 5 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు!*


*♦️రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసదస్సుల్లో స్వీకరణ*



*🔶'ప్రజా పాలన గ్యారెంటీ దరఖాస్తు' పేరుతో*నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి*


*🔶రెండే పేజీలు.. 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు*


*🔹రేషన్, ఆధార్‌ జిరాక్సులు అర్జీకి జతచేయాలి*


*♦️రేషన్‌ కార్డు లేనివారూ దరఖాస్తు చేసుకోవచ్చు*


*🔶గత దరఖాస్తులు చెల్లవు.. మళ్లీ చేసుకోవాల్సిందే*


*♦️ఇంటింటికీ దరఖాస్తులు.. ఏ రోజు రావాలో వెల్లడి*


*🔹ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ*


*♦️దరఖాస్తుల ఆధారంగా డేటా, తర్వాత మార్గదర్శకాలు*

2024 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించినమహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మినారాయణ

 *యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యములో ముద్రించిన 2024 సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయములో ఆవిష్కరించిన తెలంగాణరాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మినారాయణ



గారు ఈ కార్యక్రమములో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజనసంఘం అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ  మహాసభ ఉపాధ్యక్షులు శ్రీ ఆగిరివెంకటేష్  యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు  మల్లగారి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బెజుగం సంతోష్ కుమార్ కోశాధికారి జగిని మధుసూదన్ ,మంచాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు*

Tuesday, 26 December 2023

లోక కళ్యాణార్థమే వాసవి మాతకు కోటి పుష్పార్చన*

 *లోక కళ్యాణార్థమే వాసవి మాతకు కోటి పుష్పార్చన*




- వైశ్య గురు శ్రీ శ్రీ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ కర కమలములచే సూర్యాపేట వాసవి మాతకు లక్ష లక్ష పుష్పార్చన


- భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి ఆశీస్సులు అందజేసిన మహా స్వామీ.


లోక కళ్యాణార్థమే తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా 102 వాసవి మాత దేవాలయాల్లో వాసవి మాతాకు కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు,  వైశ్య గురు సేవా సమితి రాష్ట్ర కోశాధికారి ఈగ దయాకర్ గుప్త లు  తెలిపారు. సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవి మాత దేవాలయంలో వైశ్య గురు, కర్ణాటక రాష్ట్రం హాల్దిపూర్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ కరకమలములచే కన్నుల పండువగా వాసవి మాతాకు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యత అభివృద్ధి కోసం, ప్రపంచ శాంతిని పెంపొందించేందుకు శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ చేతుల మీదుగా 102 దేవాలయాల్లో కోటి పుష్పార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే నేడు సూర్యాపేట వాసవి మాతకు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు సింగిరికొండ సురేందర్, కోశాధికారి పోలా రాధాకృష్ణ, దేవాలయ పూజారి అన్నవజ్జుల క్సుష్ణమూర్తి, సింగిరి కొండ రవీందర్, తల్లాడ సోమయ్య,  గుండా శ్రీధర్,  గుండా శ్రీనివాసులు,  దేవరశెట్టి సత్యనారాయణ,  తాళ్లపల్లి రామయ్య, పసుపర్తి కృష్ణమూర్తి,  గోపారపు రాజు,  ఉప్పల గోపాలకృష్ణ,  పబ్బ ప్రకాష్, బెలిధే అంజయ్య,  పైడిమర్రి కేశవులు,  ఈగ రామయ్య, చిలుకల స్వాతి శ్రీనివాస్, బచ్చు పురుషోత్తం మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.

Monday, 25 December 2023

బెల్ట్ షాపులు లేని నియోజకవర్గంగా చూడడమే నా ముందున్న ధ్యేయంమునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి...

 మునుగోడు నియోజకవర్గం లో బెల్టు షాపుల మూసివేత పై  మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో  ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి...



సమావేశానికి హాజరైన ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐలు ఎస్ఐలు  కానిస్టేబుల్ లు

నియోజకవర్గ వ్యాప్తంగా బెల్టు షాపులను మూసివేసే బాధ్యత దగ్గరుండి చూసుకోవాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.

వినని పక్షంలో కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడొద్దు..

బెల్ట్ షాపులు లేని నియోజకవర్గంగా చూడడమే నా ముందున్న ధ్యేయం

మీ lకు అన్ని రకాలుగా సహకరిస్తా...

Thursday, 21 December 2023

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా

 స్క్రోలింగ్


యాదాద్రి భువనగిరి జిల్లా

*🔹యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ  ఈవో గీతారెడ్డి రాజీనామా


.*


_దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడి._

Monday, 18 December 2023

ఎంఏయుడి, హెచ్ఎండిఏ బాధ్యతలు చేపట్టిన దానకిశోర్*

 

ఎంఏయుడి, హెచ్ఎండిఏ బాధ్యతలు చేపట్టిన దానకిశోర్*                                                           

సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరణ                                                            

సచివాలయంలో దానకిశోర్ ను కలిసిన సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు
                                                                      
*హైదరాబాద్* : తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ(ఎంఏయుడి) ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఎం.దానకిశోర్ సోమవారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.  

అనంతరం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మెట్రోపాలిటన్ కమిషనర్ గా కూడ ఆయన బాధ్యతలు చేపట్టారు.  

ఈ సందర్భంగా ఎంఏయుడి అధికారులు, సిబ్బంది, హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో పాటు పలువురు ఆయన్ను కలుసుకొని పుష్పగుచ్చాలు, మొక్కలు(ప్లాంట్స్) ఇచ్చి అభినందిం




చారు.

Sunday, 17 December 2023

రెండేళ్ల క్రితం కొవిడ్‌తో భర్త మృతి.. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన భార్య.. ఎలాగంటే!

 రెండేళ్ల క్రితం కొవిడ్‌తో భర్త మృతి.. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన భార్య.. ఎలాగంటే!

                2019 లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాలను తీవ్రంగా భయపెట్టింది. ఇప్పటికీ అన్ని దేశాలు కరోనా వేరియంట్లతో భయపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం కొవిడ్‌తో భర్త మృతి చెందగా.. తాజాగా అతని భార్య కొడుకుకు జన్మనిచ్చింది. వినడానికి వింతగా ఉన్నా.. ఇదే జరిగింది. ఇంతకీ భర్త చనిపోయిన తర్వాత 2 ఏళ్లకు ఆ భార్యకు ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది. బిడ్డకు ఎలా జన్మనిచ్చింది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

            :కొవిడ్‌ సోకి ఓ వ్యక్తి దాదాపు 2 ఏళ్ల క్రితం చనిపోగా.. అతని భార్య తాజాగా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 48 ఏళ్లు. భర్త చనిపోవడంతో నా అనుకునే వాళ్లు ఎవరూ లేకపోవడంతో నడివయసులో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఐవీఎఫ్ పద్దతిలో ఈ కాన్పు జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరి పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు వెల్లడించారు. అయితే గర్భాశయ సమస్యల కారణంగా వారికి కొన్నేళ్ల పాటు సంతానం లేదని.. ఆ తర్వాత వారు ఐవీఎఫ్ పద్దతిలో పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రారంభం అయిన కొన్ని రోజులకే ఆ వ్యక్తి మరణించడంతో ఆగిపోయిందని.. అయితే కొన్ని నెలల క్రితం ఆమె బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకుని ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు డాక్టర్లు వెల్లడించారు.

            పశ్చిమ బెంగాల్‌లోని భీర్‌భూమ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మురారై ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల సంగీత ఇటీవల ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె భర్త అరుణ్‌ ప్రసాద్‌ రెండేళ్ల క్రితం కరోనా వైరస్ సోకి చనిపోయాడు. అయితే వీరికి 27 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా.. సంగీతకు గర్భాశయ సమస్యలు ఉన్నాయి. దీంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి పిల్లలు పుట్టలేదు. ఈ క్రమంలోనే అరుణ్ ప్రసాద్ బతికి ఉన్న సమయంలో ఐవీఎఫ్ పద్దతిలో బిడ్డకు జన్మనివ్వాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో రెండేళ్ల క్రితం అరుణ్ ప్రసాద్ వీర్యం తీసి కోల్‌కతాలోని ఓ ల్యాబ్‌లో భద్రపరిచారు.

 ఆ తర్వాత అరుణ్ ప్రసాద్‌కు కొవిడ్‌ సోకడంతో మరణించాడు. భర్త చనిపోవడంతో అత్తింటి వారు సంగీతను పట్టించుకోలేదు. దీంతో ఆమె ఒంటరి అయిపోయింది. తన భర్త అరుణ్‌ ప్రసాద్‌ నడిపిన కిరాణం దుకాణాన్నే ఆమె నెట్టుకొస్తూ జీవించేది. భర్త మృతితో ఒంటరిగా మారిన సంగీత.. కోల్‌కతా ల్యాబ్‌లో భద్రపరచిన భర్త వీర్యం సాయంతో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. అలా అరుణ్‌ వీర్యాన్ని ఆమె అండంలోకి ప్రవేశపెట్టడం ద్వారా సంగీత గర్భవతి అయ్యింది. ఈ క్రమంలోనే డిసెంబరు 12 వ తేదీన రాంపుర్‌హాట్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో సంగీత మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు రాంపుర్‌హాట్‌ వైద్య కళాశాల ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు.

Reported


By శివరామచారి.

నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము:

 నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: 


 న్యూఢిల్లీ/హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సోమవారం హైదరాబాద్‌ రానున్నారు. నేడు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, ప్రతి శీతాకాలానికి భారత రాష్ట్రపతి హైదరాబాద్​బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి(Rashtrapati Nilayam) విడిది చేయడానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్‌​కు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌​లోని పలు చోట్ల ట్రాఫిక్​ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 6.25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించి సేద తీరి, కొన్ని రోజులు ఇక్కడే ఉండనున్నారు. హైదరాబాద్‌లోని పబ్‌‌ల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, జాగిలాలతో ఎంట్రీ బొల్లారం నిలయానికి వెళ్లే మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్‌​కు సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్ కూడా చేశారు. ఈ ఏర్పాట్లు మొత్తాన్ని సైబరాబాద్​సీపీ ఏకే మహంతి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి కాన్వాయ్​వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీసులు, ఇంటెలిజెన్స్​సిబ్బంది పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్​, బొల్లారం జంక్షన్​, నేవీ జంక్షన్​, యాప్రాల్​రోడ్​, బైసన్​గేట్​, లోతుకుంట జంక్షన్​వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్​పోలీసులు తెలిపారు. అందుకు వాహనదారులు అందరూ ట్రాఫిక్​వారికి సహకరించాలని కోరారు. అందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. మరోవైపు, బొల్లారం రాష్ట్రపతి నిలయానికి శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడంతో అక్కడి నివాసంలో దాదాపు అన్ని పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షించి, పూర్తి చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనను రద్దు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కూడా భారీగా పెంచారు. 

హెచ్ఎండీఏ జేసీగా ఆమ్రపాలి బాధ్యతలు

హెచ్ఎండీఏ జేసీగా ఆమ్రపాలి బాధ్యతలు


: ప్రభుత్వ ఆలోచన అదేనా? 

         హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి కాటా (Amrapali kata) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బీ ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్ లతోపాటు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని తెలిపారు. ఆ తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంఛార్జీ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టారు. అధికారులతో చర్చించారు. నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కాగా, హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన హెచ్ఎండీఏపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏకు ఉన్నత పరిపాలన అధికారిగా కమిషన్ మాత్రమే ఉండగా.. తాజాగా, జాయింట్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని ప్రభుత్వం నియమించడం గమనార్హం. 2019 నుంచి హెచ్ఎండీఏకు కమిషనర్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కొనసాగుతున్నారు. వేలం ద్వారా రూ. వందల కోట్ల విలువైన భూముల అమ్మకాలు, ఔటర్ రింగ్ రోడ్ లీజు ఇతర ప్రాజెక్టులు ఆయన హయంలోనే జరిగాయి. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ టౌన్ షిప్ లు, శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మాణం ఇతరత్రా ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించింది. దీంతో మహా నగరాభివృద్ధిలో ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన హెచ్ఎండీఏ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి కమిషనర్‌ను పోస్టులో కొనసాగిస్తూనే.. కొత్తగా జాయింట్ కమిషనర్ పోస్టులో అదనంగా మరో ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని నియమించినట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర హెచ్ఎండీఏలో కీలకం కానుందని తెలుస్తోంది. అయితే, అరవింద్ కుమార్ ను కమిషనర్ గా కొనసాగిస్తారా? లేక కొత్త కమిషనర్‌ను నియమిస్తారా? వేచి చూడాలి. వన్ ఇండియా తెలుగును WhatsApp పై ఫాలో అవ్వండి Be the first one to Comment కవ్వింపులతో కాక పుట్టిస్తున్న రీతు చౌదరి ప్రతి రోజూ బీర్ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ

 మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ





: ఎక్స్‌గ్రేషియా పెంచే ఫైలుపై తొలి సంతకం 


 హైదరాబాద్: తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఆదివారం రాష్ట్ర సచివాలయంలో బాధత్యతలు స్వీకరించారు. అనంతరం కీలక ఫైలుపై సంతకం చేశారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచే ఫైలుపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తొలి సంతకం చేశారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుతం రూ. 5 లక్షలుగా ఉన్న పరిహారం రూ. 10 లక్షలకు ప్రభుత్వం పెంచనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడుతాయని మంత్రి సురేఖ తెలిపారు. మరోవైపు, వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు అనుమతిస్తూ మరో ఫైల్ పై ఆమె సంతకం చేశారు. నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అనంతరం అటవీ శాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. హరితహారం ద్వారా ఇప్పటి వరకు జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. కంపా పథకం ద్వారా చేపట్టిన పనులను, నిధుల వివరాలను మంత్రి కొండా సురేఖ అడిగి తెలుసుకున్నారు. అటవీ, దేవాదాయ శాఖలో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను అధికారులు తెలిపారు. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు చేపడతామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. కొండా సురేఖ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరై అభినందనలు తెలియజేశారు.

By Rajashekhar 

IAS 11 మంది ఐఏఎస్ ల బదిలీ..!!


 సీఎం రేవంత్ అధికార ప్రక్షాళన - 11 మంది ఐఏఎస్ ల బదిలీ..!! 

 తెలంగాణలో సీఎం రేవంత్ అధికార ప్రక్షాళన ప్రారంభించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి..నిఘా చీఫ్ గా శివధర్ రెడ్డిని రేవంత్ నియమించారు. ఆ తరువాత పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లకు పోస్టింగ్స్ ఇచ్చారు. హెచ్ఎండీఏ జాయింట్ సెక్రటరీగా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగిస్తూనే..కీలకమైన ఇంధన శాఖలో ఐఏఎస్ లను నియమించారు. ఇప్పుడు మరో 11 మంది అధికారుల బాధ్యతల్లో మార్పులు చేసారు. ఐఏఎస్ ల బదిలీలు : ముఖ్యమంత్రి రేవంత్ పాలన పరమైన నిర్ణయాలను వేగవంతం చేసారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో పురపాలక ముఖ కార్యదర్శిగా దాన కిశోర్‌ను నియమించింది. అలాగే ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యలు అప్పగించింది. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమించిన ప్రభుత్వం.. ఆయనకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. మెంటార్ సచిన్ టెండుల్కర్‌పైనా వేటు వేసిన ముంబై ఇండియన్స్‌: క్లారిటీ ఏంటీ? ఎవరికి ఏ బాధ్యత : అటవీశాఖ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్‌ బదిలీ చేయగా.. ఆమెకు ఈపీటీఆర్‌ఐ డెరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజును నియమించింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాకు బదిలీ చేయగా.. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషన్‌ర్‌గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేసింది. నల్గొండ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ నియమించింది. నియామకాలపై కసరత్తు : కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఐఏఎస్ అర్వింద్‌ కుమార్‌ పైన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆయనకు విపత్తు నిర్వహణ శాఖ అప్పగించింది. కీలకమైన పురపాలక శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉంది. ఆ శాఖ బాధ్యలను దాన కిషోర్ కు అప్పగించారు. ఇక...ఈ నియామకాల్లోనూ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ పోస్టింగ్ పైన స్పష్టత రాలేదు. మరి కొందరు ఐఏఎస్..ఐపీఎస్ ల బదిలీలు- పోస్టింగ్స్ కు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఇతర నియామకాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

నల్గొండ జిల్లాకు రానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి

 నల్గొండ జిల్లాకు రానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి


నల్గొండ జిల్లాకు రానున్న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి  కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి.        నల్గొండ పట్టణంలోని మంత్రి నివాసంలో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం, ప్రజలను కలుసుకోనున్న మంత్రివర్యులు*


*గత యేడాదిగా కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్ల తీరు.. భవిష్యత్ లో అనుసరించాల్సిన విధానం జిల్లాలోని మున్సిపాలిటీలలో తాగునీటి కల్పనలో  మరియు జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరాలో ఎదరవుతున్న ఇబ్బందులు వాటిని పరిష్కరించే మార్గాలు నిరంతర విద్యుత్ సరఫరాలో ఎదరవుతున్న సమస్యలు.. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఇతర విభాగాల అధికారులతో రివ్యూ మీటింగ్*

నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ బదిలీ

 


Friday, 15 December 2023

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఉప్పల పౌండేషన్ అండగా ఉంటుంది ఉప్పల శ్రీనివాస్ గుప్తా

 పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఉప్పల పౌండేషన్ అండగా ఉంటుంది ఉప్పల శ్రీనివాస్ గుప్తా


హైదరాబాద్ నాగోల్:  ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటకు చెందిన పేదింటి అమ్మాయికి పూస్తే మట్టెలు చీర గాజులు పండ్లు మరియు పెళ్లి కోసం 100 కిలోల బియ్యాన్ని అందించడం జరిగిందని ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు.
పెళ్లికూతురు పేరు బుడిగే భవాని సిద్దిపేటకు చెందిన ఈ అమ్మాయి బీసీ గౌడ కులమునకు చెందినది గరీబోళ్లకు అండగా ఎల్లప్పుడూ తెలంగాణ వ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాలకతీతంగా పేదింటి ఆడబిడ్డల వివాహం కోసం ఉప్పల పౌండేషన్ ఎల్లప్పుడు చేదోడుగా ఉంటుంది అని ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో రజిత టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు మరియు పెళ్లికూతురు పాల్గొన్నారు .

IAS అధికారుల ట్రాన్స్ఫర్ లు

 



IAS  అధికారుల ట్రాన్స్ఫర్ లు

హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి కాటా

మెడికల్ అండ్ హెల్త్  కమీషనర్ గా శైలజా రామయ్యర్

* ఎనర్జీ సెక్రటరీ, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ గా హెల్త్ సెక్రటరీ ముర్తజా రిజ్వీ

* ట్రాన్స్ కో, జెన్ కో జాయింట్ ఎండీ గా సందీప్ కుమార్ ఝా

* సీఎం ఓఎస్డీ గా కృష్ణ భాస్కర్

* టీఎస్ ఎన్పీ డీసీఎల్  సీఎండీ గా వరుణ్ రెడ్ది

టీఎస్ఎస్పీడీసీఎల్  సీఎండీ గా  ముషారఫ్ అలి ఫారుకీ

వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా బి. గోపి

Monday, 11 December 2023

రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఆధార్ కార్డులతో ఏజెన్సీల ముందు క్యూకట్టిన మహిళలు

రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఆధార్ కార్డులతో ఏజెన్సీల ముందు క్యూకట్టిన మహిళలు


                : తెలంగాణలో మహిళలంతా ఆధార్ కార్డులు పట్టుకుని గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. ఆధార్ ఈ-కేవైసీ అయితేనే కాంగ్రెస్ ప్రకటించిన రూ.500కే గ్యాస్ సిలిండర్‌ పథకం వర్తిస్తుందని వస్తున్న వార్తలే అందుకు కారణం. అయితే. అసలు విషయం తెలిసాక ఉసూరుమంటూ మళ్లీ ఇంటికి చేరుతున్నారు. ఇంతకీ ఈ-కేవైసీ ఏందీ.. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌‌కు సంబంధం ఏంటీ..?

గ్యాస్ సిలిండర్

                            : తెలంగాణలో ఆసక్తకిర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రచారం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే దిశగా సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే.. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధి పది లక్షలకు పెంపును అమల్లోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు. కాగా.. మిగిలిన హామీలను కూడా.. వీలైనంత తొందరగా అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్తోంది. అయితే.. కాంగ్రెస్ ఇచ్చిన మరో కీలక హామీల్లో ఒకటైనా రూ.500కే గ్యాస్ సిలిండర్‌ హామీని కూడా త్వరలోనే ప్రారంబించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచి మహిళలు ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.

అదేంటీ.. పథకం ప్రారంభించకముందే మహిళలు క్యూలు కట్టటమేంటీ అనుకుంటున్నారా.. అక్కడే ఉంచి అసలు కిటుకు. అయితే.. ఈ పథకం కోసం ఈ-కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రాదని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకేముంది.. ఈ- కేవైసీ చేయించుకునేందుకు మహిళలందరూ తమ ఆధార్ కార్డులు పట్టుకుని గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు.

చిన్నారులలో నమ్మకం మరియు భద్రతా భావం కలిగించడం ఎలా..!

అసలు విషయమేమిటంటే.. కేంద్ర ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ-కేవైసీ చేసుకొని మహిళలందరు వెంటనే చేయించుకోవాలని ప్రకటించింది. కాగా.. ఈ ప్రకటనకు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి లింకు పెట్టి వార్తలు ప్రచారం కావటంతో.. మహిళలు ఆందోళన పడ్డారు. అయితే.. కేంద్రం ప్రకటించిన ప్రకటనకు తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌కు ఎలాంటి సంబంధం లేదు అని గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఈ-కేవైసీ పూర్తి కానీ వారికి మాత్రమే చేస్తున్నామని తెలిపాయి. తెలంగాణలో గ్యాస్ లబ్ధిదారులందరూ ఈ విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఏజెన్సీలు సూచిస్తున్నాయి.

Sunday, 10 December 2023

ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్-2023 *ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యములో తేదీ 22 డిసెంబర్ 23 న హైదరాబాద్ లో ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్-2023 నిర్వహిస్తున్నామని గ్లోబల్ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ తెలిపారు. వైశ్యుల మధ్య పరిచయము, ఉభయ సహకారము, WAM అందించే సేవలు తెలియచేయడం మొదలగు విషయాలపై కన్వెన్షన్ నిర్వహించబడునని అయన తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించే ఈ కార్యక్రమములో ప్రముఖుల సందేశాలు, ప్రమాణ స్వీకరాళ్ళు, సాంస్కృతిక కార్యక్రమములు వుండగలవని, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ సభ్యులందరు పాల్గొనగలరని , కార్యస్థలము త్వరలో తెలుపబడునని, 17 జులై 2022 న అందరూ పాల్గొని విజయవంతం చేసినట్టే ఈ కన్వెన్షన్ కూడా సభ్యులందరు పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.

 



ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్-2023


*ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యములో తేదీ 22 డిసెంబర్ 23 న హైదరాబాద్ లో ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్-2023 నిర్వహిస్తున్నామని గ్లోబల్ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ తెలిపారు. వైశ్యుల మధ్య పరిచయము, ఉభయ సహకారము, WAM అందించే సేవలు తెలియచేయడం మొదలగు విషయాలపై కన్వెన్షన్ నిర్వహించబడునని అయన తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించే ఈ కార్యక్రమములో ప్రముఖుల సందేశాలు, ప్రమాణ స్వీకరాళ్ళు, సాంస్కృతిక కార్యక్రమములు వుండగలవని, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ సభ్యులందరు పాల్గొనగలరని , కార్యస్థలము త్వరలో తెలుపబడునని, 17 జులై 2022 న అందరూ పాల్గొని విజయవంతం చేసినట్టే ఈ కన్వెన్షన్ కూడా సభ్యులందరు పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.


*ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యములో తేదీ 22 డిసెంబర్ 23 న హైదరాబాద్ లో ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్-2023 నిర్వహిస్తున్నామని గ్లోబల్ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ తెలిపారు. వైశ్యుల మధ్య పరిచయము, ఉభయ సహకారము, WAM అందించే సేవలు తెలియచేయడం మొదలగు విషయాలపై కన్వెన్షన్ నిర్వహించబడునని అయన తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించే ఈ కార్యక్రమములో ప్రముఖుల సందేశాలు, ప్రమాణ స్వీకరాళ్ళు, సాంస్కృతిక కార్యక్రమములు వుండగలవని, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ సభ్యులందరు పాల్గొనగలరని , కార్యస్థలము త్వరలో తెలుపబడునని, 17 జులై 2022 న అందరూ పాల్గొని విజయవంతం చేసినట్టే ఈ కన్వెన్షన్ కూడా సభ్యులందరు పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.

ఆ కార్యాలయాలను కూల్చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 ఆ కార్యాలయాలను కూల్చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


             మూడు రోజుల్లోనే కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా.. ఇప్పుడు ఆర్ అండ్ బీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీని సుందరీకరించే పనులతో పాటు సీఎల్పీ కార్యాలయాలను కూల్చేస్తామని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి మూడు రోజులవుతున్న వేళ.. రేవంత్ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వేళ.. ఆయన కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్ అండ్ బీ శాఖ అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో.. తొమ్మిది ఫైళ్లపై సంతకం చేశారు. అసెంబ్లీ పరిసరాలు సుందరీకరణ చేస్తామని ప్రకటించారు. కాగా.. సీఎల్పీ కార్యాలయానికి కూల్చేస్తామని ప్రకటించారు. వాటి స్థానంలోనే కొత్త భవనాలు నిర్మిస్తామని తెలిపారు. కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని స్పష్టం చేశారు. త్వరలో కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం చేపడుతామని.. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

సంతకాలు చేసిన తొమ్మిది ఫైళ్లలో.. నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రహదారిని 4 లైన్‌ రోడ్డుగా మార్చటం.. కొడంగల్, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన దస్త్రాలు ఉన్నాయి. రానున్న రెండు మూడేళ్లలో రహదారుల విస్తీర్ణానికి పూర్తి చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి వెల్లడించారు. పదేళ్లుగా కేసీఆర్ సర్కార్ రహదారుల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి అడుగుతానన్నారు. ఆర్ఆర్ఆర్ సౌత్‌ను జాతీయ రహదారిగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిపారు.

చిన్నారులలో నమ్మకం మరియు భద్రతా భావం కలిగించడం ఎలా..!

వీటితో పాటు.. విజయవాడ- హైదరాబాద్ రహదారిని 6 లైన్లకు, హైదరాబాద్- కల్వకుర్తి 4 లైన్‌లకు పెంచటంతో పాటు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్)ని పెంచాలని అడుగుతానని కోమటిరెడ్డి తెలిపారు. ఈ మేరకు రేపే నితిన్ గడ్కరీని కలవనున్నట్టు తెలిపారు. భువనగిరి ఎంపీ పదవికి కూడా రేపే రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు.

Wednesday, 6 December 2023

తెలంగాణ కొత్త మంత్రుల జాబితా ఇదే.. ఆయనే డిప్యూటీ సీఎం..!

 తెలంగాణ కొత్త మంత్రుల జాబితా ఇదే.. ఆయనే డిప్యూటీ సీఎం..!

 తెలంగాణ కొత్త మంత్రుల జాబితా విడుదలైంది. రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రుల జాబితాను రాజ్‌భవన్‌కు అందించారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డితోపాటు వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   

             మరికొన్ని గంటల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డితోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితా కూడా విడులైంది. తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను రాజభవన్‌కు కాంగ్రెస్ నేతలు అందించారు.1. భట్టి విక్రమార్క,2. ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3.పొన్నం ప్రభాకర్,4. సీతక్క, 5.కొండా సురేఖ, 6.జూపల్లి కృష్ణారావు, 7.కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి,8. శ్రీధర్ బాబు, 8.తుమ్మల నాగేశ్వరరావు, 9.పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 10.దామోదర రాజనర్సింహలు కాసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మిగతా మంత్రులంతా ఉ. 11 గంటలకల్లా ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు వీరంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రివర్గ జాబితాలో చోటుదక్కిన వారికి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు.

'కాంగ్రెస్ పాలన ఏడాది మాత్రమే.. ఆ తర్వాత BJP సర్కారు వస్తుంది'

            :


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్ చేతులెత్తేయటం ఖాయమన్నారు. ఏడాది తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని.. తమ పార్టీ వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

ప్రధానాంశాలు:

కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులే పాలిస్తుంది

కేసీఆర్ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్ చేతులెత్తేయటం ఖాయం

ఏడాది తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

ఇంటిలోనే చిన్నారులకు అవసరమైన ఆహారం తయారుచేసుకోవడం ఎలా??

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని అన్నారు. ఒక్క ఏడాది మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందని.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం చతికిలపడుతుందని.. ఏడాదిలోపే ఆ పార్టీ చేతులెత్తేస్తుందని అన్నారు. ఆపై తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ప్రజలు సీఎంనే మార్చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని.. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్‌నే తెలంగాణ ప్రజలు మార్చేశారు అంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

పూజారికి దక్షిణ ఇవ్వటం..

                  పూజారికి దక్షిణ ఇవ్వటం..


ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాము ..దక్షత కలిగిన వారికి సమర్పించుకునేది దక్షిణ .. 

ప్రదక్షిణ అనేది మనము మనకుగా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలడము ప్రదక్షిణము,ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనము ప్రదక్షిణము భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము.


సమర్పణ ఎందుకు?


సాధారణముగా మనకు ఏ పని చేసి పెట్టినా వారు ఎవరు అయినా వారికి వారి కష్టానికి డబ్బులు లేక వారి కష్టానికి ప్రతిఫలము ఇవ్వడము ధర్మము .ఒకవేళ అలా ఇవ్వకపోతే అది పెద్ద అధర్మం ..

ఇది నేను కాదు, వాల్మీకి రామాయణములో భరతుడు చెప్పిన ధర్మము.ఇప్పుడు పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వడమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


వేదము అంటేనే దైవము, మానవ నేత్రముకి కనిపించని దైవము మంత్ర రూపములో వేదరాశిలో నిక్షిప్తమయి మనకు వినిపిస్తారు, 

మన సాధనకు మార్గము చూపి తనలో మనని తన వైపు నడిపించేదే వేదము. అటువంటి దైవముకి కానీ వేదముకి కానీ వెల కట్టే సొమ్ము ఎంత ?


పూజాదికాలు యజ్ఞ యాగాదులు చేయగలిగే దక్షత కలిగినవారు ఎవరు ?

కేవలము పూజారులే .. పూజారులకు దక్షిణ ఇచ్చేదీ వేదము చదివే దక్షత పొందిన దక్షులు కనుక. వారిలో ఉన్న వేదముకి విలువ, ఆ వేదముకి విలువ కట్టేంత వారము కాదు, ఈ విషయము గ్రహించాలి. వారికి దక్షిణ ఇవ్వడము అంటే మనము ఇవ్వగలిగినంత ఇవ్వడము కానీ 10 రూపాయలో లేక 100 రూపాయలో విలువ కట్టి ఇవ్వడము కానే కాదు. అది తప్పు . గుడిలో పూజ లేక అర్చన లేక హారతి లేక ఇతర ఎటువంటి క్రతువులు చేయించుకున్నా పూజారి గారికి దక్షిణ తప్పకుండా ఇవ్వవలసిందే.నియమం అనరు కానీ ఇది తప్పకుండా పాటించ వలసిన ధర్మం మరియు ఆచారం .. దక్షిణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకి పూర్తి ఫలితము ఎలా దక్కుతుంది.. ?


ఇది వాస్తవము మరియు సత్యము. పూజారులకు వారి సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడము చేత వారు సంతృప్తి చెందడము చేత పొందేవి ఏమిటంటే ?


1) వారి కంఠము, స్వరము , ఊపిరితిత్తులను అనుక్షణమూ నొప్పిస్తూ, అనుగుణముగా లయబద్ధముగా ఉపయోగిస్తూ మంత్రభాగము తప్పు దొర్లకుండా దేవతలను ఆవాహనము చేస్తూ పూజాదికాలు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలము, దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మము కోసము ఇవ్వడము.


2) జీవులను ఉద్ధరించడము దైవ ధర్మము, వేద రూపమున తనను స్మరించి సర్వ మనవాళికి శుభము కలిగించే మనకు మరియు దైవముకు సాధనముగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మేర దక్షిణ ఇస్తే, తన ధర్మము కోసము ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవము కూడా సంతృప్తి చెందుతారు. ఏవరికి ఎప్పుడూ ఋణపడి ఉండకూడదు.


3) ఉచితంగా ముహూర్తాలు, జాతకాలు అడగకూడదు.


జ్యోతిష్యునికి,పురోహితునికి ఎప్పుడూ ఋణపడిపోకూడదు.

వారి ద్వారా సేవలను తీసుకున్నప్పుడు తప్పక వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారిని గౌరవిస్తూ ఉంటే ..

వారి ఆత్మ సంతృప్తి మనకు దీవెనల రూపంలో మంచిని కలుగజేస్తాయి.

Tuesday, 5 December 2023

ఆచారాలు--సైంటిఫిక్ వివరణలు

 ఆచారాలు--సైంటిఫిక్  వివరణలు

(మూఢాచారాలు కాదు)మందిరము 


1. *మూలవిరాట్ 🚩 భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.

 

2. ప్రదక్షిణ 🚩 మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.


 3. ఆభరణాలతో దర్శనం 🚩 ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.


 4. కొబ్బరి కాయ 🚩 ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.


 5.మంత్రాలు 🚩 ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.


6. *గర్భగుడి 🚩 గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


7.*అభిషేకం 🚩 విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.


8. *హారతి 🚩 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.


9. *తీర్థం 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


10. *మడి 🚩 తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..

పిల్లాడి రుద్రయ్య

చట్టం 30-A రద్దు చేయబడవచ్చు-.

 మోడీ రెండో దెబ్బ రాబోతోంది,

 చట్టం 30-A రద్దు చేయబడవచ్చు-.

 నెహ్రూ హిందువులకు చేసిన ద్రోహాన్ని సరిదిద్దడానికి మోదీజీ పూర్తిగా సిద్ధమయ్యారు.

 మీరు "లా 30" మరియు లా "30A" గురించి విన్నారా?

 హిందీలో "30A" అంటే ఏమిటో తెలుసా?

 మరింత తెలుసుకోవడానికి ఆలస్యం చేయవద్దు ⬇

 30-A అనేది రాజ్యాంగంలో ఉన్న చట్టం.

 నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చాలని ప్రయత్నించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు.

 సర్దార్ పటేల్, "ఈ చట్టం హిందువులకు ద్రోహం, కాబట్టి ఈ చట్టాన్ని రాజ్యాంగంలోకి తీసుకువస్తే, దానికి వ్యతిరేకంగా నేను మంత్రివర్గం మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను.

 అంతిమంగా సర్దార్ పటేల్ కోరికకు నెహ్రూ తలవంచాల్సి వచ్చింది.

 కానీ దురదృష్టవశాత్తు తెలియదు.. ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకే సర్దార్ వల్లభాయ్ పటేల్ హఠాన్మరణం చెందాడా..?

 సర్దార్ పటేల్ మరణానంతరం నెహ్రూ వెంటనే ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చారు.


 30-A అంటే ఏమిటి, దాని ఫీచర్లను మీకు చెప్తాను!...

 ఈ చట్టం ప్రకారం - హిందువులు తమ "హిందూ మతాన్ని" బోధించడానికి/బోధించడానికి అనుమతించబడరు.  "చట్టం 30-A" అతన్ని అనుమతించదు లేదా అధికారం ఇవ్వదు.....

 కాబట్టి హిందువులు తమ ప్రైవేట్ కళాశాలల్లో హిందూ మతాన్ని బోధించకూడదు.

 హిందూ మతాన్ని బోధించడానికి కాలేజీలు ప్రారంభించకూడదు.  హిందూ మతాన్ని బోధించడానికి హిందూ పాఠశాలలు ప్రారంభించకూడదు.  చట్టం 30-A ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో హిందూ మత సంస్కృతిని బోధించడానికి ఎవరికీ అనుమతి లేదు.

 ఇది వింతగా ఉంది, (30-A) నెహ్రూ తన రాజ్యాంగంలో *"లా 30"*లో మరొక చట్టాన్ని చేసారు.  ఈ "లా 30" ప్రకారం ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ మత విద్య కోసం ఇస్లామిక్, సిక్కు, క్రైస్తవ మత పాఠశాలలను ప్రారంభించవచ్చు.

 ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ మతాన్ని బోధించవచ్చు.

 చట్టం 30 ముస్లింలకు వారి స్వంత 'మదరసా'ను ప్రారంభించేందుకు పూర్తి హక్కును మరియు అనుమతిని ఇస్తుంది మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 వారి స్వంత మతపరమైన పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడానికి మరియు బోధించడానికి క్రైస్తవులకు పూర్తి హక్కు మరియు అనుమతిని ఇస్తుంది.  మీ మతాన్ని ఉచితంగా ప్రచారం చేయండి... ఇందులోని ఇతర చట్టపరమైన అంశం ఏమిటంటే, హిందూ దేవాలయాల డబ్బు మరియు ఆస్తులన్నీ ప్రభుత్వ విచక్షణకు వదిలివేయవచ్చు, హిందూ భక్తులు హిందూ దేవాలయాలకు ఇచ్చే డబ్బు మరియు ఇతర విరాళాలన్నీ రాష్ట్ర ఖజానాకు వెళ్తాయి.  లోపలికి తీసుకోవచ్చు.

 అదే సమయంలో, ముస్లిం మరియు క్రైస్తవ మసీదుల నుండి విరాళాలు మరియు భిక్ష క్రైస్తవ-ముస్లిం సమాజానికి మాత్రమే ఇవ్వబడుతుంది.  ఈ "చట్టం 30" యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి.

 కాబట్టి, చట్టం 30-A" మరియు "చట్టం 30" అనేది హిందువులపై ఉద్దేశపూర్వక వివక్ష మరియు ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధమైన ద్రోహం.

 ఈ రోజు హిందువు జానపద కథలకే పరిమితమైందనే విషయాన్ని అందరూ బాగా అర్థం చేసుకోవాలి.  హిందువులకు వారి గ్రంధాల జ్ఞానం లేదు.  నేర్చుకో

 ఇతరుల పట్ల అవగాహన మనమందరం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం.  చదవండి, నేర్చుకోండి మరియు వ్యాప్తి చేయండి..

 దీనికి కారణం ఆర్టికల్ 30-A

 మన దేశంలో ఎక్కడా భగవద్గీత బోధించలేము.

 చదివిన తర్వాత, మీకు సరిగ్గా అనిపిస్తే, దయచేసి ఫార్వార్డ్ చేయండి.  కాబట్టి ప్రతి ఒక్కరూ టికి, దయచేసి దీన్ని 5 మందికి ఫార్వార్డ్ చేయండి.*

షాక్ లో అమిత్ షా..!

 షాక్ లో అమిత్ షా..!



తెలంగాణ ఎన్నికల రిపోర్ట్ తెప్పించుకున్న అమిత్ షా...

 5 రాష్ట్రాల గెలవాల్సిన మనం తెలంగాణలో ఇంత దారుణంగా ఎలా ఓడిపోయాం అని ఆరా.


 ఈటెల రాజేందర్ చెప్పిన 50 లక్షల ముదిరాజ్ ఓట్లు ఏమయ్యాయి..?


బిసి సీఎం అని ప్రజాల్లోకెళ్తే, తన ఎమ్మెల్యే సీఎం అవుతాడని తెలిసి కూడా సొంత నియోజకవర్గ ప్రజలే ఎందుకు ఓడించారు..?


రెండు స్థానాల్లో దారుణ ఓటమికి కారణాలు ఏమిటీ..?


బండి సంజయ్ హిందుత్వ ఎజెండా వల్ల ఓట్లు రావని ఫిర్యాదు చేసిన ఈటెల, తన సొంత ఫార్ములా తో వెళ్తే ఎలా ఓడిపోయాడు..?


ఈటెల సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్న చోట్ల కనీసం డిపాజిట్ రాని పరిస్థితి కి కారణం ఏమిటి..?


6 నెలల ముందు 23 శాతం ఉన్న ఓటు బ్యాంకు 13 శాతానికి ఎలా పడిపోయింది..?


ఎంత గుర్తింపు ఇచ్చినా ఈటెల వల్ల పార్టీ కి వచ్చిన లాభం ఏమిటీ..?

అన్ని విషయాలపై ఆరా తీసిన అమిత్ షా..


 అసలు ఇంత గుడ్డిగా ఎలా నమ్మాము అర్థం కాని పరిస్థితి. సొంత నేతలని కాదని ఇతని మాటలు వింటే ఈరోజు మనమే చేతులారా పార్టీని నాశనం చేసుకున్నట్టు అయింది.


ఈటెల ని గుడ్డిగా నమ్మి మోసపోయామని గ్రహించనట్టుగా ఢిల్లీ నుండి సమాచారం..

Monday, 4 December 2023

ప్రపంచ నేల దినోత్సవం


 

తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు

 తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ

             : హైదరాబాద్: మరికొన్ని గంటల్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుండగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ముకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ చైర్మన్లు తమ రాజీనామా లేఖలను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పంపించినట్లు సమాచారం. పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న డా .దూది మెట్ల బాలరాజ్ యాదవ్ రవీందర్ సింగ్, డా. వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, పాటి మీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా .ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తమ ఛైర్మన్ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల కనుగుణంగా పనిచేస్తాం అన్నారు.


రాజీనామా చేసిన కార్పొరేషన్ల చైర్మన్లు వీరే.. 

1. సోమ భరత్ కుమార్ - చైర్మన్, రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్

2. జూలూరి గౌరీ శంకర్  - చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ

3. పల్లె రవి కుమార్ గౌడ్ - చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ 

4. డాక్టర్ ఆంజనేయ గౌడ్ - చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ

5. మేడె రాజీవ్ సాగర్ - చైర్మన్, TS Foods Corporation 

6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ - చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ

7. గూడూరు ప్రవీణ్ - చైర్మన్, టైక్స్టైల్స్ కార్పొరేషన్

8. గజ్జెల నగేష్ - చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్

9. అనిల్ కూర్మాచలం - చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్

10.రామచంద్ర నాయక్  - చైర్మన్, ట్రైకార్

11. వలియా నాయక్ - చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ

12. వై సతీష్ రెడ్డి - చైర్మన్, 

13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్  - చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ

14. రవీందర్ సింగ్ - చైర్మన్, పౌర సరఫరాల సంస్థ

15.  జగన్మోహన్ రావు - చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్


ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా

తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డి. ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రభాకర్ రావు వెల్లడించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి 25 అక్టోబర్ 2014 నుంచి టీఎస్ ట్రాన్‌కో, జెన్ కోకు సీఎండీ హోదాలో కొనసాగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న సమయంలో తన పదవికి ఆయన రాజీనామా చేశారు.


టాస్క్ ఫోర్స్ ఎస్డీ రాధాకిషన్ రావు రాజీనామా...

తన ఉద్యోగానికి టాస్క్ ఫోర్స్ ఎస్డీ రాధాకిషన్ రావు రాజీనామా చేశారు. అయితే మూడేళ్ల కిందటే ఆయన పదవీకాలం ముగిసినా, ఇంకా టాస్క్ ఫోర్స్ లోనే కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తరుణంలో తన రాజీనామాను ప్రభుత్వానికి పంపించారు రాదా కిషన్ రావు.

టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామా


ప్రభాకర్ రావు.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి 25 అక్టోబర్ 2014 నుంచి టీఎస్ ట్రాన్‌కో, జెన్ కోకు సీఎండీ హోదాలో కొనసాగుతున్నారు. : ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా

                


తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)డి. ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రభాకర్ రావు వెల్లడించారు. ప్రభాకర్ రావు.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి 25 అక్టోబర్ 2014 నుంచి టీఎస్ ట్రాన్‌కో, జెన్ కోకు సీఎండీ హోదాలో కొనసాగుతున్నారు. 

Ravi Gupta IPS appointed as new DGP of Telangana


 

Friday, 1 December 2023

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

 సూర్యాపేట: జిల్లాలో డిసెంబర్ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు


చేపట్టామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్స్‌తో పాటు కౌంటింగ్ హాల్స్‌ను ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... కౌంటింగ్ రోజున ప్రతి నియోజకవర్గం హాల్లో 14 చొప్పున మొత్తం 56 టేబుల్స్ ఏర్పాటు చేసి ప్రతి టేబుల్‌కి‌ మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్‌వైసర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అలాగే పార్టీ ఏజెంట్లతో పాటు సర్వీస్ అందించేందుకు 50 మంది రెవెన్యూ సిబ్బంది ఉంటారని తెలిపారు. కౌంటింగ్ రోజున నిఘా నీడలో పటిష్ఠ భద్రత కల్పిస్తున్నామని అన్నారు. హుజూర్ నగర్ 308 పోలింగ్ కేంద్రాలకు 22 రౌండ్స్, కోదాడ 296 పోలింగ్ కేంద్రాలకు 22 రౌండ్స్, సూర్యాపేట లోని 271 పోలింగ్ కేంద్రాలకు 20 రౌండ్స్, అలాగే తుంగతుర్తి లోని 326 పోలింగ్ కేంద్రాలకు 24 రౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.


అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొరకు హుజూర్‌నగర్ కౌంటింగ్ హాల్‌కు 4 టేబుల్స్, కోదాడకు 5 టేబుల్స్, సూర్యాపేటకు 6 టేబుల్స్, తుంగతుర్తికి 3 టేబుల్స్ మొత్తం 18 టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు కౌంటింగ్ వివరాలను పాత్రికేయ మిత్రులకు తెలుపుటకు మార్కెట్ యార్డ్ నందు మీడియా సెంటర్ ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఆర్ఓ అదనపు కలెక్టర్ ఏ.వెంకట్ రెడ్డి, సూర్యాపేట ఆర్ఓ వీర బ్రహ్మచారి, కోదాడ ఆర్ఓ సూర్యనారాయణ, హుజూర్ నగర్ ఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి , తహాసిల్దార్లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ....

జిల్లాలోని ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 30న పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగినందుకు ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలసి పనిచేసినందుకు అలాగే పార్టీల ప్రతినిధులు, నాయకులకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్‌కు కూడా సహకరించాలని, కౌంటింగ్ రోజున కౌంటింగ్ ఏజెంట్లు తమ పాసుల కొరకు రిటర్నింగ్ అధికారికి శుక్రవారం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే గెలిచిన అభ్యర్థులు అదే రోజు ఎక్కడ కూడా ర్యాలీలు చేపట్టారాదని, మరుసటి రోజు ర్యాలీలు నిర్వహించే అభ్యర్థులు ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి, కౌంటింగ్ ప్రక్రియ ఇలా

  తెలంగాణ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి, కౌంటింగ్ ప్రక్రియ ఇలా

 దేశంలో ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో మిజోరాం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల కౌంటింగ్ రేపు జరగనుంది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా వ్యవస్థ ఇలా ఉన్నాయి.

: తెలంగాణ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి, కౌంటింగ్ ప్రక్రియ ఇలా

        : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా తెలంగాణపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 

            మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం రేపు తేలనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి.  ప్రతి టేబుల్ వద్ద ఎన్నికల సిబ్బంది నలుగురు ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకై ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈసారి తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.80 లక్షలుంది. తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉండటంతో 8.30  తరువాతే ఈవీఎం లెక్కింపు ఉంటుంది. అంటే మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి 9 గంటలు కావచ్చు. ఆ తరువాత ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం తేలనుంది. 

కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, పఠాన చెరువు, నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఇక రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేర్‌లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500 పైగా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఈవీఎంను మూడు సార్లు లెక్కిస్తారు. అందుకే ఫలితాలు కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశాలున్నాయి. 

ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతతో పాటు ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం. కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులు నిషేదం. మద్యం దుకాణాలు మూసివేసుంటాయి. మద్యాహ్నం 1 గంటకు తెలంగాణ ఫలితాలపై స్పష్టత రావచ్చు. 

            



తెలంగాణలో మొత్తం ఓట్ల సంఖ్య 3,26,02,793 కాగా అందులో 2,32,59,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 71 శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36 శాతం పోలింగ్ నమోదు కాగా ఆలేరు నియోజకవర్గంలో 90.77 శాతం పోలింంగ్ నమోదైంంది. అత్యల్పంగా యాకుత్ పురాలో 39.64 శాతం పోలింగ్ నమోదైంది. 

డిసెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే

 

డిసెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే

2023లో చివరి నెల డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమ పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం నుంచి డిసెంబర్‌ నెల మొదలైంది.అయితే, ఈ నెలలో పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవుల (Bank Holidays ) జాబితాను ముందుగానే జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. అయితే ఆర్‌బీఐ సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయి. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ మాత్రం కామన్‌గా ఉంటాయి.

 Bank Holidays list in december 2023.

డిసెంబర్ నెలలో సెలవుల జాబితా:

డిసెంబర్ 1 (శుక్రవారం) - అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం / స్థానిక విశ్వాస దినోత్సవం.
డిసెంబర్ 3 (ఆదివారం) - దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 4 (సోమవారం) - సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ ఫీస్ట్ డే - గోవాలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 9 (రెండో శనివారం) - దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 10 (ఆదివారం) - దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 12 (మంగళవారం) - పా-తోగాన్ నెంగ్మింజా సంగ్మా - మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 13, 14 (బుధ, గురువారం) - లోసూంగ్/ నామ్ సూంగ్ - సిక్కింలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 17 (ఆదివారం) - దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 18 (సోమవారం) - యూ సోసోథామ్ వర్ధంతి - మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 19 (మంగళవారం) - గోవా విముక్తి దినోత్సవం - గోవాలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 23 (నాలుగో శనివారం) - దేశవ్యాప్తంగా సెలవు.
డిసెంబర్ 24 (ఆదివారం) - దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 25 (సోమవారం) - క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 26 (మంగళవారం) - క్రిస్మస్ సంబరాల సందర్భంగా మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు.
డిసెంబర్ 27 (బుధవారం) - క్రిస్మస్ సంబరాల సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 30 (శనివారం) - యూ కియాంగ్ నాంగ్ బాహ్- మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 31 (ఆదివారం) - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

Wednesday, 29 November 2023

తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేశారు:రాజా సింగ్

 తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేశారు

                                 




: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోలింగ్‌ను సజావుగా కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఓటర్లు అధికారాన్ని ఎవరికి కట్టబెట్టారనేది తేలిది అప్పుడే. వారికేనా?.. మాకు డబ్బులివ్వరా?: మిర్యాలగూడలో మహిళా ఓటర్ల ఆందోళన ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ (Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టతను ఇచ్చారు. ఈ మధ్యాహ్నం ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున తన సొంత నియోజకవర్గం గోషామహల్ నుంచి పోటీలో ఉన్న విషయం తెలిసిందే.  ఈ ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లు వస్తాయని రాజా సింగ్ అంచనా వేశారు. మరో 50 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వనున్నామని వివరించారు. 45 రోజులుగా తాను గోషామహల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటినీ పలకరించానని, అందరి మదిలోనూ బీజేపీ ఉందని స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లు ఎప్పుడో తీర్మానించుకున్నారని వ్యాఖ్యానించారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు తనను ఎలా ఆదరించారో.. ఈ ఎన్నికల్లో కూడా అదే తరహాలో ఆదరిస్తారని, గోషామహల్.. బీజేపీకి కంచుకోటగా మారిందని రాజా సింగ్ ధీమా అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఇక్కడ కమలం మాత్రమే వికసిస్తుందని, మరే ఇతర పార్టీకీ అవకాశమే లేదని స్పష్టం చేశారు. 

తెలంగాణ..పోలింగ్‌కు సర్వం సిద్ధం..!

 తెలంగాణ..పోలింగ్‌కు సర్వం సిద్ధం..! 


                 :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ముఖ్యంగా మూడు పార్టీల మధ్యే కనిపిస్తోంది. అధికారిక బీఆర్ఎస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీల మధ్యే పోటీ ఉంది. ఇక మంగళవారంతో ప్రచారం ముగిసింది. ప్రచార సమయంలో నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేశారు. చివరి రోజైతే మాటల యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరింది. ప్రతిపక్షాలు అధికార పార్టీ వైఫల్యాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా... అధికార పార్టీ తాము సాధించిన విజయాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. ఇక 119 అసెంబ్లీ స్థానాల్లో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. చివరి నిమిషంలో క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.