Tuesday, 2 December 2025

*జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని నేడు మహా ధర్నా -టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

 *జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని 

నేడు మహా ధర్నా


-టీయూడబ్ల్యూజే 

 రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

హైదరాబాద్, డిసెంబర్2 :


తెలంగాణ రాష్ట్రంలో గత 12 ఏళ్లుగా నిర్లక్ష్యానికి, నిరాధరణకు గురవుతున్న పాత్రికేయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ వద్ద ఉదయం 10 గంటలకు ఈ ధర్నా ప్రారంభమవుతుందని చెప్పారు.  మంగళవారం బషీర్ బాగ్ లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరాహత్ అలీ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాత్రికేయులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. పోరుబాట పడతామని  హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాత్రికేయుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీల అమలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొంటారని చెప్పారు.  అక్రెడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని , వృత్తి కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలని, సంక్షోభంలో ఉన్న చిన్న, మధ్యతరగతి పత్రికలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి , టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వి.యాదగిరి, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు శిగ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home