లక్ష్యం మేరకు టాక్స్ వసూలు చేయాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్
లక్ష్యం మేరకు టాక్స్ వసూలు చేయాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్
హైదరాబాద్, మే 24: లక్ష్యం మేరకు టాక్స్ వసూలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పన్వార్ హాల్ లో టౌన్ ప్లానింగ్ అడిషనల్ సి సి పి, డిప్యూటీ కమిషనర్లు, ఏ.సి.పి లతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ కంటెంప్ట్ కోర్టు కేసుల పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... బిల్లు కలెక్టర్లు రెసిడెన్షియల్ టాక్స్ తో పాటుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కూడా వాసులు చేయాలని డిప్యూటీ కమిషనర్ లను ఆదేశించారు. రెసిడెన్షియల్ నుండి కమర్షియల్ గా మార్చి పన్ను వసూళ్లు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సర్కిల్ స్థాయిలో దినం తప్పించి దినం సమీక్ష చేసుకుని టాక్స్ వసూళ్ల లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. డి సి లతో టాక్స్ పై అడిషనల్ కమీషనర్ కూడా రివ్యూ చేయాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో వాసులు చేయకుండా నిర్దేశించిన లక్ష్యం మేరకు వసూలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
అంతకు ముందు కమీషనర్ వివిధ జోన్ లలో ఉన్న కంటెంప్ట్ కేసులకు సరైన రిప్లై ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఒక్కొక్క జోన్ వారిగా కంటెంప్ట్ కేసులు సమీక్షించారు. కోర్టు తీర్పు ప్రకారం గా సరైన రిప్లై ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో అవసరమైన సహాయం కొరకు లీగల్ ఓ.ఎస్.డి, అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ, సిసిపి శ్రీనివాస్ లను సంప్రదించాలని సూచించారు. కంటెంప్ట్ కేసులు తర్వాత వచ్చే వారంలో రిట్ పిటిషన్ లపై రివ్యూ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఈ సమావేశంలో సిసిపి శ్రీనివాస్, అడిషనల్ కమీషనర్లు అనురాగ్ జయంతి, సత్యనారాయణ, వేణు గోపాల్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రామ్ నాయక్, ఆడిషనల్ సిసిపి వెంకన్న, లీగల్ ఓ.ఎస్.డి సుధీర్, డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి లు తదితరులు పాల్గొన్నారు.
-------------------------------------------------------------
- సిపిఆర్ఓ జీహెచ్ఎంసీ ద్వారా జారీ చేయడమైనది.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home