Thursday, 22 May 2025

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

మన శరీరంలో ముఖ్యమైన భాగాలుగా మూత్రపిండాలను చెప్పాలి. సరిగ్గా మూత్రపిండాలు పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి రక్తంలో మలినాలు చేరకుండా మన శరీరాన్ని కాపాడతాయి. ఇక అటువంటి మూత్రపిండాల ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరికి కచ్చితంగా శ్రద్ధ ఉండాలి. ఒక్కోసారి మూత్రపిండాల సమస్య వచ్చినప్పటికీ సమస్య తీవ్రతరం అయ్యేవరకు అర్థం కాదు.

మూత్రపిండాలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలు

మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రావడానికి ముందు శరీరంలో కొన్ని లక్షణాలు తప్పకుండా కనిపిస్తాయి. ఒకవేళ ఆ లక్షణాలు కనిపిస్తే మూత్రపిండాల వైద్యుల్ని సంప్రదించి, మూత్రపిండాల ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కచ్చితంగా చేయాలి. ఇక ఇంతకీ మూత్రపిండాలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలు ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

చర్మ ఆరోగ్యానికి మూత్రపిండాల ఆరోగ్యానికి లింక్

మూత్రపిండాలు పాడయ్యే ముందు మన శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీ సమస్య మూత్ర విసర్జన మరియు కడుపు నొప్పికి సంబంధించిన లక్షణాలకు పరిమితం కాదు. మూత్రపిండాలు పాడయ్యే ముందు అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పొడిబారడం, దురదగా అనిపించడం, పొరలు పొరలుగా మారడం మూత్రపిండాల సమస్యలకు సంబంధించిన లక్షణాలుగా చెప్పవచ్చు. కాబట్టి చర్మానికి సంబంధించి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త.

కళ్ళ చుట్టూ వాపు.. నిర్లక్ష్యం చెయ్యొద్దు

ఒక్కోసారి కిడ్నీ సమస్యలకు సంబంధించిన లక్షణాలు కళ్ల ద్వారా తెలుస్తాయి. కళ్ళ చుట్టూ వాపుకు కంటి పరీక్షలు చేయించుకున్నా ఎటువంటి కారణం తెలియకపోతే కచ్చితంగా కిడ్నీల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి. కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, కళ్ళ చుట్టూ వాపు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇక కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, కళ్ళలో వాపు వంటి లక్షణాలు కిడ్నీ సమస్యలకు కారణం.

ఈ లక్షణాలతో కిడ్నీలకు ముప్పు

కిడ్నీలు రక్తాన్ని సరిగ్గా వడ పోయకపోతే రక్తహీనత కలుగుతుంది. ఫలితంగా అలసట నీరసం వంటి సమస్యలు వస్తాయి .ఇక కిడ్నీలు వ్యర్ధాలను వడపోసి మూత్రం గా బయటకు పంపించకపోతే మూత్ర విసర్జన కూడా తక్కువ అవుతుంది. మూత్రంలో రంగు మార్పు, దుర్వాసన రావడం కూడా కిడ్నీలు సరిగా పనిచేయడం లేదేమో అని చెప్పడానికి సంకేతం. వీపుపై భాగంలో పక్కటెముకల కింద కుడి లేదా ఎడమ వైపున నొప్పి వస్తే అది కూడా కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పే సంకేతం. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయొద్దు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. దీనిని ధృవీకరించలేదు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home