Thursday, 22 May 2025

రేవంత్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ - సీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్..!!





రేవంత్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ - సీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్..!!

ఒక ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి కాళ్లు మొక్కటం సంచలనంగా మారింది. హోదాను మరిచి వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్‌ రామకృష్ణారావు హెచ్చరికలు జారీ చేశారు. హోదాను కించపరిచేలా, వ్యక్తిత్వాన్ని తగ్గించుకునేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవ ని హెచ్చరించారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమంత్రి సైతం అధికారులు హోదాకు తగిన విధంగా నడుచుకోవాలని.. ఈ విధమైన శైలి సరి కాదని మందలించారు. సీఎం సూచన మేరకు సీఎస్ ఈ ఉత్తర్వులు జారీ చేసారు.

సీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా మాచారంలో ఇందిర సౌర గిరి జలవికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఐఏఎస్‌ అధికారి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ శరత్‌ సీఎంను ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా ఆయన కాళ్లు మొక్కారు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో, కొందరు ఐఏఎస్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో పాటు వారి ప్రవర్తనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సీరియస్ అయ్యారు. సర్వీస్ హోదాకు తగనిది ఏది చేయ వద్దంటూ ఐఏఎస్‌ అధికారులకు ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ కాస్తా ఘాటుగా వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఆ క్రమంలో ఐఏఎస్ అధికారులకు ఆయన పలు సూచనలు చేస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాళ్లకు ఐఏఎస్ అధికారి శరత్ మొక్కిన ఘటన పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో, ఈ వ్యవహారం పైన సీఎస్ రామకృష్ణారావు స్పందించారు. ఆ క్రమంలో కీలక సూచనలతో కూడిన ఉత్తర్వులను ఆయన జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల అనుచిత ప్రవర్తన వల్ల ఐఏఎస్‌ల ప్రతిష్టను దెబ్బ తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇలాంటి చర్యల కారణంగా ఐఏఎస్‌ అధికారుల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని తెలిపారు. ఐఏఎస్ 1968 లోని 3(1) నియమావళి ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యుడు విధుల పట్ల అంకిత భావంతో ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఐఏఎస్‌లకు సూచించారు. సర్వీస్ హోదాకు తగనిది ఏది చేయొద్దంటూ ఐఏఎస్‌లకు ఆయన కాస్తా ఘాటుగా సూచించారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home