ఎల్బీనగర్ జోన్ లో పర్యటించిన కమిషనర్ ఆర్.వి.కర్ణన్
ఎల్బీనగర్ జోన్ లో పర్యటించిన కమిషనర్ ఆర్.వి.కర్ణన్
హైదరాబాద్, ఎల్బీనగర్ జోన్ లో పలు అభివృద్ధి పనులను గురువారం జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ జోన్ లోని సరూర్ నగర్ సర్కిల్ లో పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. వెంకటేశ్వర కాలనీ కి వెళ్లగా ఆ కాలనీకి చెందిన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కమిషనర్ ను కలిసి కాలనీకి సంబంధించి సమస్యలు వివరించగా వెంటనే పరిష్కరించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్ లను ఆదేశించారు. గడ్డిఅన్నారం డివిజన్ లో బాక్స్ డ్రెయిన్ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వల్లభ నగర్ లో వాటర్ లాగింగ్ పాయింట్ ను కమిషనర్ పరిశీలించారు.
కమీషనర్ వెంట జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్.ఈ అశోక్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
------------------------------
- సిపిఆర్ఓ జీహెచ్ఎంసీ ద్వారా జారీ చేయడమైనది.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home