ఘనంగా జరిగిన శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ****************************** పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యానంద శంకర భారతి మహాస్వామి చేతుల మీదుగా, సబ్బండ వర్గాలకు చెందిన రాష్ట్రస్థాయి ప్రముఖులు, నాయకులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల సమక్షంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా.. అత్యంత వైభవంగా జరిగిన శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయము నేడు అనగా తేదీ: 19.5.2025 సోమవారం రోజున రెండవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది... వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత దేవాలయమైన పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు గ్రామములోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు... అచ్చులాపురం చెందిన అవధాని దుద్దిల్ల మనోహర్ శర్మ ఆధ్వర్యంలో... దేవాలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ సారధ్యంలో గణపతి హోమము, రుద్ర హోమము, నవగ్రహ పూజా కార్యక్రమాలు, వాస్తు పుణ్యాహవచనములు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు... ఈ కార్యక్రమంలో దేవాలయం నిర్మాణ కర్త తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొని కార్యక్రమాలను నిర్వహించారు... వీరితో పాటు చైర్మన్ పోతరాజుల భూమయ్య, పోతరాజుల అవినాష్, కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు... ఈ రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో రాగినేడు ప్రజలతోపాటు చుట్టుపక్కల 25 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి స్వామి వారి ఆశీస్సులతోపాటు తీర్థ ప్రసాదాలను అందుకున్నారు
ఘనంగా జరిగిన శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు
****************************** పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యానంద శంకర భారతి మహాస్వామి చేతుల మీదుగా, సబ్బండ వర్గాలకు చెందిన రాష్ట్రస్థాయి ప్రముఖులు, నాయకులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల సమక్షంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా.. అత్యంత వైభవంగా జరిగిన శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయము నేడు అనగా తేదీ: 19.5.2025 సోమవారం రోజున రెండవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది...
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత దేవాలయమైన పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు గ్రామములోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు... అచ్చులాపురం చెందిన అవధాని దుద్దిల్ల మనోహర్ శర్మ ఆధ్వర్యంలో... దేవాలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ సారధ్యంలో గణపతి హోమము, రుద్ర హోమము, నవగ్రహ పూజా కార్యక్రమాలు, వాస్తు పుణ్యాహవచనములు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు...
ఈ కార్యక్రమంలో దేవాలయం నిర్మాణ కర్త తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొని కార్యక్రమాలను నిర్వహించారు... వీరితో పాటు చైర్మన్ పోతరాజుల భూమయ్య, పోతరాజుల అవినాష్, కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు... ఈ రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో రాగినేడు ప్రజలతోపాటు చుట్టుపక్కల 25 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి స్వామి వారి ఆశీస్సులతోపాటు తీర్థ ప్రసాదాలను అందుకున్నారు

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home