Sunday, 18 May 2025

భారత్ దెబ్బ.. కుప్పకూలిన టర్కీ ఆర్థిక వ్యవస్థ.. పెళ్లిళ్లు క్యాన్సిల్, షేర్లు డౌన్

 భారత్ దెబ్బ.. కుప్పకూలిన టర్కీ ఆర్థిక వ్యవస్థ.. పెళ్లిళ్లు క్యాన్సిల్, షేర్లు డౌన్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులకు కౌంటర్ గా పాకిస్థాన్ భారత్ లోని కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసింది. పాక్ నుంచి దూసుకొచ్చిన దాదాపు 600 డ్రోన్లను సమర్థవంతంగా నేల కూల్చినట్లు భారత రక్షణశాఖ పేర్కొంది. అయితే ఈ డ్రోన్లు టర్కీ దేశం.. పాకిస్థాన్ కు సరఫరా చేసింది. దీంతో టర్కీపై భారత్ లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే బాయికాట్ టర్కీ నినాదం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. టర్కీ ఉత్పత్తులను భారత్ లో బ్యాన్ చేయాలని పలు వ్యాపార సంఘాలు తీర్మానించాయి. అంతేకాక పకడ్బందీగా అమలు చేశాయి. అటు భారత్ ఉత్పత్తులను కూడా టర్కీకు ఎగుమతి చేయకుండా నిలిపివేశాయి. ఈ క్రమంలో టర్కీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో బాయికాట్ టర్కీ ప్రారంభించిన రెండు రోజులకే టర్కీ ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైనట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాక మేకిన్ ఇండియా, ఏవియేషన్, మెట్రో రైలు.. తదితర రంగాల్లో టర్కీకి చెందిన పలు కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేసేందుకు భారత్ సిద్ధమైంది. దీంతో టర్కీ తలపట్టుకుంది. పాకిస్థాన్ కు సాయం చేసి పెద్ద తప్పు చేశామని అనుకుంటోంది. అంతేకాక టర్కీ బ్రాండ్లను సైతం నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో టర్కీ తయారుచేసే వస్త్రాలను ప్రముఖ రిటైల్‌ సంస్థలు నిలిపివేశాయి. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్ అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్థాన్ కు సాయం చేసిన టర్కీకి మరో రూపంలోనూ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఆఖరికి టర్కీలో పెళ్లిళ్లు కూడా ఆగిపోయినట్లు సమాచారం. 2024లో టర్కీలో భారతీయ వివాహాల సంఖ్య 50 గా ఉంది. టర్కీలో భారతీయులు వివాహాలు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈ పెళ్లిళ్ల ద్వారా ఏటా టర్కీకి 140 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. అయితే ఇప్పుడు బాయికాట్ టర్కీ నినాదంతో అక్కడి వివాహాలు నిలిచిపోయాయి. దీంతో టర్కీకి మిలియన్ డాలర్లు లాస్ గా చెప్పవచ్చు.

అంతేకాక టర్కీకి చెందిన సెల్ బీ అనే విమానయాన సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని భారత్ ఉపసంహరించుకుంది. దీంతో ఈ కంపెనీ షేరు విలువకు బాగానే దెబ్బ పడింది. భారతీయ విమానాశ్రయాల్లో సరకుల రవాణాతో పాటు ఇతర కార్గో సేవల్ని అందించిన ఈ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని భారత్ తాజాగా రద్దు చేసుకుంది. ఈ సమయంలోనే అదానీ సంస్థ సైతం సెల్ బీతో తాను చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో.. ఈ సంస్థకు చెందిన షేర్లు తీవ్రంగా పడిపోయాయి.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home