యాదగిరిగుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్
యాదగిరిగుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్
:యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయ బంగారు గోపురాన్ని స్వామివారికి సీఎం రేవంత్ అంకితం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు నిర్ణయించిన సుమూర్తాన మహా కుంభాభిషేక సంప్రోక్షణ జరిగింది. వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాల మధ్య ముఖ్యమంత్ రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. Also Read ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న అనుష్క , ప్రభాస్ ఫిదా అంగరంగ వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Powered By కాగా, యాదాద్రి ఆలయ గోపురానికి బంగారం తాపడం కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తయిన స్వర్ణతాపడ గోపురం ఇదే కావడం విశేషం. విమానంపై ఉన్న నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండవగా దర్శనమిచ్చాయి.





0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home