ప్రజలకు సేవ చేయాలంటే పదవులే ఉండాల్సిన అవసరం లేదు*:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*
ప్రజలకు సేవ చేయాలంటే పదవులే ఉండాల్సిన అవసరం లేదు:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*
*ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి*
*వచ్చే ఎన్నికల్లో తన పోటీ చేసినా చేయకపోయినా ప్రజలకు సేవ చేస్తా*
*ప్రజల మనసులు గెలుచుకొని మళ్ళీ కౌన్సిల్లోకి రావాలి*
**రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*
*మున్సిపల్ నూతన కౌన్సిల్ సమావేశం, కమిషనర్ ఛాంబర్ ను ప్రారంభించిన మంత్రి*
*********"***************************************
*నల్గొండ*:
ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటే పదవులే ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ
శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
శనివారం నల్గొండ మున్సిపల్ పాలకవర్గం చివరి సమావేశం, సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ నూతన కౌన్సిల్ సమావేశ మందిరం, కమిషనర్ చాంబర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయంలో ఉన్నప్పుడు పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినా చేయకపోయినా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ పాల వర్గం ఎంతో కృషి చేసిందని అభినందించారు.
పట్టణ ప్రజలకు ప్రధాన సమస్యలైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,సిసి రోడ్లు,తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు.
ప్రస్తుత కౌన్సిలర్లు మాజీలైన ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
మున్సిపాలిటీ పాలకవర్గం ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన సాగుతున్న మాజీ కౌన్సిలర్లంతా ప్రజల సమస్యలను అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరోసారి ప్రజల మనసులను గెలుచుకొని మళ్లీ కౌన్సిల్లో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు.
వార్డులలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అనంతరం మున్సిపల్ పాలకవర్గాన్ని సన్మానించారు.మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు అందరితో మంత్రి ఫోటోలు దిగారు. అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లను మంత్రి ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్,నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ముసాక్ అహ్మద్, అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు,మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home