Monday, 17 June 2024
యాదాద్రి భక్తులకు శుభవార్త.. ఇక నుంచి అందుబాటులోకి 'గిరి ప్రదక్షిణ' సేవ.. అరుణాచలం తరహాలో..!
Yadadri Temple Giri Pradakshina: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త వినిపించారు. గుట్టకు వచ్చే భక్తులకు ఇప్పటికే పలు సేవలు అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణ సేవను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 18వ తేదీ నుంచి.. ఈ గిరి ప్రదక్షిణ సేవ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక నుంచి అందరూ ఈ సేవ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. .. .Yadagirigutta Giri Pradakshina Seva: యాదాద్రి భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త వినిపించారు. మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఏళ్ల నాటి నుంచే సంప్రదాయంగా వస్తోంది. యాదగిరిగుట్ట కొండపై జ్వాలా నరసింహుడు, గండభేరుండ నరసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు.. స్వయంభువులుగా వెలసిన పంచ నారసింహక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి. ఎన్నో ఏళ్లుగా స్థానిక భక్తులు మాత్రమే గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే.. 2016లో ఆలయాన్ని దివ్యక్షేత్రంగా పునర్‌నిర్మించారు. ఆలయ పునర్ నిర్మాణం తర్వాత.. గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులకు ఇబ్బందికరంగా మారింది. కాగా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. యాదగిరిగుట్టలో ఉన్న పాత ఆచారాలను మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో బాగానే కొండపై స్వామివారి సన్నిధిలో భక్తులకు బస చేసే అవకాశం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం, కొండపైకి ఆటోలను అనుమతించడం వంటి అంశాలను పునరుద్ధరించింది. ఈ క్రమంలోనే.. కాగా.. యాదగిరిప్రదక్షిణకు కూడా అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని.. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్వామివారి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు ఐదు వేల మందితో ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉండగా.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ 5 కిలోమీటర్లు ఉంటుంది. లక్ష్మీనరసింహుని గిరికి గిరిప్రదక్షిణ వీధిని ఏర్పాటు చేయటం వల్ల ఆలయానికి మరింత శోభ రానుంది. అయితే తెలంగాణలో "గిరి ప్రదక్షిణ"ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలవనుంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment