Sunday, 30 June 2024

అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేం


 అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేం                             తాంబూలాలిచ్చేశాం... తన్నుకు చావండి అన్నట్లుగా ఉన్నది హెచ్‌ఎండీఏ తీరు. భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇచ్చేసి.. ఆ తర్వాత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారా? లేదా అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు.. అది తమ బాధ్యత కాదని చెబుతున్నారు.                                                               ఆ పని స్థానిక సంస్థలదేనంటున్న హెచ్‌ఎండీఏ

       : తాంబూలాలిచ్చేశాం… తన్నుకు చావండి అన్నట్లుగా ఉన్నది హెచ్‌ఎండీఏ తీరు. భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇచ్చేసి.. ఆ తర్వాత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారా? లేదా అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు.. అది తమ బాధ్యత కాదని చెబుతున్నారు. తాము ఇచ్చిన అనుమతుల ప్రకారం భవన నిర్మాణాలు, లే అవుట్లలో అభివృద్ధి పనులు జరుగుతున్న విధానాన్ని స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పర్యవేక్షించి, అవసరమైతే కూల్చివేసే అధికారం వాటికే ఉన్నదని హెచ్‌ఎండీఏ పేర్కొంటోంది.

ADVERTISEME
New SV 5

పర్యవేక్షణ మరిచిన స్థానిక సంస్థలు…
గ్రేటర్‌ చుట్టూ ఉన్న హెచ్‌ఎండీఏ పరిధి మొత్తం 7 జిల్లాల్లో ఉన్నది. ఇందులో సుమారు 40 దాకా మున్సిపాలిటీలు, 1032 గ్రామాలు ఉన్నాయి. భవన నిర్మాణాలు, లే అవుట్ల కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ప్లానింగ్‌ విభాగం ఏర్పాటు చేసి 4 జోన్లుగా విభజించి అనుమతులు ఇస్తున్నారు. అయితే హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలను స్థానిక సంస్థలైన మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు నిరంతరం పర్యవేక్షించాలి. నిర్మాణం జరుగుతున్న సమయంలో సైట్‌కి వెళ్లి నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు లేకుంటే చర్యలు తీసుకోవాలి. అయినా అలాంటి చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదు.

పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసి, ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తే తప్ప.. అక్రమ నిర్మాణాలను ఏ మాత్రం అడ్డుకోవడం లేదని ఆరోపణలు శివారు ప్రాంతాల్లో వినిపిస్తున్నాయి. అనుమతులు ఇచ్చేది ఒకరు, పర్యవేక్షించేది మరొకరు కావడంతోనే అక్రమ నిర్మాణాలు, ముఖ్యంగా సెట్‌ బ్యాక్‌ లేకుండా ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. భవన నిర్మాణానికి సంబంధించి నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించే భవనం చుట్టూ 1.5 మీటర్ల సెట్‌ బ్యాక్‌తో నిర్మాణాలు చేపట్టాలి. కానీ ఈ నిబంధనను 90 శాతం భవనాల్లో అమలు చేయడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

నిబంధనలకు తూట్లు…
రాష్ట్రంలో అమలవుతున్న భవన నిర్మాణ నిబంధనలకు నిర్మాణదారులు తూట్లు పొడుస్తున్నారు. మెరుగైన పట్టణీకరణే లక్ష్యంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీవో 168ను భవన నిర్మాణాలు, లే అవుట్ల విషయంలో అమలు చేస్తోంది. గాలి, వెలుతురు వచ్చేలా, విశాలమైన రోడ్లు ఉండేలా ఇండ్లను నిర్మించాల్సిన చోట హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందిన వారు అందులో పొందుపర్చిన నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో ఇండ్ల మధ్య సెట్‌ బ్యాక్‌లు సరిగా లేకపోవడంతో అందులో నివాసముండే వారు ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

No comments:

Post a Comment