Bengaluru Drugs Case: మే నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ కేసులోనే హేమను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు డ్రస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలుగు నటి హేమ అరెస్టు అయ్యారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నారని కర్ణాటక పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ పరీక్షల్లో ఆమె మాదకద్రవ్యాలు తీసుకున్నట్లుగా కూడా రిపోర్టు వచ్చింది.
గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఆ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దీంతో బెంగళూరు సీసీబీ పోలీసులు తాజాగా నటి హేమను అదుపులోకి తీసుకున్నారు. హేమను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు హాజరు కావాలని కొద్ది రోజుల క్రితమే హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన ఆరోగ్యం బాలేదని లేఖ పంపి తప్పించుకున్నారు. రెండోసారి పోలీసులు నోటీసులు జారీ చేసిన తర్వాత ఇక హేమ పోలీసుల అదుపులోకి వెళ్లక తప్పలేదని తెలుస్తోంది.
ఫేక్ వీడియో విడుదల
తొలుత మే 20న బెంగళూరులో రేవ్ పార్టీ విషయం బయటికి రాగానే అందులో హేమ కూడా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. ఫాంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్నానని ఓ వీడియో విడుదల చేశారు. కానీ, బెంగళూరు పోలీసులు పార్టీలో ఆమె ఫోటోలు విడుదల చేయడంతో.. హేమ చేసినది ఫేక్ వీడియో అని తేలిపోయింది.
బెంగళూరు పోలీసులు తమ విచారణలో భాగంగా పార్టీకి హాజరైన అందరి రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ చేయించడం.. ఇందులో హేమతో పాటు మొత్తం 86 మందికి పాజిటివ్ అని తేలింది. అలా పాజిటివ్ వచ్చిన వారు అందరికీ పోలీసులు నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. అదే క్రమంలో నటి హేమకు కూడా నోటీసులు ఇచ్చారు. మొదటిసారి ఆమె అనారోగ్యం కారణంగా గైర్హాజరు కాగా.. ఇప్పుడు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు.
No comments:
Post a Comment