Sunday, 30 June 2024

అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేం


 అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేం                             తాంబూలాలిచ్చేశాం... తన్నుకు చావండి అన్నట్లుగా ఉన్నది హెచ్‌ఎండీఏ తీరు. భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇచ్చేసి.. ఆ తర్వాత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారా? లేదా అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు.. అది తమ బాధ్యత కాదని చెబుతున్నారు.                                                               ఆ పని స్థానిక సంస్థలదేనంటున్న హెచ్‌ఎండీఏ

       : తాంబూలాలిచ్చేశాం… తన్నుకు చావండి అన్నట్లుగా ఉన్నది హెచ్‌ఎండీఏ తీరు. భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇచ్చేసి.. ఆ తర్వాత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారా? లేదా అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు.. అది తమ బాధ్యత కాదని చెబుతున్నారు. తాము ఇచ్చిన అనుమతుల ప్రకారం భవన నిర్మాణాలు, లే అవుట్లలో అభివృద్ధి పనులు జరుగుతున్న విధానాన్ని స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పర్యవేక్షించి, అవసరమైతే కూల్చివేసే అధికారం వాటికే ఉన్నదని హెచ్‌ఎండీఏ పేర్కొంటోంది.

ADVERTISEME
New SV 5

పర్యవేక్షణ మరిచిన స్థానిక సంస్థలు…
గ్రేటర్‌ చుట్టూ ఉన్న హెచ్‌ఎండీఏ పరిధి మొత్తం 7 జిల్లాల్లో ఉన్నది. ఇందులో సుమారు 40 దాకా మున్సిపాలిటీలు, 1032 గ్రామాలు ఉన్నాయి. భవన నిర్మాణాలు, లే అవుట్ల కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ప్లానింగ్‌ విభాగం ఏర్పాటు చేసి 4 జోన్లుగా విభజించి అనుమతులు ఇస్తున్నారు. అయితే హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలను స్థానిక సంస్థలైన మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు నిరంతరం పర్యవేక్షించాలి. నిర్మాణం జరుగుతున్న సమయంలో సైట్‌కి వెళ్లి నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు లేకుంటే చర్యలు తీసుకోవాలి. అయినా అలాంటి చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదు.

పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసి, ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తే తప్ప.. అక్రమ నిర్మాణాలను ఏ మాత్రం అడ్డుకోవడం లేదని ఆరోపణలు శివారు ప్రాంతాల్లో వినిపిస్తున్నాయి. అనుమతులు ఇచ్చేది ఒకరు, పర్యవేక్షించేది మరొకరు కావడంతోనే అక్రమ నిర్మాణాలు, ముఖ్యంగా సెట్‌ బ్యాక్‌ లేకుండా ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. భవన నిర్మాణానికి సంబంధించి నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించే భవనం చుట్టూ 1.5 మీటర్ల సెట్‌ బ్యాక్‌తో నిర్మాణాలు చేపట్టాలి. కానీ ఈ నిబంధనను 90 శాతం భవనాల్లో అమలు చేయడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

నిబంధనలకు తూట్లు…
రాష్ట్రంలో అమలవుతున్న భవన నిర్మాణ నిబంధనలకు నిర్మాణదారులు తూట్లు పొడుస్తున్నారు. మెరుగైన పట్టణీకరణే లక్ష్యంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీవో 168ను భవన నిర్మాణాలు, లే అవుట్ల విషయంలో అమలు చేస్తోంది. గాలి, వెలుతురు వచ్చేలా, విశాలమైన రోడ్లు ఉండేలా ఇండ్లను నిర్మించాల్సిన చోట హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందిన వారు అందులో పొందుపర్చిన నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో ఇండ్ల మధ్య సెట్‌ బ్యాక్‌లు సరిగా లేకపోవడంతో అందులో నివాసముండే వారు ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

తెలుగోడి కి ఎస్బీఐ పగ్గాలు...!* *🔹నూతన ఛైర్మెన్గా చల్లా శ్రీనివాసులు

 

తెలుగోడి కి ఎస్బీఐ పగ్గాలు...!*

*🔹నూతన ఛైర్మెన్గా చల్లా శ్రీనివాసులు


*

*🍥న్యూఢిల్లీ : దిగ్గజ విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథి బాధ్యతలు తొలిసారి ఓ తెలుగు వ్యక్తికి దక్కనున్నాయి*

*♦️ఆ బ్యాంక్ తదుపరి చైర్మెన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులు కానున్నారు.*

*💠ప్రస్తుతం ఆయన మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు.*

*✡️ప్రభుత్వ రంగ సంస్థల చీఫ్*
*ఎగ్జిక్యూటివ్ల నియామాక సంస్థ అయినా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్ట్యూషన్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఎస్బీఐ తదుపరి* *చైర్మెన్గా శ్రీనివాసులు శెట్టిని ఎంపిక చేస్తూ సిఫారసు చేసింది. పనితీరు, మొత్తం అనుభవం, వివిధ కొలమానాలను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాసులును* *చైర్మెన్ పదవికి సిఫారసు చేసినట్టు ఎఫ్ఎస్ఐబీ శనివారం తన నోటిఫికేషన్లో వెల్లడించింది. కాగా.. దీనికి కేంద్ర క్యాబినెట్ కమిటీ, ప్రధానిమోడీ తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఎస్బీఐ చైర్మెన్ పదవీ కోసం ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్లను ఎఫ్ఎస్ఐబీ ఇంటర్యూ చేసింది. ప్రస్తుత చైర్మెన్ దినేశ్ కుమార్ ఖరా 2020 అక్టోబర్లో నియమితులు కాగా.. ఆయన పదవీకాలం 2024 ఆగస్టు 28తో ముగియనుంది*

*🌀శ్రీనివాసులు సెట్టి 2020లో ఎస్బీఐ బోర్డులో ఎండీగా చేరారు. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో జన్మించిన శ్రీనివాసులు శెట్టి అగ్రికల్చర్ సైన్స్లో డిగ్రీ పొందిన ఆయన 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఎస్బీఐలో తన కేరీర్ను ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగారు. 36 ఏండ్లకు పైగా సాగిన కెరీర్లో కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, అభివృద్థి చెందిన దేశాల మార్కెట్లలోని బ్యాంకింగ్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. న్యూయార్క్లోని విభాగానికి వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక బాధ్యతలను నిర్వహించారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలకు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను నియమించడానికి సిఫారసులు చేయడానికి ఎఫ్ఎస్ఐబీ బాధ్యత వహించే స్వయంప్రతిపత్త సంస్థ. 2022లో ఏర్పాటైన ఈ బ్యూరోకి పర్సనల్, ట్రైనింగ్ శాఖ మాజీ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మ చైర్మెన్గా ఉన్నారు, ఆర్థిక సేవల విభాగం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు

Saturday, 29 June 2024

వేదంమంత్రాల సాక్షిగా..

 *💥🔥💥చెప్పగలిగే దమ్ముండాలేగానీ మంత్రాలకి చింతకాయలేకాదు ...మంటలు కూడా పుట్టించొచ్చు... జై హిందూ  జై శ్రీ రామ్* 👌👌👍.. అహోబిలం నరసింహస్వామి ఆలయ..పండితుల.. మంత్రాల పవర్ ఎంటో. వేదంమంత్రాల సాక్షిగా..


చూపారు., నమో నారసింహా నమః

Friday, 28 June 2024

కౌటికే విఠల్ కు సన్మానం

 LIAFI-1964 యొక్క 75వ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కౌటికే విఠల్ కు సన్మానం


*దేశం యొక్క ప్రముఖ జీవిత బీమా సలహాదారు మరియు CLIA డెవలప్‌మెంట్ కమిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కౌటికే విఠల్ భువనేశ్వర్‌లో జరిగిన LIAFI-1964 యొక్క 75వ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సన్మానించబడ్డా రు. అక్కడ అయన ప్రసంగిచారు. ఈ ముఖ్యమైన సంఘటన భారతదేశం అంతటా LIAFI-1964 నుండి 262 మంది నాయకులను ఒకచోట చేర్చింది.*

కాంగ్రెస్ పార్టీలో తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రస్థానం

 కాంగ్రెస్ పార్టీలో తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రస్థానం





కాంగ్రెస్ పార్టీలో తాటిపర్తి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్థానం లోతుగా విశ్లేషిస్తే తాజా పరిస్థితికి ఆయన అవలంభించిన విధానాలే కారణమని అనుచరులు గుసగుసలు పెడుతున్నారు. 1980లో మల్యాల సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జీవన్ రెడ్డి. 1983లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ అనంతరం జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో కొనసాగిన కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక పథకాలపై జీవన్ రెడ్డి చట్టసభలలో, బయట బలంగా గొంతుక వినిపించి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుతూ, క్యాడర్ లో భరోసా కల్పించారు. జీవన్ రెడ్డి మంత్రిగా కొనసాగినా… ఎమ్మెల్యేగా ఓడినా, గెలిచినా ప్రజాక్షేత్రంలోనే ఉంటాడు అనే పేరుంది.

ఇదంతా నాణేనికి ఒకవైపు మరోవైపు పరిశీలిస్తే జీవన్ రెడ్డి సంకుచిత రాజకీయ నాయకుడని జగిత్యాల రాజకీయాలు తెలిసిన వారు పెదవి విరుస్తారు. నాలుగు దశాబ్దాల రాజకీయంలో ఆయన ఎంతమంది నాయకులను తీర్చి దిద్దారని ప్రశ్నిస్తే అనుచరుల నుంచి మౌనమే సమాధానం వస్తుంది. మున్సిపల్ చైర్మన్ పదవి బిసిలకు ఇచ్చినట్టే ఇచ్చి చైర్మన్ మెట్ట భట్టిని రాజకీయంగా ఎదగకుండా చేశారని ఆరోపణలు ఉన్నాయి.

బిసి కులాలు బలంగా ఉండే నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ఏనాడు వారికి ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శ ఉంది. మున్సిపల్ చైర్మన్ గా అవకాశం వస్తే ఆయన తమ్ముడి భార్య విజయలక్ష్మికే ఆ పదవి కట్టబెట్టారని. వారి ఏలుబడిలో పట్టణంలో నిలువు దోపిడీ జరిగిందని పట్టణంలో టాక్ ఉంది. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తన మరదలు విజయలక్ష్మికే కట్టబెట్టారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వస్తుందని ఆశించిన మాజీ కౌన్సిలర్లు, పార్టీలోని బిసి మహిళా నేతలకు ఆశాభంగం తప్పలేదు.

చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకానొక దశలో పార్టీ నేత బండ శంకర్ కు ఇప్పించే అవకాశం వచ్చినా జీవన్ రెడ్డి తనదైన శైలిలో అడ్డుపడ్డారని పార్టీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటారు. నలభై ఏళ్ళుగా పార్టీలో వెన్నంటి సాగుతున్న నేతల్లో ఒకరిద్దరు తప్పితే ఎవరు ఆర్థికంగా నిలదోక్కుకోలేదని సీనియర్ నేతలు వాపోతున్నారు. ఆ ఒకరిద్దరు కూడా వారి సొంత వ్యాపారాల పరంగానే ఎదిగారని చెప్పుకుంటారు.

జీవన్ ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో జగిత్యాల కాంగ్రెస్ నుంచి ఒక్క నేత కూడా పార్టీలో రాష్ట్ర స్థాయికి ఎదగలేదు. జీవన్ రెడ్డి తర్వాత ఎవరు అనేది ఎప్పుడు ప్రశ్నార్థకమే? రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవుల ముఖం జగిత్యాల కాంగ్రెస్ నేతలు చూసి ఎరుగరు. జగిత్యాల నియోజకవర్గం నుంచి మరో నేత ఎదగకుండా చేశారని ఆరోపణ ఉంది.

కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయంలో మంత్రి పదవి ఖరారైంది. అనుచరవర్గం హంగామాగా హైదరాబాద్ వెళ్ళే సరికి సీన్ మారింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరు ఏకతాటి మీదకు వచ్చి మాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. జీవన్ రెడ్డికి ఇవ్వొద్దు అనటంతో మంత్రి పదవి నేరెళ్ళ ఎమ్మెల్యే పాటి రాజంకు దక్కింది.

దివంగత నేత రత్నాకర్ రావుతో ఏనాడు సఖ్యత లేదు. ప్రస్తుత మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో జిల్లాలో జీవన్ రెడ్డి తరపున మాట్లాడే నేత లేకుండా పోయారు.

గతంలో చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ కోడూరి సత్యనారాయణ గౌడ్ కు ఇప్పించిందే జీవన్ రెడ్డి అంటారు. వరుస ఓటములపాలైన ప్రస్తుత ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మెల్యే టికెట్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం టికెట్ కు సహకరించింది జీవన్ రెడ్డి అని పార్టీ నేతలు చెపుతున్నారు. జగిత్యాలలో నాయకత్వాన్ని ప్రోత్సహించని జీవన్… ఇతర నియోజకవర్గాల వారికి దన్నుగా నిలిచారు. క్లిష్ట సమయంలో జీవన్ రెడ్డికి వారు అండగా మాట్లాడకపోవటం ద్రోహమని విమర్శిస్తున్నారు.

జగిత్యాల అభివృద్దిలో జీవన్ రెడ్డి పాత్ర పరిమితమనే వాదన ఉంది. పట్టణంలోని యావర్ రోడ్డు విస్తరణ ప్రహాసనంగా మారింది. పట్టణ విస్తరణ జరుగుతున్నా ఒక ప్రణాళిక అంటూ లేదు. గ్రామీణ స్థాయి రోడ్లను తలపించే పట్టణ బైపాస్ రోడ్ల దుస్థితికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తే జీవన్ రెడ్డి కూడా ఒకరని ఆరోపణలు ఉన్నాయి. అయితే కొండగట్టు JNTU కళాశాల, జగిత్యాల మామిడి మార్కెట్, న్యాక్ నైపుణ్య శిక్షణా కేంద్రం, పొలాస వ్యవసాయ కళాశాల ఏర్పాటు జీవన్ రెడ్డి పుణ్యమే అని ఆయన అనుచర వర్గం వాదిస్తున్నారు.

పౌర హక్కుల సంఘం న్యాయవాదిగా ప్రజా క్షేత్రంలోకి వచ్చిన జీవన్ రెడ్డి నాయకుడిగా ఎదిగినా ప్రజల మనసు దోచుకున్న నేతగా నిలబడలేకపోయారనే అపవాదు ఉంది. కాంగ్రెస్ హై కమాండ్ మూడు సంవత్సరాల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సందర్భంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. బహిరంగంగా, ప్రచార సాధనాలలో విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి మాత్రమే రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు.

రాష్ట్ర పార్టీలో సీనియర్ల జోరు తగ్గడం, జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఓడిపోవడం ప్రతికులతను పెంచింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎంఎల్ఏ సంజయ్ చేరిక సమాచారం సీఎం రేవంత్ రెడ్డి కావాలని జీవన్ రెడ్డికి ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ రాజీనామా చేస్తే పార్టీ అధికారంలో ఉన్నందున సీనియర్లు ఆయన వెంట వచ్చే అవకాశాలు తక్కువని రాజకీయ పరిశీలకుల అంచనా.
Rajasekhar Reddy Tspsc
జీవన్ రెడ్డికి ఇంత జరుగుతున్నా రాష్ట్రస్థాయిలో ఏ ఒక్క నాయకుడు సానుకూలంగా స్పందించకపోవటం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు నిదర్శనం. గతంలో పార్టీకి అందించిన సేవలు, చేసిన త్యాగాలు, ప్రతిపక్ష పార్టీతో చేసిన పోరాటాలు, మహాసముద్రమైన కాంగ్రెస్ పార్టీలో అగుపించవు, వినిపించవనేది అక్షర సత్యం.
జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటం అంటూ జరిగితే ‘రోగి అడిగింది డాక్టర్ ఇచ్చింది ఒకటే’ అన్న చందంగా తనకు కావాల్సిన వాళ్లను తెచ్చుకునే అవకాశం సీఎం రేవంత్ రెడ్డికి కల్పించడం తప్ప ప్రమాదం ఏమీ లేదన్నట్టుగా తయారైంది.
కాంగ్రెస్ పార్టీలో నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న జీవన్ రెడ్డి రాజకీయ ప్రాబల్యానికి చెక్ పెట్టిన సంకేతాలు… పరోక్షంగా సీనియర్లకు ఓ హెచ్చరిక లాంటిదే అని స్పష్టం అవుతోంది. జీవన్ రెడ్డికి ఢిల్లీలో బుధవారం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదు. దీంతో ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ, కేసీ వేణుగోపాల్‌తో మాత్రమే సమావేశమయ్యారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన అనంతరం జీవన్‌రెడ్డి పూర్తిగా రాజీపడిపోయారు.
జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రస్తుతం రాజకీయ అవరోధాలు ఏర్పడకపోవచ్చు. కానీ రాజకీయాల్లో చిన్న ఘటన కూడా విపరీత పరిణామాలకు దారి తీయవచ్చు. భవిష్యత్తులో రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయో వేచి చూడాల్సిందే.
-దేశవేని భాస్కర్

పెళ్లి నెపంతో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కానిస్టేబుల్ అరెస్టు, రిమాండ్‌

 

పెళ్లి నెపంతో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కానిస్టేబుల్ అరెస్టు, రిమాండ్‌

 


పెళ్లి నెపంతో మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకు గాను RGIA పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ G.ప్రదీప్‌ను రాజేందర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు....బాధిత మైనర్ బాలిక ఫిర్యాదుపై లైంగిక వేధింపులు & బెదిరింపు కేసు నమోదు

Thursday, 27 June 2024

శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయములో "స్వర్ణ పుష్పార్చన" యొక్క నకిలీ టిక్కెట్లను విక్రయించి అక్రమాలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోండి



                       శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయములో  "స్వర్ణ పుష్పార్చన" యొక్క నకిలీ టిక్కెట్లను విక్రయించి అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు   రెడ్ హ్యాండిల్గా పట్టుబడ్డారని వారి పై  ప్రొసీడింగ్స్ జారీ చేసారని, గత ప్రభుత్వ నాయకుల ప్రభావం తో వారి పై చర్యలు తీసుకోలేదని, అంతేకాకుండా వారికి   ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని, బదిలీ చేయాలని శ్రీ ఉజ్జయిని మహాకాళి  మాణిక్యాలమ్మ సేవా సమితి 16 మంది సభ్యులు కమిషనర్ కు ఫిర్యాదు చేశ్చారు. 


దేవాలయాలలో నిధులు మరియు ఆభరణాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న  మరియు  భక్తులచే ఇవ్వబడిన  కానుకలు  దుర్తినియోగ పరిచారని అభియోగములు ఎదుర్కొన్న ఉద్యోగులుపై చట్టపరమైన  చర్యలు కూడా జారీ అయ్యాయని కానీ గత ప్రభుత్వ నాయకుల ప్రభావం తో చర్యలు జరుగలేదని,  ఎండోమెంట్ విభాగం నిబంధనల ప్రకారం వారిని  ఇతర ఆలయాలకు బదిలీ చేసినప్పటికీ, వారు సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయంలో సిబ్బంది ఇప్పటికీ పనిచేస్తున్నారని వార్తా పత్రికల ద్వారా మాకు తెలిసిందని,  శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయ భక్తులుగా మరియు ఆరాధకులుగా, వీలైనంత త్వరగా కొత్త అధికారులను మరియు సిబ్బందిని నియమించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఈ దేవాలయ అధికారులు ఉద్యోగులు చేస్తున్న అక్రమాలపై వరుస కథానాలు. ముందు ముందు

Tuesday, 25 June 2024

శ్రీ కాశీ అన్నపూర్ణ సత్రం అగ్ని వాసవి సత్ర సముదాయం లోకి తాకింది

శ్రీ కాశీ అన్నపూర్ణ సత్రం అగ్ని వాసవి సత్ర సముదాయం లోకి తాకింది
                 వైశ్య సంత్రం నాయకుల ఆధిపత్య పోరు తో ప్రకంపనలు. శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య సత్రం లో రికార్డుల బీరువాను దౌర్జన్యంగా లాకెళ్ళిన వైనంతో అడహాక్ కమిటీ కో ఆర్డినేటర్ గబ్బ చంద్రశేఖర్ ఛాంబర్ కు తాళం వేసిన విషయం తో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. కాశీ అన్నపూర్ణ సత్రం అగ్ని వాసవి సత్ర సముదాయం లోకి తాకింది. కాశీ సత్రం ను నిర్వహణ భాద్యతలు చేస్తున్న అన్న ఆడహాక్ కమిటీ సభ్యులు మొత్తం ఓ పెద్ద నాయకుని కనుసన్నల్లో ఉండేవారు. కానీ ఎన్నికల సమయం వచ్చేవరకు చీలికలు ఏర్పడినట్లు బోగట్టా. ఇప్పుడు హాడ్ హాక్ కమిటీ లో కొంత మంది ఆ పెద్ద నాయకుని కనుసన్నల్లో ఉ

న్నట్లు తెలుస్తుంది. ఒకరిద్దరు స్వతంత్రంగా పోటీ చేయాలని ఆలోచనతో ఉన్న వారు ఆ పెద్దనాయకుడు తో డీ కొట్టలేక డీలా పడిపోయినట్లు సమాచారం. కాశీ సత్రం లో ఎదురు తిరిగిన ఆడహాక్ కమిటీ సభ్యుల్లో ఒకరు వాసవి సత్ర సముదాయం లో కూడా పదవుల్లో వుండడం తో ఆ పదవుల నుండి ఆ పెద్దనయకుడు తొలగింప చేసినట్లు, అంతే కాకుండా ఇంకా కొత్త మంది పోస్టులు కూడా వూడపీ కినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. దీంతో కాశీ అన్నపూర్ణ సత్రం గొడవ వాసవి సత్ర సముదాయం లోకి 
పాకింది.

Sunday, 23 June 2024

టి.జి.లక్ష్మి వెంకటేష్ వాసవి వైశ్య హాస్టల్

 *వాసవి సత్ర సముదాయం శ్రీశైలం అద్వర్యములో నిర్మించబడిన శ్రీ టి.జి.లక్ష్మి వెంకటేష్ వాసవి వైశ్య హాస్టల్  కర్నూల్ ప్రారంభోత్సవము




లో ముఖ్య అతిధి గా ఆంధ్రరాష్ట్రమంత్రి వర్యులు శ్రీ టి.జి భరత్ గారు , మాజీ రాజ్యసభ్యులు శ్రీ టి.జి.వెంకటేష్ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్దులు శ్రీ అమరవాది లక్ష్మినారాయణ గారు సత్ర అధ్యక్షులు శ్రీ  దేవకి వెంకటేశ్వర్లు పాల్గొన్న కార్యక్రమములో  గౌరవ అతిథి గా పాల్గొన్నాను*