ఏసీబీ వలకు చిక్కిన సచివాలయం అధికారి
ఏసీబీ వలకు చిక్కిన సచివాలయం అధికారి
- రూ.16 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత
విశాఖపట్నం (గాజువాక): ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు మరోసారి పంజా విసిరారు. గాజువాక 74వ వార్డు నెహ్రూ నగర్ సచివాలయం అడ్మిన్ గణేష్ రూ.16,000 లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు.
ఘటన వివరాలు:
బాధితుడు పల్లా సత్తిబాబు తన ఇంటి పన్ను, కుళాయి పన్నును తన భార్య పేరు మీదకు మార్చాలని కోరగా, అడ్మిన్ గణేష్ ఏకంగా రూ.25,000 లంచం డిమాండ్ చేశాడు.
ఇప్పటికే రూ.9,000 వసూలు చేసిన గణేష్..
మిగిలిన రూ.16,000 ఇస్తేనే పని చేస్తానని తెగేసి చెప్పాడు.
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నేడు సత్తిబాబు నుండి ఆ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి గణేష్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
"మీ ప్రాంతంలో కూడా ఇలాంటి అవినీతి ఎదురైందా?


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home