Sunday, 15 February 2026

*అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్య అరెస్ట్ జైలుకు తరలింపు*.

 *అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్య అరెస్ట్ జైలుకు తరలింపు*.



అక్షర చిట్ ఫండ్ సంస్థ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను సుబేదార్ పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.

హనుమకొండ జిల్లా : అక్షర చిట్ ఫండ్ సంస్థ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను హనుకొండ జిల్లా సుబేదారి పోలీసులు నిన్న రాత్రి బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.అక్షర చిట్ ఫండ్ సంస్థలో చిట్టీలు వేసిన వందలాది మంది భాదితులకు చిట్టి గడువు ముగిసిన కూడా యాజమాన్యం డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడంతో చాలా మంది బాధితులు సుబేదారి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రావు పై పలు కేసులు నమోదు చేసి, రెండు సార్లు జైలుకు కూడా పంపించారు. మరో రెండు కేసుల్లో శ్రీనివాసరావు, ఆయన భార్య శ్రీవిద్య నిందితులుగా ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. శ్రీవిద్య అమెరికా నుంచి వస్తుండగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసి, హనుమకొండ జిల్లా జడ్జి ముందు హాజరుపరిచి నర్సంపేట జైలుకు తరలించునట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రంజిత్ తెలిపారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home