Monday, 1 December 2025

పత్రికల మనుగడ కష్టతరం బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలి జర్నలిస్టుల సమస్యలపై 3 న మహా ధర్నా



 పత్రికల మనుగడ కష్టతరం


బిల్లులు విడుదల 

    చేసి ఆదుకోవాలి


జర్నలిస్టుల సమస్యలపై 

   3 న మహా ధర్నా 


హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :


ఏడాదిన్నరగా బిల్లుల విడుదల లేదు... ఏడేళ్లుగా అప్ గ్రేడ్ ప్రక్రియ చేపట్టడం లేదు.. ప్రకటనలు సరిగా ఇవ్వడం లేదు... హెల్త్ కార్డుల ఊసే లేదు.. రెండేళ్లుగా అక్రిడిటెషన్ కార్డులకు స్టిక్కర్లు అంటించే పరిస్థితి. కొత్త ఎంపానల్ మెంట్ ఐదేళ్లుగా లేదు.. ఇళ్లు, ఇళ్ల స్థలాల పరిస్థితి అటకెక్కింది.. ఆయా సమస్యల సాధనకు జర్నలిస్టులు రోడ్డెకాల్సిన పరిస్థితి దాపురించిందని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు, తెలంగాణ చిన్న మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర నేత మాతంగి దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం నాగోల్ లోమహా ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి టియూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ ఆధ్వర్యంలో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కరించేంత వరకు విడతల వారిగా ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. అక్రిడిటెషన్ పాలసీని ప్రకటించి కొత్త కార్డులను జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులoదరికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, వృత్తి కమిటీలు పునరుద్ధరించాలని, ప్రధానంగా అంపశయ్యపై ఉన్న చిన్న మధ్య తరహా పత్రికలకు ఊపురి ఊదాలని  చిన్న మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర నాయకులు

షేక్ అహ్మద్ అలీ, కోటగిరి చంద్రశేఖర్, కొమరాజు శ్రీనివాసులు, మక్సుద్, నంద్యాల విద్యాసాగర్ లు డిమాండ్ చేశారు. ఆయా సమస్యల సాధనకు ఈనెల 3 న హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని సమాచార శాఖ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టనున్నట్లు, రాష్ట్రంలోని జర్నలిస్టులంతా హాజరై మహా ధర్నాను విజయ వంతం చేయాలని కోరారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home