Saturday, 9 August 2025

కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్.. 334 పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు !

 

కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్.. 334 పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు !

భారత కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఆరేళ్లుగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దేశ రాజకీయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయాన్ని పరిగణిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ధారణంగా నిబంధనల ప్రకారం.. రిజిస్టర్ అయిన ప్రతి రాజకీయ పార్టీ నిరంతరం ఎన్నికల్లో పాల్గొనాలి. అయితే 2019 నుంచి ఇప్పటివరకు ఈ 334 పార్టీలు ఏ ఎన్నికలోనూ అభ్యర్థులను నిలబెట్టలేదని ఈసీ తెలిపింది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన చిరునామాలో వారి కార్యాలయాలు భౌతికంగా లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడిందని స్పష్టం చేసింది.
central-election-commission-of-india-cancelled-registration-of-334-parties

కాగా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు దేశంలో మొత్తం 2,854 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉండేవి. ఇప్పుడు 334 పార్టీలను జాబితా నుంచి రద్దు చేయడంతో వాటి సంఖ్య 2,520కి తగ్గింది. ఈ నిర్ణయం కేవలం గుర్తింపు లేని.. క్రియారహిత పార్టీలకే వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ తరహా తనిఖీలు, కఠిన చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఈసీ వర్గాలు తెలిపాయి. అలాగే కొత్తగా పార్టీ రిజిస్ట్రేషన్, గుర్తింపు ప్రక్రియలను మరింత కఠినతరం చేసే అవకాశముందని సంకేతాలు వస్తున్నాయి.

మరోవైపు ప్రస్తుతం చురుకుగా ఉన్న 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్రస్థాయి పార్టీలపై ఈ ప్రభావం ఉండదని కూడా తెలిపింది. గతంలో కొన్ని చిన్నపాటి రాజకీయ పార్టీలు పన్ను ఎగవేత.. నల్లధనాన్ని - తెల్లదనంగా మార్చుకునేందుకు ఉపయోగపడుతున్నట్లు విచారణలో బయటపడిందని వెల్లడించింది. నకిలీ విరాళాలు, రసీదులలో మార్పు రా నిధులను మళ్లించిన అంశాలు వెలుగులోకి రావడంతో ఈసీ ఈసీ చర్యలకు దిగిందని భావిస్తున్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home