Friday, 9 May 2025

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

       భూ భారతి చట్టం- 2025 అమలు


లో      సర్వేయర్ల కు శిక్షణ :జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 
   భూ భారతి చట్టం- 2025 అమలులో భాగంగా అర్హులైన సర్వేయర్ల కు శిక్షణ ఇచ్చేందుకుగాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్వేయర్ల శిక్షణ కోసం ఈ నెల 17 లోగా సమీపంలోని మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు .


     ఎంపికైన సర్వేయర్లకు ఈనెల 26 నుండి జూలై 26 వరకు (50 పని దినాలు) శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

    రెవెన్యూ పరిపాలన కు తోడుగా, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 మంది సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చి సర్వేయర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. 

    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి (భూమి హక్కుల రికార్డు చట్టం- 2025) ద్వారా భూమి సంబంధిత సేవలను ప్రజలకు కల్పించి వారి భూ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో లైసెన్సుడ్ సర్వేయర్లను నియమించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

     అందువల్ల జిల్లాలోని సర్వేయర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ,ఈనెల 17 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home