Friday, 2 May 2025

శానిటేషన్ నిర్వహణ సజావుగా జరగాలి: కమిషనర్ ఆర్.వి కర్ణన్*

 *శానిటేషన్ నిర్వహణ సజావుగా జరగాలి: కమిషనర్ ఆర్.వి కర్ణన్*



*ఖైరతాబాద్ జోన్ లో పర్యటించిన కమిషనర్*


*హైదరాబాద్, మే 02:*   శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఖైరతాబాద్ జోనల్ కమీషనర్ అనురాగ్ జయంతి తో కలిసి తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్ బండ్ ట్రాన్స్ఫార్మర్ పాయింట్, ఖైరతాబాద్ బడా గణేష్, ఖైరతాబాద్ పార్కులో పలు అభివృద్ధి పనులతో పాటు శానిటేషన్ ను పరిశీలించారు.


బడా గణేష్ ప్రాంతంలో శానిటేషన్ వర్కర్లతో కమీషనర్ మాట్లాడారు. అక్కడే ఎఫ్.ఆర్.ఎస్ అటెండెన్స్ పరిశీలించారు. అటెండెన్స్ హాజరు, ఆబ్సెంట్ పరిస్థితి  పరిశీలన చేసారు. అదేవిధంగా స్వచ్ఛ ఆటో డ్రైవర్ లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఐడీ కాలనీ వద్దకు వెళ్లి అక్కడ కాలనీ వాసులతో మాట్లాడారు.  శానిటేషన్ కార్మికులు రోజు వస్తున్నారా అని ఆరా తీశారు. ప్రతి రోజు వస్తున్నారని కాలనీ వాసులు కమిషనర్ కు తెలిపారు. పక్కనే ఉన్న పార్కు ను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడి నుండి నేరుగా సెక్రెటరీయేట్  పరిసరాలను పరిశీలించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ తో పాటుగా లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎస్.సి.టి.పి ని సందర్శించి రాంకీ వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వారికి పలు సూచనలు చేశారు. 


కమిషనర్ వెంట జోనల్ కమీషనర్ అనురాగ్ జయంతి, ఖైరతాబాద్ డిప్యూటీ కమీషనర్ రజనీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

-----------------------------------------------

*- సిపిఆర్ఓ జీహెచ్ఎంసీ ద్వారా జారీ చేయడమైనది.*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home