Sunday, 4 May 2025

పట్టుదలకు మారుపేరు భగీరథుడని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ అన్నారు.

     పట్టుదలకు మారుపేరు భగీరథుడని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఇన్చార్జి  అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ అన్నారు.




     భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని  ఆదివారం నల్గొండ కలెక్టర్ లోని బీసీ సంక్షేమ శాఖ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మహర్షి భగీరథ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


      భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ భగీరథ మహర్షి దివి నుండి  భువికి గంగను తీసుకువచ్చేందుకు  కఠోర తపస్సు చేశాడని, పట్టువదలని విక్రమార్కుడిలా గంగను తీసుకువచ్చి మానవాళికి నీటిని అందించాడని తెలిపారు .అందుకే సగర క్షత్రియ వంశీయులను పట్టుదలకు మారుపేరుగా చెప్తారని అన్నారు. శ్రీరాముని  ఇక్ష్వాక వంశంలో భాగమైన సగర క్షత్రియులు దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, ప్రభుత్వం తరఫున వారికి కావాల్సిన అవకాశాలు ఏవైనా ఉంటే సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిషన్ భగీరథ తాగునీటి పథకానికి  భగీరథుని పేరు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు .


      సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు సగర మాట్లాడుతూ భగీరథ మహర్షి మానవాళికి నీటిని అందించడమే కాకుండా పట్టుదలకు మారుపేరుగా నిలిచిపోయారని అన్నారు.


      నల్లగొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ సగర మాట్లాడారు.


      ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ను, డిపిఆర్ఓ ను నల్గొండ జిల్లా సగర  సంఘం ప్రతినిధులు శాలువా, పూలమాలతో సన్మానించారు .

    ఈ కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ అధికారి గామప్ప, ఎస్తేర, నల్గొండ జిల్లా సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లేట్ల మారయ్య సగర, మాజీ జిల్లా అధ్యక్షుడు గంట కృష్ణ సగర.. జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు నేర్లకంటి వసంత సగర.. జిల్లా ప్రధాన కార్యదర్శి బలుగూరి కర్ణాకర్ సగర.. సీనియర్ నాయకులు నేర్లకంటి పెద్ద జంగయ్య సగర..జిల్లా కోశాధికారి కొలుగూరి ప్రవీణ్ సగర.. సీనియర్ నాయకులు నేర్లకంటి సుధాకర్ సగర.. పెండెం వెంకటేష్ సగర..గొల్లూరి యాదయ్య సగర..కొట్టాల గ్రామ సగర సంఘం అధ్యక్షుడు గంట యాదయ్య సగర..మర్రి శశిధర్ సగర.. మర్రి శ్రవణ్ సగర..గొల్లూరి సురేందర్ సగర..గొల్లూరి యాదయ్య సగర.. ధనలక్ష్మి సగర.. దుంపల బిక్షమయ్య సగర తదితరులు పాల్గొన్నారు

________________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు,సమాచార శాఖ,నల్గొండ*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home