Monday, 7 April 2025

లాభాల పంట: నేడు ఈ స్టాక్స్‌లో పెరుగుదల సంకేతాలు! ఇమామి, మారికో సహా చూడాల్సినవి ఇవే..

 లాభాల పంట: నేడు ఈ స్టాక్స్‌లో పెరుగుదల సంకేతాలు! ఇమామి, మారికో సహా చూడాల్సినవి ఇవే..

 


              అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు ప్రకటించాక వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుందనే భయాలతో నేడు దేశీయ మార్కెట్లు పతనమయ్యాయి. దింతో స్టాక్ మార్కెట్‌లో సోమవారం భారీ పతనం సంభవించింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 3000 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా భారీగా పతనమైంది. అయితే నిఫ్టీ 900 పాయింట్లకు పైగా పడిపోయి సోమవారం ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాల చైనా కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలు విధిస్తు ప్రతీకారం తీర్చుకుంది. ఈ చర్య ప్రపంచంలో వాణిజ్య యుద్ధం పెరిగిందని సూచిస్తుంది. గత శుక్రవారం చేస్తే సెన్సెక్స్ 75,364.69 వద్ద ముగిసింది. నేడు సోమవారం 71,449.94 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 22,904 పాయింట్ల వద్ద ముగియాగ, సోమవారం 1,145.6 పాయింట్లు తగ్గి 21,758.40 వద్ద ప్రారంభమైంది. ఈ కారణంగా కూడా BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.19.4 లక్షల కోట్లు తగ్గి రూ.383.95 లక్షల కోట్లకు చేరుకుంది. భారతదేశంతో పాటు ఇతర ఆసియా మార్కెట్లు కూడా భారీ క్షీణతను చూశాయి. మాంద్యం భయం హాంకాంగ్, చైనా స్టాక్ మార్కెట్లను కూడా తాకింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత హాంకాంగ్‌లోని హాంగ్ సెంగ్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే 10% కంటే పైగా పడిపోయింది, ఇది ఒక రోజులో అతిపెద్ద పతనం. చైనా CSI300 బ్లూ చిప్ ఇండెక్స్ కూడా 5% కంటే ఎక్కువగా పడిపోయింది. చైనా కరెన్సీ యువాన్ కూడా జనవరి తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. ఈ షేర్ల కొనుగోలు: ఇమామి, రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్, మారికో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, సుందరం ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ అండ్ మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి స్టాక్‌లు బలమైన కొనుగోళ్లను చూస్తున్నాయి. అంతేకాక ఈ షేర్స్ 52 వారాల గరిష్ట స్థాయిని దాటాయి. అలాగే ఈ స్టాక్‌లలో బుల్లిష్ ట్రెండ్‌ను సూచిస్తుంది.

              స్టాక్ మార్కెట్ క్రాష్.. తుడిచిపెట్టుకుపోయిన లక్షల కోట్లు.. వెంటాడుతున్న సుంకాలు, ద్రవ్యోల్బణ భయాలు ఈ స్టాక్‌లలో మాంద్యం సంకేతాలు: హిందుస్తాన్ కాపర్, నాల్కో, వేదాంత, టాటా స్టీల్, పాలీ మెడిక్యూర్, భారత్ ఫోర్జ్ అండ్ హిందాల్కోలకు MACD బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ షేర్లలో క్షీణత ప్రారంభమైంది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home