TTD: భక్తులకు టీటీడీ ప్రత్యేక ఐడీ - దర్శనంలో కొత్తగా, ఇక నో వెయిటింగ్ ..!!
TTD: భక్తులకు టీటీడీ ప్రత్యేక ఐడీ - దర్శనంలో కొత్తగా, ఇక నో వెయిటింగ్ ..!!
Tirumala: టీటీడీ కీలక మార్పులకు రంగం సిద్దమైంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త కార్యాచరణ అమలు చేయనున్నారు. వేసవి రద్దీ వేళ బ్రేక్ దర్శనాలను కుదించాలని డిసైడ్ అయ్యారు. బ్రేక్ దర్శనాల వేళల మార్పును పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు. ఏఐ విధానంలో దర్శనాల నిర్వహణ పైన కసరత్తు జరుగుతోంది. గుగూల్ తో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రతీ శ్రీవారి భక్తుడికి శాశ్వత ఐడీ ఇవ్వనున్నారు. ఒక నుంచి భక్తుడి మొబైల్ ఫోన్ కే పూర్తి సమాచారం రానుంది. ఈ రోజు సీఎం చంద్రబాబు వద్ద జరిగే సమీక్షలో కొత్త నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. సాంకేతిక సేవలతో తిరుమలలో భక్తులకు సౌకర్యాలను సులభతరం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందు కోసం సాంకేతికతను వినియోగించుకోనుంది. ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లా కసరత్తు జరుగుతోంది. గుగూల్ తో ఒప్పందానికి సిద్దమైంది. ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ద్వారా దర్శనం.. వసతి తో పాటుగా సేవల్లోనూ కొత్త విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అదే విధంగా భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సమాచార వ్యవస్థను ఈ విధానంలో అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. గుగూల్ తో ఒప్పందం తిరుమలలో భక్తులకు సాంకేతికత వినియోగించి సేవలను సులభతరం చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అందించటమే తొలి ప్రాధాన్యత గా టీటీడీ గుగూల్ తో ఒప్పందానికి సిద్దమైంది. Also Read "'తల్లికి వందనం' అమలు వారికే - తాజా నిర్ణయం, మార్గదర్శకాలు..!!" గుగూల్ తో ఒప్పందం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉచితంగా అందించేలా గుగూల్ ఇప్పటికే తమ సంసిద్దత వ్యక్తం చేసింది. వచ్చే వారం రోజుల్లో టీటీడీతో గుగూల్ ఈ మేరకు ఎంఓయూ చేసుకోనుంది. గుగూల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగా మకంగా తిరుమలలో ఏఐ వినియోగించనున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురైన అనుభవాలకు అను ణంగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. దర్శనం - వసతి ప్రస్తుతం కొన్ని దేవస్థానా లు ఏఐ వినియోగిస్తున్నా.. భక్తులకు సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితం అవుతు న్నాయి. ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటుగా వసతి, వివిధ సేవల కోసం గుగూల్ సాయం తీసుకోనుంది. ఏ సమయంలో భక్తులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనే సమాచారం టీటీడీకి అందిస్తారు. దీనికి అనుగుణంగా భవిష్యత్ లో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకునే అవకాశం కలుగుతుంది. భక్తులకు ఏఐ సేవలు దర్శన విధి విధానాలు, వస్త్ర ధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తు న్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వారికి కావాల్సిన భాషల్లో సమాచారం అందించనున్నారు. మొబైల్ లో సమాచారం మరో వైపు గుగూల్ మ్యాప్ ల ద్వారా ఎప్పటికప్పుడు రద్దీ గురించి భక్తులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. సామాన్యులు ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) అన్నప్రసాద కేంద్రం, కల్యాణ కట్ట వద్ద రద్దీ ఎలా ఉందో నేరుగా తెలుసుకునే అవకాశం ఏర్ప డుతుంది. భక్తుల ఫోన్లకే సమాచారం వచ్చేలా అనుసంధానం చేస్తున్నారు. క్యూ లైన్ల నియంత్రణ తో పాటుగా భక్తులు వేచి ఉండకుండా చర్యలు చేపట్టే అవకాశం కలుగుతుంది. ఏఐ కెమేరాలను తిరుమలలో గుగూల్ ఏర్పాటు చేస్తుంది. భక్తులకు శాశ్వత ఐడీ భక్తులకు ప్రత్యేక ఐడీ ఇక, ఏఐ విధానం అమల్లో భాగంగా ఒక్కో భక్తుడికి శాశ్వత ఐడీ నెంబర్ ఇవ్వనున్నారు. భవిష్యత్ లో ఆ భక్తుడు ఆ ఐడీ ద్వారానే దర్శనం.. సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు.. ఎన్ని గదులు తీసుకున్నారనే పూర్తి సమాచారం టీటీడీ వద్ద ఉంటుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ సమయంలో అయినా టీటీడీకి సమాచారం ఇచ్చే అవకాశం కలుగుతుంది. భక్తులు సూచనలు, వారి అభిప్రాయాలు, సలహాలను అందించే అవకాశం ఇవ్వనున్నారు. కాగా, ఈ ఏఐ ఆధారిత సేవలు తిరుమలలో అందుబాటులోకి వస్తే భక్తులకు జరిగే ప్రయోజనాల పైన ఇప్పుడు గుగూల్ తో టీటీడీ ఒప్పందం వేళ ఖరారు చేయనున్నారు. Recommended For You "`తిరు` వీధుల్లో ఊరేగిన దేవదేవుడు" పాత విధానం పునరుద్దరణ ఇక నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించి.. శీఘ్రంగా దర్శనం జరిగేలా నిర్ణ తీసుకుంది. వీరికి ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దర్శన టోకెన్లను జారీ చేస్తున్నారు. ఇప్పుడు తాజా నిర్ణయం మేరకు పాత ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆఫ్‌లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది. గత నెల 24న జరిగిన బోర్డు సమావేశంలో ఆఫ్ లైన్ లోనూ టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు. కాగా, రానున్న 3 నెలలకు సీనియర్ సిటిజన్ల టోకెన్ల జారీప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తయింది. ఆ తర్వాత ఆఫ్‌లైన్ విధానం అమలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజుకు ఎన్ని టోకెన్లు ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. ఇదే సమయంలో బ్రేక్ దర్శనాల్లోనూ మార్పుల పైన టీటీడీ కసరత్తు చేస్తోంది. గతంలో అమలు చేసిన విధంగా ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభిచేలా రానున్న శని, ఆదివారాల్లో టీటీడీ ట్రయల్ రన్ నిర్వహించనుంది. You May Also Like "తిరుమలలో..ఈ నెల 6,7 తేదీల్లో రాత్రివేళ" చంద్రబాబు సమీక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ పైన ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్ష లో టీటీడీ కీలక ప్రతిపాదనలు చేయనుంది. బ్రేక్ దర్శనాల పైన ప్రత్యేక నిర్ణయాలకు సిదమదైన టీటీడీ తమ కార్యాచరణ సీఎం కు వివరించనుంది. తిరుమలలో రాత్రివేళల్లో కంపార్టుమెంట్లలో వేచిఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్‌ను ఉదయం 10.30 గంటలకు మార్చారు. ఈ విధానంపై పలువురు వీఐపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఉదయం కల్యాణోత్సవం, ఉదయం టైంస్లాట్‌లు కలిగిన రూ.300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణాలతో వీఐపీ బ్రేక్‌ను తిరిగి పూర్వపుపద్ధతిలో వేకువజాము 5.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 15 నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కొత్త ప్రతిపాదనల అమలు పైన ముఖ్యమంత్రి సమీక్షలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home