Sunday, 6 April 2025

రాష్ట్రపతి ఆమోదంతో చట్ట బద్ధమైన వక్ఫ్ బిల్లు*

 *రాష్ట్రపతి ఆమోదంతో చట్ట బద్ధమైన వక్ఫ్ బిల్లు*


న్యూఢిల్లీ ఏప్రిల్ 06


వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లుగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రపతి కార్యాలయం. వాడీవేడీ వాదోపవాదాల తర్వాత ఇటీవలే వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. 


మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్, ఎంఐఎం, ఆప్ పార్టీలు న్యాయపోరా టానికి దిగాయి. ఈ బిల్లు ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. బిల్లుని వ్యతిరేకిస్తూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి.


వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం పేర్కొంది. వక్ఫ్ సవరణ బిల్లు.. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తుందని.. వక్ఫ్ ఆస్తులపై ఆక్రమణలను ఆపడానికి ప్రయత్నిస్తుం దని తెలిపింది. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో సహా ఆరు నెలల చర్చల తర్వాత ఈ సవరణను ప్రవేశపెట్టారు.


రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు, వ్యతిరేకంగా 95 మంది ఓటు వేయడంతో ఆమోదం లభించింది. లోక్‌సభలో 288 మంది సభ్యులు మద్దతుగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు ఆమోదం పొందింది.


వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎమ్మెల్యే అమాన తుల్లా ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్షత కలిగి ఉందన్నారు. 


ముస్లింల ప్రాథమిక హక్కు లను స్పష్టంగా ఉల్లంఘిస్తోం దని ఆరోపించారు. వారు పిటిషన్లు దాఖలు చేయ డానికి అనేక కారణాలు తెలిపినా వక్ఫ్ (సవరణ) బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home