తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు: చీకోటి ప్రవీణ్
తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు: చీకోటి ప్రవీణ్
హెచ్‌సీయూలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల భూమి వేలం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.
: హెచ్‌సీయూలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల భూమి వేలం (400 acres of land auction) నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు బీజేపీ, సీపీఎం నాయకుల మద్దతు తెలుపుతూ అక్కడకి చేరుకొని నిరసనల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా బీజేపీ నేత, జంతు ప్రేమికుడు అయిన చీకోటి ప్రవీణ్ కుమార్ (Chikoti Praveen Kumar) తన కారులో పోలీసులకు చిక్కకుండా సెంట్రల్ యూనివర్సిటీ వద్దకు చేరుకొని విద్యార్థులకు మద్దతుగా నిలిచాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కారులో పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో పోలీస్ వాహనంలోనే సెల్ఫీ వీడియో తీసిన చీకోటి ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ, యూనివర్సిటీ భూముల వేలం వివాదంతో.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు సిగ్గుతో తలదించుకుంటున్నారని, ఇందుకా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిందని పునరలోచించుకుంటున్నారని అన్నారు. అలాగే రేవంత్ సర్కార్ అగాయిత్యాలు, దారుణాలు, దౌర్జన్యాలు మరోసారి నిరూపితం అయ్యాయని అన్నారు. ప్రకృతిని ధ్వంసం చేయాలని చూస్తున్న వారికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న తనను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని మండి పడ్డారు. యూనివర్సిటీ భూమిలో నెమలిల, జింకలు, కుందేళ్ళు, ఉడతలు, ఉడుములు, పాములు వంటి అనేక జీవులు ఉన్నాయని ప్రభుత్వ నిర్ణయంతో మూగజీవాల తో పాటు పక్షులు చనిపోయే పరిస్థితి నెలకొందని అన్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నగర పరిసరాల్లో గ్రీనరీ 50 శాతానికి పైగా ధ్వంసం అయిందని.. ఇలా కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం ప్రభుత్వ భూములను వేలం వేస్తూన్నారని, ఈ భూమి కేవలం మనుషులకు మాత్రమే కాదని జంతువులు పక్షులకు నిలయం అని, ప్రభుత్వ నిర్ణయంతో సెంట్రల్ యూనివర్సిటీ లో జాతీయ పక్షులు అయిన నెమల్ల ఆర్థనాదాలు వినిపిస్తున్నాయని, వాటి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందని ఈ సందర్భంగా బీజేపీ నేత, జంతు ప్రేమికుడు అయిన చికోటి ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home