Friday, 21 March 2025

ఉద్యోగాల్లో చేరుతున్న మీ అందరికీ అభినందనలు* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

 *ఇదొక అనిర్వచనీయ సందర్భం..* 


 *ఉద్యోగాల్లో చేరుతున్న మీ అందరికీ అభినందనలు* 


 *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* 



“దశాబ్ద కాలం అవకాశాల కోసం ఎదురుచూసిన మీ కల నెరవేరుతోంది. ఇదొక అనిర్వచనీయ సందర్భం. ఉద్యోగాల్లో చేరుతున్న మీ అందరికీ అభినందనలు. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చింది. జీవిత కాలం గుర్తుండిపోయే సందర్భం. తెలంగాణను ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడంలో మీరంతా భాగస్వాములు కావాలి” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న అభ్యర్థులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. 


✳️“ప్రజా ప్రభుత్వం – కొలువుల పండుగ” పేరిట పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల శాఖల్లో కారుణ్య, ఇతర నియామకాల కింద 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 


✳️“కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు చెందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు.. గత ప్రభుత్వాలు దాదాపు 2015 నుంచి కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో జీవితంలో అత్యంత విలువైన మీ సమయం కాలగర్భంలో కలిసిపోయింది.


✳️తెలంగాణ ఏర్పడితే ఖాళీలన్నింటినీ భర్తీ చేసి యువతలో ఒక వి

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home