పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పును ఖండిస్తూ నిరసన*
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పును ఖండిస్తూ నిరసన*
ఖమ్మం / మార్చి, 18
ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పీఎస్ఆర్ రోడ్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధేయవాది, హరిజనోద్ధరణ నాయకులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరుమీద నందమూరి తారక రామారావు గారు 1985 వ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసి ఆ మహనీయుడికి యావత్ జాతి నివాళులర్పించడం జరిగింది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ మహనీయుని పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును మార్చుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి దుశ్చర్యను ఆర్యవైశ్య సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నిరసన కార్యక్రమానికి కేవలం ఆర్యవైశ్యులే కాకుండా కుల, మతాలకతీతంగా, పార్టీలకతీతంగా ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేయడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి చందర్రావు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రాయపూడి రవికుమార్, మాజీ జిల్లా అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు, మాజీ పట్టణ అధ్యక్షులు గోళ్ళ రాధాకృష్ణమూర్తి, వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మేళ్లచెరువు వెంకటేశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి చారుగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు, రాష్ట్ర అసోసియేటెడ్ కార్యవర్గ సభ్యులు కొదుమూరు జగన్నాథం, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వనమా విశ్వేశ్వరరావు, మాజీ కోశాధికారి నూకల శ్రీనివాసరావు, మాజీ జాయింట్ సెక్రెటరీలు మిట్టపల్లి సత్యంబాబు, పాల్వాయి వెంకటేశ్వరరావు, పాల్వాయి సీతారామారావు, వజినేపల్లి చక్రధర్ రావు, కుంచం కృష్ణారావు, వర్తక సంఘం అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు మిట్టపల్లి రవి, బిజెపి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు సన్నె ఉదయ ప్రతాప్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పగడాల నాగరాజు, గాంధీ చౌక్ సాయిబాబా గుడి అధ్యక్షులు వేములపల్లి వెంకన్న, వసుమతి లక్ష్మణరావు, వాసవి క్లబ్ గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు కడవెండి శ్రీనివాసరావు, మాజీ గవర్నర్ ఎర్రం సుజాత, యువజన విభాగం అధ్యక్షులు కొణతం లక్ష్మీనారాయణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు రాయపూడి రవికుమార్, మృత్యుంజయ గుప్తా, విన్నమూరి వెంకట సుబ్బారావు, సాంబశివరావు బూర్లె పుల్లారావ్, వైరా మండల అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్, మధిర పట్టణ అధ్యక్షులు వనమా కిరణ్ కుమార్, బోనకల్లు మండల అధ్యక్షులు చెడే వెంకటేశ్వరరావు, చింతకాని మండల అధ్యక్షులు వెంకటనారాయణ, కల్లూరు మండల అధ్యక్షులు అనుమోలు శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు చలవాది నగేష్ తదితరులు పాల్గొన్నారు.






0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home