మహాలక్ష్మి పథకానికి నిధులు - వీటికే అధిక ప్రాధాన్యత..!?
మహాలక్ష్మి పథకానికి నిధులు - వీటికే అధిక ప్రాధాన్యత..!?
: తెలంగాణ ప్రభుత్వం వరుసగా రెండో సారి పూర్తి స్థాయి బడ్జెట్ 2025-26 ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు సభలో దాదాపు రూ 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ ఉదయం
నల్ల చమ్మ ఆలయంలో ఉపముఖ్యమంత్రి పూజలు చేసారు. అసెంబ్లీకి చేరుకున్న విక్రమార్క మం వర్గ భేటీలో పాల్గొన్నారు. బడ్జెట్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈ సారి బడ్జెట్ లో ఎన్నికల హామీలతో పాటుగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది.
రూ 3 లక్షల కోట్లకు పైగా
తెలంగాణ ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ భట్టి బడ్జెటు పైన ఆసక్తి నెలకొంది. ఈ సారి బడ్జెట్ రూ 3 లక్షల కోట్లకు పైగా ప్రతిపాదనలతో ఉంటుందని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,91,059 కోట్లతో బడ్జెట్ప్రవేశపెట్టింది. ఈ సారి సంక్షేమం తో పాటుగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సారి బడ్జెట్ పైన ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేకంగా ఫోకసం చేసారు. వాస్తవిక పరిస్థితులకు అనుగుణం గానే కేటాయింపులు ఉండాలని నిర్దేశించారు. ఆదాయ, వ్యయాలు బేరీజు వేసుకొని తయారు చేయాలని సూచించారు. ప్రస్తుత ఆర్దిక పరిస్థితులకు అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది.
క్షేమానికి ప్రాధాన్యత
ఈ సారి బడ్జెట్ లో ప్రభుత్వం సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా ఈ బడ్జెట్ లో పూర్తి కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ అభయ హస్తం, ఉచిత బస్సు, రూ.500 సిలిండర్, గృహజ్యోతి తదితర పథకాలు, హామీలకు నిధుల కేటాయింపులు ఉండను యి. గత బడ్జెట్ లో ఇళ్ల పథకానికి నిధులు కేటాయించారు, అమలు మాత్రం జరగలేదు. దీంతో ఆ ఏడాది అందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్‌లో పొందుపర్చనున్నారు. మహిళా శక్తి పథకం, ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కోసం మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే రాజీవ్ యువ వికాసం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంకోసం నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
అభివృద్ధి మార్గంలో
సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి నిధులు కేటాయింపులు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ పను , ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ తదితరాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపులో ప్రాధాన్యత ఉండనుంది. ఇక.. వ్యవసాయం, సాగునీటి రంగాలకు యథా ధిగా భారీ కేటాయింపులు దక్కనున్నాయి. రుణమాఫీ భారం ఈ ఏడాది లేనందున ఆ మేరకు కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధనంపై వ్యయం పెంచా లనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రాష్ట్ర ఆర్దిక పరిస్థితి గురించి వివరించారు. ఈ బడ్జెట్ ద్వారా వాస్తవిక పరిస్థితిని వివరిస్తూనే.. తమ లక్ష్యాలను ప్రభుత్వం స్పష్టం చేయనుంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home