వాసవి ప్రాణదాన ట్రస్ట్" ఆధ్వర్యంలో 50 మంది బీద డయాలసిస్ పేషెంట్స్ కి మెడికల్ కిట్స్ నెలసరి మందులు ఇవ్వడం జరిగింది.
వాసవి ప్రాణదాన ట్రస్ట్" ఆధ్వర్యంలో 50 మంది బీద డయాలసిస్ పేషెంట్స్ కి మెడికల్ కిట్స్ నెలసరి మందులు ఇవ్వడం జరిగింది. *ఖైరతాబాద్ లోని, వాసవి హాస్పిటల్లో, ఈరోజు ఉదయం 11 గంటలకు, "వాసవి ప్రాణదాన ట్రస్ట్" ఆధ్వర్యంలో 50 మంది బీద డయాలసిస్ పేషెంట్స్ కి మెడికల్ కిట్స్ నెలసరి మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి "ప్రాణదాన ట్రస్ట్" చైర్మన్ అధ్యక్షులుగా పద్మశ్రీ రమేష్ గెల్లి గారు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు శ్రీ పెండేకంటి రామ్మోహన్ రావు గారు పాల్గొని 50 మంది బీదవారికి కిట్స్ అందజేశారు. తరువాత ఆయన మాట్లాడుతూ, ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం,ఈ రెండు ఉంటే ప్రజలకు కొంత హాయిగా ఉంటుందని, ఆయన అంటూ, ఈ సంస్థ ద్వారా బీదలకు సహాయం చేయడం చాలా గొప్ప విషయమని, నన్ను పిలిచి నా చేతి ద్వారా మందులు ఇప్పించడం నేను భాగ్యంగా భావిస్తున్నానని, మరియు ఈ సంస్థకు పాటర్న్ గా నేను చేరుతానని హర్షద్వానాల మధ్య ఆయన ప్రకటించాడు. 'పద్మశ్రీ' రమేష్ గల్లీ గారు మాట్లాడుతూ, బీదవారికి సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ట్రస్టులో రామ్మోహన్ రావు గారు పాటర్న్ గా చేరడం చాలా ఆనందంగా ఉందని, ఆయన అంటూ, (వైద్యుని వద్దకు రోగి కాక, రోగి దగ్గరికి వైద్యుడు పోయే రోజు రావాలని ఆయన అన్నారు.) ప్రజల ఆర్థిక జీవన విధానం సమూలంగా మారితేనే తిండి,తిప్పల్లో ఒక మార్పు రానిదే ఆరోగ్యం, శుభ్రత చేకూరాదని ఆయన అన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ గౌరీశెట్టి చంద్రయ్య గారు స్వాగత ఉపన్యాసం చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్మోహన్ రావు గారు రావడం ఆయన వాసవి అకాడమీ ఎంతో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మంచి విద్యను అందిస్తూ ఉన్నాడని ఆయన వారిని ప్రశ్నించారు కార్యక్రమంలో హాస్పిటల్ అధ్యక్షుడు శ్రీ కొత్తూరు జయప్రకాష్ రావు గారు ప్రధాన కార్యదర్శి శ్రీ కొండ్లె మల్లికార్జున గారు తదితరులు పాల్గొన్నారు*.



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home