Wednesday, 22 January 2025

ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోండి:.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

 ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోండి....  



ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్స్ అర్హులైన ప్రతి ఒక్కరికి  పదకాలు అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని. నాలుగు పథకాలకు జరిగే గ్రామసభలలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లాలో బుధవారం గ్రామ, వార్డ్ సభలు నిర్వహించగ మొత్తం 475 గ్రామ పంచాయితీలు ఉండగా 139 గ్రామ సభలు, 05 మున్సిపాలిటీ పరిదిలోని 141 వార్డులలో 35 వార్డ్ సభలను   అధికారులు నిర్వహించారు. గ్రామ సభలలో 616 మంది రైతు భరోసా కొరకు, 5537 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 4384 మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 6124 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన వార్డ్ సభలలో 14 మంది మంది రైతు భరోసా కొరకు, 03 గురు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 972మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 1042మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 630 మంది రైతు భరోసా కొరకు, 5540 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 5356 మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 7166 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home