పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..
నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను ఓర్పుగా విన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 63 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి కేసుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు చట్టపరమైన న్యాయం అందేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
భూమి వివాదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత వ్యవహారాలు, దాడులు, వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రతి కేసును నిష్పక్షపాతంగా విచారించి, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్భయంగా పోలీస్ శాఖను ఆశ్రయించాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home