విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్
విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్
విద్యార్థులు బాగా చదివిఉన్నత స్థాయికి ఎదగాలని
జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్. అన్నారు.ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత & రక్షణ మరియు "మత్తు పదార్థాలకు నో చెప్పండి"అనే అంశంపై ఈ నెల 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని శిశు సంరక్షణ సంస్థల్లో ఉన్న విద్యార్థులు ఉన్నతికి కృషి చేస్తామని కలెక్టర్ అన్నారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ (CCIs)ల్లో ఆశ్రయం పొందుతున్న 18 సంవత్సరాల లోపు బాల బాలికలకు గుర్తింపు పత్రాలు పంపిణీ చేశారు. జనన ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు, హెల్త్ కార్డులు, ఆధార్ కార్డులు, సేవింగ్ బ్యాంక్ ఖాతా పుస్తకాలను జిల్లా కలెక్టర్ బాలలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు సంరక్షణ సంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలను బాలలు సద్వినియోగం చేసుకొని బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె. గణేష్, జిల్లా కో-ఆర్డినేటర్ (చైల్డ్ లైన్) బి. మహేశ్, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ఉన్నారు.




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home