ACB) అధికారులు శుక్రవారం కోలూర్ పోలీస్ స్టేషన్‌లో ట్రాప్ నిర్వహించారు.
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శుక్రవారం కోలూర్ పోలీస్ స్టేషన్‌లో ట్రాప్ నిర్వహించారు.
క్రైమ్ నంబర్ 508/2025 నుండి పేరు తొలగించేందుకు లంచం డిమాండ్ చేసిన కేసులో...
కోలూర్ PS సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. రమేష్‌ను ₹20,000 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుడు మొత్తం ₹30,000 లంచం కోరగా, ఇందులో భాగంగా ఇప్పటికే ₹5,000 స్వీకరించినట్లు దర్యాప్తులో తేలింది.
ట్రాప్ సమయంలో స్వీకరించిన లంచం డబ్బును ACB అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన SIని హైదరాబాద్‌లోని ప్రత్యేక ACB కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.
ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది అని ACB అధికారులు తెలిపారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home