Saturday, 14 June 2025

సింగర్ మంగ్లీ లిక్కర్ పార్టీలో తెలుగు హీరోయిన్..ఆ వీడియో మొత్తం లీక్


 సింగర్ మంగ్లీ లిక్కర్ పార్టీలో తెలుగు హీరోయిన్..ఆ వీడియో మొత్తం లీక్ 

                    ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా దాదాపు 50 మంది హాజరయ్యారు.అయితే, ఈ పార్టీలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు త్రిపుర రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అంతేకాకుండా, పార్టీలో ఉన్న 48 మందికి పోలీసులు గంజాయి పరీక్షలు నిర్వహించగా, అందులో 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై పార్టీ నిర్వాహకులపై పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

                     అయితే ఈ పార్టీపై మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ జరిగింది కేవలం బర్త్ డే పార్టీనే అని, రేవ్ పార్టీ కాదని ఆమె వివరణ ఇచ్చారు. ఈ పార్టీలో మా అమ్మ, నాన్న కూడా ఉన్నారని, వారికి ఎదురుగా పెట్టుకుని , ఇలా ఎవరైనా చేస్తారా అంటూ ప్రశ్నించింది. ఇక గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ వ్యక్తులకు తమకు ఎటువంటి సంబంధం లేదని, వారు ఎక్కడో తీసుకున్నారని, ఈ విషయం పోలీసులకు కూడా తెలియజేశారని మంగ్లీ తెలిపింది. ఇదిలా ఉంటే మంగ్లీ బర్త్ డే పార్టీలో ఓ తెలుగు నటి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ నటి మరెవరో కాదు..దివి వద్త్య. బిగ్‌ బాస్‌ రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అంతకుమందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చింది. మహేష్ బాబు 'మహర్షి', చిరంజీవి 'గాడ్ ఫాదర్' అల్లు అర్జున్ 'పుష్ప-2'వంటి సినిమాల్లో నటించింది.దివి వద్త్య కూడా మంగ్లీ బర్త్ డే పార్టీకి హాజరైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. మంగ్లీ నా స్నేహితురాలని, అందుకే ఆమె బర్త్ డే వేడుకలకు వెళ్లానని దివి చెప్పుకొచ్చింది. 

            సోషల్ మీడియాలో తన ఫోటోలను ఉపయోగించి తప్పులను తనపై మోపడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.అక్కడ జరిగిన తప్పులన్నింటినీ నాపైన మోపడం సరికాదని దివి అన్నారు. నేను నిజంగా తప్పు చేసి ఉంటే, అందుకు మీ దగ్గర తగిన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటే సోషల్ మీడియాలో నా ఫొటో పెట్టండి. కానీ ఎలాంటి ఆధారం లేకుండా నా ఫొటో వాడి నన్ను నెగెటివ్ చేయకండి. దీని వల్ల నా కెరీర్‌కు చాలా ఇబ్బంది అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home