ఆధునిక యుగంలో జర్నలిజంలో చరిత్రాత్మకమైన మార్పులు వస్తున్నాయని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్-మల్కాజిగిరి:జూన్9
ఆధునిక యుగంలో జర్నలిజంలో చరిత్రాత్మకమైన మార్పులు వస్తున్నాయని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాంపల్లి లోని మీడియా అకాడమీ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
మేడ్చల్,మల్కాజ్గిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా లోని పాత్రికేయులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తల సేకరణలో సామాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయని ఆయన తెలిపారు.సాంకేతికతను సమగ్రంగా తెలుసుకుంటే వార్తల సేకరణ సులభం అవుతుందని తెలిపారు, పాఠకుల వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా వార్తలు ఉండాల
ని, తెలుగు వార్తలను సులువైన భాషలో వ్రాయాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రముఖ సంపాదకులు కే. శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్తు మీడియా ధోరణులు,ఆధునిక యుగంలో మీడియాలో వస్తున్న మార్పుల గురించి వివరించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ లలో వస్తున్న వార్తలు క్షణాల్లో ప్రజల్లోకి వెళ్తున్నాయని తెలిపారు.
సీనియర్ పాత్రికేయులు మార్కండేయ మాట్లాడుతూ నూతన టెక్నాలజీని వినియోగించుకొని పాఠకులను ఆకర్షించే విధంగా వార్తలను సేకరించాలని ఆయన వివరించారు.
సీనియర్ జర్నలిస్ట్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ నేర వార్తల సేకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు ,చట్టాలపై అవగాహన ఉండాలని, వార్తలు సేకరించే ముందు నిజనిర్ధారణ చేసుకొని వ్రాయాలని ఆయన సూచించార., అలాగే నేర వార్తలు వ్రాయడంలో చేయాల్సినవి, చేయకూడని అంశాలపై క్లుప్తంగా వివరించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు, టియుడబ్ల్యుజె అధ్యక్షులు విరాహత్ అలీ, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, కార్యదర్శి మోతె వెంకట్ రాంరెడ్డి,
మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.






0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home