Wednesday, 11 June 2025

"గ్రీన్ టీ" తో సైడ్​ ఎఫెక్ట్స్..!? వీరు దూరంగా ఉంటేనే మంచిది..!!

 "గ్రీన్ టీ" తో సైడ్​ ఎఫెక్ట్స్..!? వీరు దూరంగా ఉంటేనే మంచిది..!! 

       గ్రీన్ టీ. ఇది ఆరోగ్య కరమైనది అందరూ భావిస్తారు. రెగ్యులర్ గా తీసుకునే వారు


ఉన్నారు. గ్రీన్ టీ తో మంచి ఎంత ఉందో.. కొందరికి అంత సమస్యలు ఖాయమని తాజా పరిశోధనల ద్వారా వెల్లడి అవుతోంది. అధికంగా తీసుకోవటం నష్టం చేస్తుందని గుర్తించారు. అందులో మందులు తీసుకునే వారు.. కొన్ని అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఈ గ్రీన్ టీని పరిమితంగా తీసుకోవటం మంచింది. మితంగా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తూ మెలబాలిజం మెరుగు చేస్తుంది. అయితే, అధికంగా తీసుకుంటే మాత్రం ప్రతికూల ప్రభావాలు తప్పవు. గ్రీన్ టీ లో ఔషధ గుణాలు ఉన్నాయనే నమ్మకం ఉంది. అనేక మంది గ్రీన్ టీని ఎక్కువగా వినియో గిస్తూ ఉంటారు. అయితే, ఎక్కువగా గ్రీన్ టీ తీసుకోవటం ద్వారా నిద్రలేమి.. తల నొప్పుల సమస్య లు వస్తాయని చెబుతున్నారు. పరిమితంగా తీసుకున్న వారిలో సమస్యలను తక్కువగా గుర్తించిన ట్లు వెల్లడించారు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకునే వారికి సమస్యలు దూరంగా ఉంటా యని పరిశోధకులు వెల్లడించారు. అధిక మోతాదులో తీసుకున్నప్పుడు కాలేయానికి నష్టం కలిగే అవకాశం ఉందని పలు పరిశోధనలో తేలింది. ఇందులో ఉండే కాటెచిన్స్ హెపాటోటాక్సిసిటీకి కారణమవుతుందని నేషనల్ టైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది. 

               దీని కారణంగా కాలేయ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ పరిమితంగా తీసుకోవాలని.. వైద్యుల సలహా మేరకే నడుచుకోవటం మంచింది. గ్రీన్ టీలో ఉండే టానిన్లు శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచ టంతో వికారం, మలబద్ధకం, కడుపులో అసౌకర్యం, రక్తపోటు పెరగడం లాంటి సమస్యలు రావొచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అధ్యయన నివేదికలో వెల్లడైంది.

            గ్రీన్ టీ అనేది ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుందని, దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఐరన్ లోపం రావడంతో పాటు అనీమియాకు దారితీస్తుందని పేర్కొంది. బోలు ఎముకల వ్యాధి ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండే మంచిదని సూచిస్తున్నారు. గర్భవతులు గ్రీన్ టీ తాగే ముందు సంబంధిత డాక్టర్లును సంప్రదించడం మంచిదని పేర్కొన్నారు. 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home