Saturday, 7 June 2025

రాజీవ్ స్వగృహ.. ఫ్లాట్లు, ప్లాట్లు వేలానికి పచ్చజెండా!


 రాజీవ్ స్వగృహ.. ఫ్లాట్లు, ప్లాట్లు వేలానికి పచ్చజెండా! 

       రాజీవ్ స్వగృహ అనేది ఆంధ్రప్రదేశ్‌లో 2007లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు సొంత ఇళ్లను అందించడం కోసం, రియల్ ఎస్టేట్ దోపిడీ నుంచి రక్షణ కల్పించడం కోసం తీసుకువచ్చిన హౌసింగ్ పథకం. ఈ పథకం కింద భూములు సేకరించి, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, ఇతర నివాస సముదాయాలను నిర్మించి మధ్యతరగతి ప్రజలకు అందించాలని సంకల్పించారు. మధ్యతరగతి వారి సొంతింటి కల తీర్చే రాజీవ్ స్వగృహ మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలలో ఇళ్ళను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం లక్ష్యంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. సకల సౌకర్యాలు కలిగిన నివాసాలను అందించాలని భావించారు 2007లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా 3,716 ఫ్లాట్లు 556 వ్యక్తిగత గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2013 నాటికి 2956 ఫ్లాట్లు పూర్తిచేశారు. 195 గృహాలు నిర్మించారు. మిగిలిన ఫ్లాట్లు, స్థలాలు వేలం వెయ్యాలని నిర్ణయం ఈ పథకం పైన 1809. 56 కోట్ల వ్యయం చేశారు. 919. 31 కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణంగా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ పథకంలో 1046 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రభుత్వం చూసింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల తీర్చాలని భావించింది. కానీ అనేక సమస్యలను ఎదుర్కొని ప్రస్తుతం మిగిలిన ఫ్లాట్లు స్థలాలను వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. రాజీవ్ స్వగృహ ఇళ్లల్లో అనేక సమస్యలు రాజీవ్ స్వగృహ లో అనేక గృహాలు నిర్మాణంలో నాణ్యత సమస్యలను ఎదుర్కొన్నాయి. సౌకర్యాల లోపం, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల లోపంతో రాజీవ్ స్వగృహ ఇళ్లల్లో అనేక సమస్యలు వెలుగు చూశాయి. ఈ సమస్యల కారణంగా రాజీవ్ స్వగృహ పథకాన్ని అమలు చేయలేకపోయింది ప్రభుత్వం. రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ హౌసింగ్ బోర్డ్ ఫ్లాట్లు, స్థలాలు విక్రయం పైన తెలంగాణ సర్కార్ ప్రత్యేకమైన దృష్టి సారించింది.                   

                      ఫ్లాట్లు, ప్లాట్లు వేలానికి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన నిధుల సేకరణకు పలు ప్రాంతాలలో ఉన్న ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు బహిరంగ వేలం వేయడానికి హౌసింగ్ బోర్డు తో పాటు రాజీవ్ స్వగృహ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, కమిషనర్ పి వి గౌతమ్ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపింది. ఈనెల 20వ తేదీ నాటికి నోటిఫికేషన్ విడుదల ఈనెల 20వ తేదీ నాటికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి, అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని 11 ప్రాంతాలలో ఇప్పటికే పూర్తయి పాక్షికంగా పూర్తయిన అపార్ట్మెంట్ ల ఫ్లాట్ లతోపాటు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చెయ్యొచ్చన్నారు. హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో నాలుగు ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, స్థలాలు బహిరంగ వేలం ద్వారా విక్రయించిన ఎటువంటి వివాదాలు లేని భూములు వేలంలో కొనొచ్చు అన్నారు.

           ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి మంచి అందుబాటులో ఉండే సరసమైన ధరలతో నిర్మించిన అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ కమిషనర్ గౌతం విజ్ఞప్తి చేశారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home