Saturday, 24 May 2025

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..

 

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..

telangana sarpanch mptc elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.               తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగరా మోగనుంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలు. ఎన్నికల తేదీని ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆశావాహులు మాత్రం వారి ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరో నెల, రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది.. అప్పటి వరకు ఆగడం ఎందుకన్నట్లు.. ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇప్పటికే గ్రామాల్లో.. స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు, సర్పంచ్ పదవుల వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. తాజాగా సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముహుర్తం ఫిక్స్ చేసింది. ఆ వివరాలు..


తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై జనాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నికల తేదీ ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని… రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home