విజయవాడలో ఫ్రీ హాస్టల్స్, అక్కడ వారికి ఫుడ్, బెడ్ ఉచితం.. కానీ
విజయవాడలో ఫ్రీ హాస్టల్స్, అక్కడ వారికి ఫుడ్, బెడ్ ఉచితం.. కానీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రత్యేకమైన దృష్టిని సారించి కృషి చేస్తున్నామని పదే పదే చెబుతోంది. ఇక ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఒక సరికొత్త ఆలోచనను అమలు చేసిన ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల కోసం, ఉపాధి అవకాశాల కోసం విజయవాడకు వచ్చి ఇబ్బంది పడుతున్న వారికి ఉచిత వసతి సదుపాయాన్ని కల్పించడానికి శ్రీకారం చుట్టింది. విజయవాడలో నాలుగు చోట్ల వసతి గృహాలు ఏపీ ప్రభుత్వం జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం కింద నిరుద్యోగ యువతకు ఉపాధి, ఇతర పనుల కోసం విజయవాడకు వచ్చిన వారికి, వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వసతి గృహాలను ఏర్పాటు చేసింది. ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నవారు, కనీసం రూమ్ రెంట్ కూడా తట్టుకోలేని స్థితిలో ఉన్న వారి కోసం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు చోట్ల వసతి గృహాలను ఏర్పాటు చేసింది. ఫ్రీగా ఫుడ్, బెడ్, అన్ని వసతులతో హాస్టల్స్ కేవలం ఆధార్ కార్డు ఉంటే ఒక రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా ప్రభుత్వం వారికి ఆశ్రయం కల్పిస్తుంది. కేవలం ఆశ్రయం మాత్రమే కాదు అక్కడ ఉంటున్న వారికి భోజన వసతితో పాటు, బెడ్ కూడా అందిస్తుంది. అంతేకాదు టీవీ సౌకర్యాన్ని, యోగ సౌకర్యాన్ని కూడా కల్పించి హాస్టల్లో ఉండే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిన వారికే అయితే ప్రభుత్వం ఉచితంగా వసతి గృహాలను నిర్వహిస్తున్న విషయం తెలియని చాలామంది డబ్బులు ఖర్చు చేసి బయట లాడ్జిలలో, హోటల్స్ లో ఉంటున్నారు. ఇక విజయవాడకు వెళ్లే నిరుద్యోగులు, పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వెళ్ళిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహాలలో ఉంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్, భోజన సదుపాయం కూడా ఉంటుంది. అలాగే ఎటువంటి ఇబ్బంది ఉండదు. విజయవాడలో ఫ్రీ వసతి గృహాలు ఉంది ఇక్కడే ఈ హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి కచ్చితంగా అవసరం. విజయవాడలోని విద్యాధరపురం, రాణి గారి తోట, గాంధీనగర్, వెహికల్ డిపో ప్రాంతాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ హాస్టల్స్ ఉన్నాయి. ఈ నాలుగు చోట్ల ఏర్పాటుచేసిన వసతి గృహాలలో ఒక్కో వసతి గృహంలో 100 పడకలు అందుబాటులో ఉన్నాయి. అయితే పనీపాటా లేకుండా జులాయిగా తిరిగేవారు వీటిలో నెలలు తరబడి ఉంటాం అంటే మాత్రం కుదరదు. Also Read అడవితల్లి బాటలో పవన్ కళ్యాణ్; గిరిజన గ్రామాలకు ప్రణామం, అభివృద్ధికి శ్రీకారం! షరతులు వర్తిస్తాయి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళిన వారు ఆ ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరికే వరకు మాత్రమే వాటిలో ఉండవచ్చు. అలాకాకుండా ఏ పని లేకుండా పూట గడుపుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అటువంటి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తారు. ఇవి కేవలం జాతీయ పట్టణ జీవనోపాదుల పథకం కింద జెన్యూన్ గా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసే వారి కోసం ఏర్పాటుచేసిన వసతి గృహాలు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home