Friday, 7 March 2025

ఏసీబీ కి చిక్కిన జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కమిషనర్

 జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కమిషనర్


కందుకూరి శ్రీనివాస్ రూపాయలు 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఒప్పంద పద్ధతిన పైడిపల్లి మహేష్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈయన చేసే పనులకు సంబంధించిన ఎంఓయును ఉన్నతాధికారులకు పంపించడం, మూడు నెలల వేతనం చెల్లింపు కోసం కమిషనర్ లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మహేష్ ఏసీబీని ఆశ్రయించారు. గురువారం రాత్రి  బాధితుడు నుండి పురపాలక కమిషనర్ 20 వేల నగదును తీసుకుంటుండగా ఏసీ వ్యాధికారులు పట్టుకున్నారు. తన ఉద్యోగాన్ని పునరుద్ధరించాలని పుర కౌన్సిల్ తీర్మానం చేసిన ఉన్నతాధికారులకు కమిషనర్ ఫైల్ ను పంపించడం లేదని మహేష్ పేర్కొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home