కేజీబీవీ విద్యార్థినులు పదవ తరగతిలో పదికి పది జిపిఏ మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
కేజీబీవీ విద్యార్థినులు పదవ తరగతిలో పదికి పది జిపిఏ మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
బుధవారం ఆమె నల్గొండ జిల్లా, కనగల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు. వారితో సెల్ఫీ దిగిన అనంతరం మాట్లాడుతూ పదవ తరగతిలో ఎక్కువ జిపిఏ మార్కులు ప్రత్యేకించి 10-10 జిపిఏ సాధించిన వారిని విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకువెళ్తానని వారిని ప్రోత్సహించడమే కాకుండా వారికి రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. అందువల్ల తరగతిలోని విద్యార్థినులందరూ 10 కి 10 జిపిఏ వచ్చే విధంగా బాగా చదవాలని ఆమె విద్యార్థులను ప్రోత్సహించారు. భవిష్యత్తులో మంచి కళాశాలలో ర్యాంకులు రావాలంటే ఎన్ సి ఈఆర్టీ పుస్తకాలు చదవాలని ఆమె సూచించారు. ముఖ్యంగా 8, 9, 10 తరగతి విద్యార్తినిలు ఇప్పటినుండే ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రాక్టీస్ చేయాలన్నారు. అవసరమైతే 9, 10 తరగతుల పుస్తకాలను తక్షణమే పాఠశాలకు పంపించడం జరుగుతుందని ఆమె తెలిపారు. చదువువల్లనే అన్ని సాధించడం జరుగుతుందని, అందువల్ల చదువు పైన ఎక్కువ దృష్టి సారించి జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలని ఆమె సూచించారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home