Wednesday, 31 January 2024

పుష్టికరమైన... వెజిటబుల్ ఊతప్పం

  పుష్టికరమైన... వెజిటబుల్ ఊతప్పం (Vegetable Uttapam)..

             రోజూ ఉదయం అదే అల్పాహారం తినడం వల్ల బోర్ కొట్టి అలసిపోయారా? కొంచెం రుచిగా మరియు పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవాలనుకుంటున్నారా? అలాంటప్పుడు, కూరగాయల స్టీమర్ దాని కోసం ఉత్తమ ఎంపిక. వెజిటబుల్ పఫ్స్‌లో వివిధ రకాల కూరగాయలు ఉంటాయి కాబట్టి, వాటిలో విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఉదయం పూట తింటే శరీరానికి రోజుకి కావాల్సిన శక్తి అందుతుంది. మీరు వెజిటబుల్ ఊతప్పం ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? క్రింద కూరగాయలతో వెజిటేబు ఊతప్పం యొక్క సాధారణ వంటకం ఉంది. చదివి రుచి చూసి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. అత్త తన మేకప్ ప్రొడక్ట్స్ వాడిందని భర్తపై కోర్టుకెక్కిన భార్య..కౌన్సిలింగ్..ఆ విషయంలో తగ్గేదేలేదంటున్న భార్య.! కావల్సిన పదార్థాలు: * దోస పిండి - కావలసిన పరిమాణం * సన్నగా తరిగిన ఉల్లిపాయ - 2 టేబుల్ స్పూన్లు 15సం. తర్వాత మీనరాశిలో రాహు-బుధ సంయోగంతో ఈ 3 రాశులకు ఊహించని విజయాలు, పదోన్నతులతో బంగారు భవిష్యత్ * సన్నగా తరిగిన మిరపకాయలు - 2 టేబుల్ స్పూన్లు * సన్నగా తరిగిన టమోటాలు - 1 టేబుల్ స్పూన్ * సన్నగా తరిగిన క్యారెట్ - 2 టేబుల్ స్పూన్లు 01 ఫిబ్రవరి 2024 నేటి రాశిఫలం ఈరోజు ఈ రాశులకు లక్ష్మీ దేవీ అనుగ్రహంతో అదృష్టం పొందుతారు * సన్నగా తరిగిన బీన్స్ - 2 టేబుల్ స్పూన్లు * సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1 * కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్ * జీలకర్ర - చిటికెడు రెసిపీ తయారుచేయు విధానం: * ఒక గిన్నెలో ఉల్లిపాయ, కారం, టొమాటో, క్యారెట్, బీన్స్ పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసి కలపాలి. * తర్వాత కాస్త చిక్కటి దోసె పిండిని తీసుకోండి. * తర్వాత దోసె వేసే పాన్ ను స్టౌ మీద పెట్టి వేడి చేసి, నూనె రాసి అందులో ఒక చెంచా దోస పిండిని పోసి, పెద్ద వృత్తాకారంలో వేయకుండా, చిన్నదిగా చుట్టాలి. 

            


 * తర్వాత దానిపై కాస్త వెజిటబుల్‌ చల్లి, నూనె లేదా నెయ్యి పోసి మూత పెట్టి తక్కువ మంటపై 2 నిమిషాలు ఉడికించాలి. * దోసెను తిప్పిన తర్వాత, దోసను దోస స్పూన్‌తో కొద్దిగా వత్తి, 2 నిమిషాలు ఉడకనివ్వండి, వెజిటబుల్ స్టఫ్డ్ దోసె రెడీ. ఈ కూరగాయల దోసెలోకి కొబ్బరి చట్నీ అద్భుతంగా ఉంటుంది. గమనిక: వెజిటబుల్ దోసె కోసం అవసరమైన కూరగాయలు పూర్తిగా మీ ఇష్టం. కానీ త్వరగా ఉడికె కూరగాయలను జోడించడం మంచిది. ముఖ్యంగా కూరగాయలు చాలా చిన్న సైజులో కట్ చేసుకుంటే, త్వరగా ఉడుకుతాయి.

ఆంధ్రా స్టైల్ డ్రమ్ స్టిక్ చికెన్ గ్రేవీ ఆంధ్రా స్టైల్ డ్రమ్ స్టిక్ చికెన్ గ్రేవీ

 ఆంధ్రా స్టైల్ డ్రమ్ స్టిక్ చికెన్ గ్రేవీ ఆంధ్రా స్టైల్ డ్రమ్ స్టిక్ చికెన్ గ్రేవీ

ఈ వారం ఇంట్లో చికెన్ తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఆది వారం ఆంధ్రా వంటకాన్ని ప్రయత్నించండి. అది ఆంధ్రా స్టైల్ డ్రమ్ స్టిక్ చికెన్ గ్రేవీ. ఇది అన్నంతో మాత్రమే కాదు చపాతీలు, పూరీలు మొదలైన వాటితో కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో అతిథులు ఉన్నప్పుడు ఈ రెసిపీని తయారు చేస్తే తప్పకుండా వారి ప్రశంసలు కూడా అందుకుంటారు. ఆంధ్రా స్టైల్ డ్రమ్ స్టిక్ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? క్రింద సింపుల్ ఆంధ్రా స్టైల్ డ్రమ్ స్టిక్ చికెన్ గ్రేవీ రిసిపి ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

కావల్సినవి:


         * చికెన్ - 1 కిలో * మునగకాయలు - 2(కావల్సిన సైజ్ లో కట్ చేసుకోండి) అత్త తన మేకప్ ప్రొడక్ట్స్ వాడిందని భర్తపై కోర్టుకెక్కిన భార్య..కౌన్సిలింగ్..ఆ విషయంలో తగ్గేదేలేదంటున్న భార్య.! * టొమాటోలు - 2 (తరిగినవి) * పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి) * పచ్చిమిర్చి - 6 మకరరాశిలో బుధాదిత్య రాజయోగం: ఫిబ్రవరిలో ఈ 3 రాశుల వారికి అదృష్టమో తెలుసా? *లవంగాలు - 5 * మిరియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు * పసుపు పొడి - 1/2 టేబుల్ స్పూన్ * కొబ్బరి పొడి / కొబ్బరి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు * బెల్లం పొడి - 1 టేబుల్ స్పూన్ * వెల్లుల్లి - 4 రెబ్బలు (పేస్ట్ చేయండి) * కొత్తిమీర - కొద్దిగా * ఉప్పు - రుచి ప్రకారం * నూనె - కావలసిన పరిమాణం పేస్ట్ తయారుచేసుకోవడానికి... * పెద్ద ఉల్లిపాయ - 1/2 (తరిగిన) * అల్లం - 1 నిమ్మకాయ సైజు * వెల్లుల్లి - 12 లవంగాలు * బెరడు - 1 ముక్క * కొత్తిమీర - 1/4 కప్పు * పుదీనా - 1/4 కప్పు రెసిపీ తయారుచేయు విధానం: * ముందుగా చికెన్‌లో పసుపు వేసి బాగా కడగాలి. ఆ తర్వాత పదార్థాలను మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. * తర్వాత చికెన్‌లో కారం, ఉప్పు, పసుపు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. * తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడయ్యాక లవంగాలు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి 2 నిమిషాలు వేయించి, మునగ ముక్కలు వేసి వేయించాలి. * తర్వాత తరిగిన పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేయించి, రుబ్బిన మసాలా వేసి బాగా వేయించాలి. మసాలా నుండి నూనె వేరుపడటం మీరు చూసినప్పుడు, చికెన్ వేసి, కొద్దిగా ఉప్పు చల్లి, చికెన్ రంగు మారే వరకు బాగా వేగించండి. * తర్వాత మూతపెట్టి చిన్న మంట మీద 5-8 నిమిషాలు చికెన్ ఉడికించి,తర్వాత గ్రేవికి సరిపడా నీళ్ళు పోసి ఉడికించాలి. ఆ తర్వాత టొమాటోలు వేసి టొమాటోలు మెత్తబడే వరకు ఉడికించాలి. * తర్వాత ఒక కప్పు వేడినీళ్లు పోసి చికెన్ బాగా ఉడికినంత వరకు 10-15 నిమిషాలు మరిగించాలి. * చికెన్ బాగా ఉడికిన తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు బాగా మరిగించి, పైన కొత్తిమీర చల్లితే, ఆంధ్రా స్టైల్ డ్రమ్ స్టిక్ చికెన్ గ్రేవీ రెడీ.

రిలయన్స్‌ మళ్లీ నం.1.. ఈ జాబితాలో 3 అదానీ కంపెనీలు ఔట్‌!

 రిలయన్స్‌ మళ్లీ నం.1.. ఈ జాబితాలో 3 అదానీ కంపెనీలు ఔట్‌!

            : ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (Reliance Industries)


 మరోసారి సత్తా చాటింది. భారత్‌ నుంచి అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.  2023 సంవత్సరానికి సంబంధించి హురున్‌ గ్లోబల్‌ ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్‌ 44వ స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి గతేడాది సైతం అగ్రస్థానంలో నిలిచిన రిలయన్స్.. ఈసారి మాత్రం 198 బిలియన్‌ డాలర్ల విలువతో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. అయితే, కంపెనీ విలువ 2 శాతం మేర క్షీణించడంతో ఓవరాల్‌ ర్యాంకుల్లో 10 స్థానాలు కోల్పోయింది.  టాప్‌-500 జాబితాలో భారత్‌ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ 60వ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 68వ ర్యాంకులను దక్కించుకున్నాయి. 2023లో టీసీఎస్‌ విలువ 14 శాతం పెరిగి 158 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఐదు స్థానాలను మెరుగుపరుచుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌ఈఎఫ్‌సీ విలీనం వల్ల కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దీంతో ఆ బ్యాంక్‌ ఏకంగా 43 స్థానాలను మెరుగుపరుచుకుంది. భారత్‌ నుంచి కొత్తగా టైటాన్‌, సన్‌ఫార్మా కొత్తగా టాప్‌-500 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌ కంపెనీలు వాటి విలువలు కోల్పోయి ఈ జాబితాలో నుంచి వైదొలిగాయి. ఇటీవల కాలంలో ఆయా కంపెనీల విలువలు పెరగడం గమనార్హం. భారత్‌ నుంచి మొత్తంగా 18 కంపెనీలతో ఈ జాబితాలో భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది.  ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అల్ఫాబెట్‌, అమెజాన్‌, ఎన్విడియా అత్యంత విలువైన కంపెనీల జాబితాలో టాప్‌-5లో చోటు దక్కించుకున్నాయి. ఈ కంపెనీలన్నీ తొలిసారి 1 ట్రిలియన్‌ డాలర్లు దాటడం గమనార్హం. ఇందులో తొలి నాలుగు కంపెనీలు గతేడాది కూడా అవే స్థానాల్లో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌, ఎన్విడియా ఏఐ కంపెనీ చాట్‌జీపీటీతో సంబంధం కలిగి ఉండడంతో వాటి విలువ భారీగా పెంచుకోగలిగాయి. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు పెట్టింది. ఎన్విడియా ఆ కంపెనీకి సెమీకండక్టర్లను సమకూరుస్తోంది. దీంతో కంపెనీ విలువ మూడు రెట్లు పెరిగింది. ఇక ఓపెన్‌ఏఐ 50 బిలియన్‌ డాలర్ల విలువతో 291వ స్థానంలో నిలిచింది.

అత్యవసర చికిత్సల కోసం శ్రీలంకను ఆశ్రయించిన మాల్దీవులు..!

 అత్యవసర చికిత్సల కోసం శ్రీలంకను ఆశ్రయించిన మాల్దీవులు..!



ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ అందిస్తున్న అత్యవసర సేవలను కాదన్న మాల్దీవులు.. ఆర్థిక సమస్యలతో అట్టుడుకుతున్న శ్రీలంక వద్దకువెళ్లి సాయం కోరింది. తమ దేశంలో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలను అత్యవసర చికిత్సల కోసం కొలంబోకు తరలించేలా ఒప్పందం చేసుకొంది.


ఈ మేరకు మాల్దీవుల రవాణా శాఖ మంత్రి మహమ్మద్‌ అమీన్‌, శ్రీలంక మంత్రి నిమల్‌ సిరిపాల డిసిల్వాతో భేటీ అయ్యారు. ఈవిషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు. వైద్య చికిత్స కోసం బాధితులను తరలించే విమానాలకు శరవేగంగా అనుమతులు మంజూరుచేసేలా ఇరు దేశాలు నియమనిబంధనలు సిద్ధం చేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు. శ్రీలంక మంత్రి నిమల్‌ సిరిపాల మాట్లాడుతూ '' మాలె ప్రజలకు శ్రీలంకలో అత్యవసర చికిత్సలు అందేలా ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయి'' అని తెలిపారు. మాల్దీవులకు అత్యంత సమీపంలో ఉండేది భారత్‌, శ్రీలంకలు మాత్రమే.


'భారత్‌కు ముయిజ్జు క్షమాపణలు చెప్పాలి': మాల్దీవుల విపక్షం డిమాండ్‌


వైద్యపరంగా అత్యవసర తరలింపుల విషయంలో భారత్‌ భాగస్వామ్యాన్ని వదులుకొని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ముయిజ్జు ప్రభుత్వం నిర్ణయించింది. 2024 మార్చి నుంచి ప్రత్యేకంగా ఎయిర్‌ అంబులెన్స్‌ వ్యవస్థలను సిద్ధం చేస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. వీటి ద్వారా అవసరమైతే థాయిలాండ్‌కు వెళ్లి చికిత్స తీసుకోవచ్చని పేర్కొంది. కానీ, ఇటీవల ఒక టీనేజర్‌ను అత్యవసర చికిత్సకు తరలించడంలో జాప్యం జరగడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత ముయిజ్జు సర్కారు శ్రీలంకతో ఒప్పందానికి మొగ్గు చూపింది. మాల్దీవుల ప్రజలు భారత్‌లో చికిత్స పొందడానికి ఇష్టపడతారు. అక్కడ దాదాపు పదేళ్లుగా 'అసంధా' పేరిట ప్రభుత్వం యూనివర్సల్‌ ఇన్స్యూరెన్స్‌ను నిర్వహిస్తోంది. దానికింద చాలా భారతీయ ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంది. తాజాగా అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉండే భారత్‌ను కాదనుకొని.. అరకొర వసతులుండే కొలంబోను ఎంచుకోవడం గమనార్హం.


ముయిజ్జు ప్రభుత్వం మార్చి 15వ తేదీలోపు భారత దళాలు మాల్దీవులను వీడాలని డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే. అక్కడ మన దేశ నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్‌ విమానం ఇప్పటివరకు సేవలు అందిస్తున్నాయి. దాదాపు 80 మంది సిబ్బంది అక్కడ ఉన్నారు. గత ఐదేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అత్యవసర చికిత్స అవసరమైన సుమారు 600 మందిని భారత్‌కు తరలించింది. దీంతోపాటు అక్కడ గాలింపు, సహాయక చర్యల్లో కూడా ఈ బృందాలు పాల్గొంటున్నాయి.

Friday, 26 January 2024

నల్లగొండ జిల్లాలో చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం

 నల్లగొండ జిల్లాలో చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం


సమర్పించారు శుక్రవారం నాడు మంత్రి స్థానికంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా చిన్నపత్రికల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించడం జరిగింది .జిల్లా కేంద్రంలో సుమారు 50 మందికి పైగా చిన్న దినపత్రికలతో పాటు మాస పక్ష వారపత్రికలు నడుపుతున్నారని వారు తెలిపారు గత కొన్ని దశాబ్దాలుగా చిన్న పత్రికలు నిర్వహిస్తూ ఆర్థిక భారంతో సతమగుతమవుతున్నారని సొంత గూడు లేక అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్నారని చెప్పారు ఒక వైపు పత్రిక నిర్వహణ మరొకవైపు తన కుటుంబ పోషణ భారాన్ని  భరించలేక ఆర్థికంగా నలిగిపోతున్నారని అన్నారు పాత్రికేయుల  పట్ల పక్షపాతిగా పేరున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో చిన్నపత్రిల వారందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి పత్రిక బాంధవుడుగా పేరు తెచ్చుకోవాలని కోరారు వినతిపత్రం సమర్పించిన వారిలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాదీనం, సోమవారపు యాదయ్య, ఎండీ.మక్సుదు,  వెన్నమల్ల రమేష్ బాబు, అబ్బోజు మదనాచారి, గంగాధర వెంకటేశ్వర్లు,  అశోక్  తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ చైర్మ‌న్ ప‌ద‌వి మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డినే వ‌రించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌గా మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు

 


                                               హైద‌రాబాద్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) చైర్మ‌న్ ప‌ద‌వి మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డినే వ‌రించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌గా మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. స‌భ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర‌, పాల్వాయి ర‌జ‌నీ కుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాద‌య్య‌, వై రాంమోహ‌న్ రావు నియ‌మితుల‌య్యారు. టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌గా మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆమోదించారు. Also Read - భూసేక‌ర‌ణ‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించండి టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వ‌ర‌కు ద‌రఖాస్తులు వ‌చ్చాయి. ప్ర‌భుత్వం సెర్చ్ క‌మిటీని నియ‌మించి, ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌, అర్హుల‌ను సూచించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. క‌మిటీ వేగంగా ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న చేప‌ట్టి చైర్మ‌న్‌ను, స‌భ్యుల‌ను ఎంపిక చేసింది. చైర్మ‌న్ ప‌ద‌వి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో నుంచి మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి పేరును ప్ర‌భుత్వానికి సూచించింది సెర్చ్ క‌మిటీ. ప్ర‌భుత్వం ఆ పేరును గ‌వ‌ర్న‌ర్ ప‌రిశీల‌న‌కు పంప‌గా, ఆమె కూడా ఆమోదించారు. Also Read - రేవంత్ పాలన భేష్‌: మాజీ మంత్రి జానారెడ్డి కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు ఐఏఎస్ అధికారి జ‌నార్ధ‌న్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌గా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హ‌యాంలో టీఎస్‌పీఎస్సీ ప్ర‌శ్న‌ప‌త్రాలు లీక్ కావ‌డంతో ప‌లు ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న దిశ‌గా అడుగులు వేసింది. చైర్మ‌న్‌తో పాటు స‌భ్యులంద‌రూ రాజీనామా చేశారు. మ‌హేంద‌ర్ రెడ్డి నేప‌థ్యం.. ముదిరెడ్డి మ‌హేంద‌ర్ రెడ్డి ఖ‌మ్మం జిల్లా మ‌ధిర మండ‌లం కిష్ణాపురంలో 1962 డిసెంబర్‌ 3న జన్మించారు. మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. మ‌హేంద‌ర్ రెడ్డి ఐపీఎస్‌గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవ‌లందించారు. పోలీసు శాఖ‌లో సాంకేతిక‌త‌తో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చారు మ‌హేంద‌ర్ రెడ్డి. 2022, డిసెంబ‌ర్ 31వ తేదీన మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. Also Read - ఉద్యమకారుడిగా గౌరవించారు: కోదండరామ్‌ డీజీపీ అనురాగ్ శ‌ర్మ ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత 2017, న‌వంబ‌ర్ 12న ఇంచార్జి డీజీపీగా నియ‌మితుల‌య్యారు. 2018, ఏప్రిల్ 10న పూర్తి స్థాయి డీజీపీగా నియ‌మితుల‌య్యారు. మూడేండ్ల‌కు పైగా త‌న ప‌ద‌వీ కాలంలో ఆయ‌న రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అందుకే 2020, ఏప్రిల్ 8న దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారుల జాబితాలో 8వ స్థానాన్ని మ‌హేంద‌ర్ రెడ్డి ద‌క్కించుకున్నారు. ఇక ప్ర‌స్తుతం టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌గా నియామ‌క‌మైన మ‌హేంద‌ర్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఎందుకంటే క‌మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. 62 ఏండ్లు దాటితే ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉంటుంది.

దమ్ముంటే లోకల్‌ ఎన్నికలు పెట్టండి.. ఇన్‌చార్జీలతో గ్రామాల పాలన నడపడమెందుకు?: కేటీఆర్‌

 దమ్ముంటే లోకల్‌ ఎన్నికలు పెట్టండి.. ఇన్‌చార్జీలతో గ్రామాల పాలన నడపడమెందుకు?: కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ధైర్యముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు సవాల్‌ విసిరారు. ఇన్‌చార్జిలతో గ్రామాల్లో పాలన నడిపించకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రజాప్రతినిధుల చేతుల్లో పాలన పెట్టాలని సూచించారు. 

|


దమ్ముంటే లోకల్‌ ఎన్నికలు పెట్టండి.. ఇన్‌చార్జీలతో గ్రామాల పాలన నడపడమెందుకు?: కేటీఆర్‌

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు వెళ్లాలి

ప్రపంచ వేదికపై సీఎం రేవంత్‌ పచ్చి అబద్ధాలు: కేటీఆర్‌

నేను దావోస్‌ పర్యటనకు వెళ్తే డబ్బు దాచుకొనేందుకన్నారుగా!

రేవంత్‌ ఎందుకు వెళ్లారో చెప్పాలి

సీఎం పర్యటనపై భట్టే విమర్శలు

రైతుబంధు డబ్బులే ఇంకా వేయలే

రెండు నెలల్లోనే కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

సీఎం క్యాంపు ఆఫీస్‌ ఉండగా కొత్త భవనం ఎందుకు?

నేడు మా పార్లమెంటరీ పార్టీ భేటీ

రేపు బీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ భేటీ

త్వరలోనే సోషల్‌మీడియా వారియర్స్‌తో సమావేశమవుతాం

మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్‌

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో పెట్టొద్దన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచన. ఈ సర్కారుకు ధైర్యముంటే ఇన్‌చార్జీలతో గ్రామాల్లో పాలన నడిపించకుండా.. వెంటనే లోకల్‌బాడీ ఎన్నికలు జరపాలి.

– కేటీఆర్‌





KTR | హైదరాబాద్‌, జనవరి 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ధైర్యముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు సవాల్‌ విసిరారు. ఇన్‌చార్జిలతో గ్రామాల్లో పాలన నడిపించకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రజాప్రతినిధుల చేతుల్లో పాలన పెట్టాలని సూచించారు. ప్రస్తుత సర్పంచుల హయాంలో నిర్మించిన భవనాలు, ఇతర మౌలిక వసతులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా కేటీఆర్‌ పలు అంశాలపై మాట్లాడారు. ప్రారంభమే కాని రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు విమర్శించారు. రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దావోస్‌లో ప్రపంచ వేదికపై సీఎం నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారని మండిపడ్డారు. అంతర్జాతీయ వేదికలపై సీఎం అబద్ధాలు చెప్తుంటే.. రాష్ట్రంలో రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని ధ్వజమెత్తారు.


నెలన్నరలో సాధించింది.. ఢిల్లీకి వెళ్లిరావటమే

ఇప్పటికే ఉన్న రైతుబంధు ఇవ్వని రేవంత్‌రెడ్డి.. లేని రైతు భరోసా గురించి మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌రెడ్డి 5ం రోజుల పరిపాలనలో సాధించింది ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని తాము ముందుగానే తాము చెప్పామని.. ప్రస్తుతం అదే జరుగుతున్నదని అన్నారు.


రాష్ట్రం దివాలా తీసిందని చెప్తూనే ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కనపెట్టి కొత్త కార్యాలయం కట్టడం ఎందుకో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. భేషజాల వల్లనే రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌ను వాడలేదని, సీఎం మారినప్పుడల్లా కొత్తవి కట్టుకుంటూ పోతే ఎలా? అని ప్రశ్నించారు. అవసరం లేని భవనాలు కట్టడానికి రేవంత్‌రెడ్డికి డబ్బులు వస్తున్నాయి కానీ రైతుబంధు ఇవ్వటానికి రావట్లేదని విమర్శించారు.


త్వరలో సోషల్‌మీడియా బలగంతో భేటీ

పార్లమెంట్‌ స్థానాలవారీగా సన్నాహక సమావేశాలను విజయవంతంగా పూర్తి చేశామని కేటీఆర్‌ తెలిపారు. రోజూ 10 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహించామని చెప్పారు. త్వరలోనే 30 వేల మంది సోషల్‌ మీడియా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయినట్టు వివరించారు. పార్లమెంట్‌ సన్నాహక సమావేశాల్లో క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందని తెలిపారు. గతంలో జరిగిన కార్యక్రమాలపై కూడా విమర్శనాత్మక ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారని, పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయి నుంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందని వెల్లడించారు.




వద్దన్న సలహాదారులే ముద్దా?

ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దని చెప్పిన రేవంత్‌రెడ్డి, కోర్టులో కేసు కూడా వేశారని, ఇప్పుడు ఆయనే రాజకీయ నిరుద్యోగులను సలహాదారులుగా నియమించుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆరోపించారు. సీఎం దావోస్‌ పర్యటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారని తెలిపారు. అంతర్జాతీయ సంస్థలతో సామాజిక న్యాయం, సమానత్వం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటివి భూతద్దం పెట్టి వెతికినా కనిపించవని భట్టి ఒకవైపు మాట్లాడుతుంటే..


సీఎం మాత్రం అదే అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం గురించి కాకుంటే డిప్యూటీ సీఎం భట్టి ఎవరి గురించి మాట్లాడారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. భట్టి మాటలు వింటుంటే రేవంత్‌రెడ్డి దావోస్‌ ఎందుకు పోయిండో చెప్పాలని ప్రశ్నించినట్టుగా ఉన్నదని అన్నారు. గతంలో తాను దావోస్‌ వెళ్లినప్పుడు స్విస్‌ బ్యాంకులో డబ్బులు దాచుకున్నారని విమర్శించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటివాళ్లు ఇప్పుడు మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.


స్వల్ప కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత

కొత్త ప్రభుత్వంపై స్వల్పకాలంలోనే అన్ని వర్గాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెప్పేవాళ్లకు.. ప్రతిపక్షాలు చెప్పే మాటలు కూడా వినే సహనం ఉండాలని చురకలంటించారు. ఈ రోజుకు కూడా రెండు ఎకరాలకు మించి రైతుబంధు పడడం లేదని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న 9 మంది ఆటో డ్రైవర్లను బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఆదుకుంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని లక్షల మంది ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు.


వద్దన్న అదానీతో ఒప్పందాలు

పది సంవత్సరాలపాటు అదానీని తాము తెలంగాణకు రానీయలేదని, అదానీ పెట్టుబడులు మోదీకే లాభమని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ, నేడు అదే అదానీతో ఒప్పందం ఎలా చేసుకున్నదని కేటీఆర్‌ ప్రశ్నించారు. అదానీని ఒకవైపు రాహుల్‌గాంధీ తిడుతుంటే, ఇక్కడ రేవంత్‌రెడ్డి మాత్రం ఆయనతో ఒప్పందం చేసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. ఒకే ముఖ్యమంత్రిని ఐదేండ్లపాటు కొనసాగించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి లేదని కేటీఆర్‌ అన్నారు. ‘ఒకాయన నేనే నంబర్‌ 2 అంటాడు. డిప్యూటీ సీఎం భార్య మాత్రం మిగతా లీడర్లను పారాచూట్‌ లీడర్లు అని ఎగతాళి చేస్తుంటారు. ఇంకొకాయన నా మాటే చెల్లుతుందని చెప్తారు. ఇట్లా అనేక వైరుధ్యాల మధ్య ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ లీడర్లు ఎన్నిరకాలుగా దృష్టి మరల్చే ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలను చేసేలా మేము, మా పార్టీ శ్రేణులు వెంటాడుతూనే ఉంటాయి’ అని స్పష్టంచేశారు.


జట్టుకట్టిన జాతీయ పార్టీలు

రెండు జాతీయ పార్టీలు కేసీఆర్‌పై కుట్ర పన్నేందుకు జట్టుకట్టాయని కేటీఆర్‌ ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కుమ్మక్కై బీఆర్‌ఎస్‌తో కొట్లాడుతాయని అన్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలు, అదానీతో రేవంత్‌రెడ్డి ఒప్పందాలు అందులో భాగమేనని విమర్శించారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని బెల్టు షాపులను ఎత్తేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు ఎలైట్‌ బార్లు పెడుతామంటున్నదని ఎద్దేవా చేశారు.


కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదంటూనే.. లక్ష ఎకరాలకు నీళ్లిచ్చామని మంత్రి కొండా సురేఖ చెప్పారని అన్నారు. ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తారో ఇవ్వరో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి రాకముందే గ్యారెంటీల అమలుకు జీవోలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల అమలుపై వెంటనే జీవోలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో కోటి 57 లక్షల మంది మహిళలు రూ.2,500 ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.


లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం

లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కేటీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం పార్లమెంటరీ పార్టీ సమావేశమవుతున్నదని, శనివారం పార్టీ మైనార్టీ విభాగం సమావేశం ఉంటుందని చెప్పారు. శనివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్లమెంట్‌ ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. బండి సంజయ్‌ కరీంనగర్‌కు చేసిన పనులేంటో చెప్పాలని, ఆయన చెప్పిన అంశాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వినోద్‌కుమార్‌తో కరీంనగర్‌లో ఎక్కడ చర్చకు వస్తారో చెప్పాలని సవాల్‌ విసిరారు.


కృష్ణా బేసిన్‌ ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు

తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా కేంద్రానికి తాకట్టు పెట్టేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరించిందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే వ్యవహారంపై శాసనసభలో చర్చించాల్సిందని, అఖిలపక్షాన్ని వేయాల్సిందని అన్నారు. కొత్తగా వచ్చామని చెప్తున్న ప్రభుత్వం, ఇంతలోనే అడ్డగోలుగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫార్మాసిటీ రద్దు, ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రద్దుపై కనీసం క్యాబినెట్‌ సమావేశంలో కూడా చర్చించినట్టు లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటి కీలక అంశాలపై ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. తమకు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తునకలా మార్చి కాంగ్రెస్‌ పార్టీకి అప్పగించామని కేటీఆర్‌ తెలిపారు.

నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడారు- రిపబ్లిక్‌ డే స్పీచ్‌లో తమిళిసై కామెంట్స్‌

 నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడారు- రిపబ్లిక్‌ డే స్పీచ్‌లో తమిళిసై కామెంట్స్‌


 : నియంతృత్వ ధోరణులను ప్రజలు సహించరని రిపబ్లిక్‌ డే స్పీచ్‌లో గవర్నర్ తమిళి సై కామెంట్స్‌ చేశారు. అందుకే గత పాలకులను సాగనంపారన్నారు.

 : నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడారు- రిపబ్లిక్‌ డే స్పీచ్‌లో తమిళిసై కామెంట్స్‌

నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడారు- రిపబ్లిక్‌ డే స్పీచ్‌లో తమిళిసై కామెంట్స్‌

             : హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత తన స్పీచ్‌లో గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. 

గత పదేళ్లు పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని తమిళిసై అన్నారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించరన్నారు. అలాంటి వారిని ప్రజలు సాగనంపారని కామెంట్ చేశారు. పదేళ్ల నియంతపాలనకు చరమగీతం పాడారని పేర్కొన్నారు. ఏక పక్ష నిర్ణయాలు, నియంతర ధోరణులు ప్రజాస్వామ్యానికి శోభనియ్యవని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. 


శుభాకాంక్షలతో  మొదలైన గవర్నర్ ప్రసంగం ఇలా సాగింది... 

భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి, భారతజాతిగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక లిఖిత రాజ్యాంగం రాసుకుని 74 ఏళ్లు దిగ్విజయంగా ఆ రాజ్యాంగ మార్గదర్శకత్వంలో దేశం ముందుకు సాగడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఈ ఘనత రాజ్యాంగ నిర్మాతలకు, ఈ దేశ ప్రజలకు దక్కుతుంది.


రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించినప్పుడు ప్రజలే కార్యోన్ముకులై తమ పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణలో పాలన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా సాగినప్పుడు, ఆ పాలనకు చరమగీతం పాడే అవకాశం కూడా రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కే. గడచిన 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అహంకారం, నియంతృత్వం చెల్లదని విస్పష్టమైన తీర్పుతో ప్రకటించింది.


పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.



ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టింది. సమాజంలోని అన్నీ వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. 


ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైంది. ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలులోకి వచ్చిన విషయం మీకు తెలుసు. దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పధకంలో  ఇప్పటి వరకు 11 కోట్ల పైబడి మహిళా సోదరీ మణులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎంతో సంతోషకరం. మిగిలిన గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి ప్రజల మొఖాలలో ఆనందం చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గత పాలకుల నిర్వాకంతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారినా, వ్యవస్థలు గాడి తప్పినా అన్నింటినీ సంస్కరించకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం. తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోంది.


ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ప్రజా సంక్షేమమే. ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. అందుకే డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుండి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించాం.ఈ కార్యక్రమంలో 1,25,84,383 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను ప్రస్తుతం శాఖల వారిగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి వాటి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందుతోంది.


గడచిన పదేళ్ల పాలకుల వైఫల్య ఫలితం... యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగింది. తెలంగాణ ఉద్యమ సారథులైన యువత విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్దయగా, నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ విషయంలో గట్టి దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. ఈ విషయంలో యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదు.


రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని బృందం దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కావడం, గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.40,232 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలంగాణ పురోగమనానికి సంకేతం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, వారి బృందాన్ని అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి... తద్వారా ఉపాధి అవకాశాల కల్పనకు ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నాను.


రైతుల విషయంలో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతో పాటు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న సన్నకారు  రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రైతులకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాం.


రాష్ట్ర ప్రజలకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాను. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు. కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. పేదల కన్నీళ్లు తుడిచే నాధుడు లేని పాలన గతంలో చూశాం. ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలో ఉంది. మహాత్మ జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. సచివాలయంలో సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చింది.ప్రజావాణి కార్యక్రమాన్ని కేవలం హైదరాబాదుకే పరిమితం చేయకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.


తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైంది. ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణలో ఉంది అని చెప్పడానికి గర్విస్తున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిజనులు, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలన అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని... సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని మనసారా కోరుకుంటున్నాను. అంటూ అంబేద్కర్ చెప్పిన కొటేషన్‌తో తన ప్రసంగాన్ని గవర్నర్ ముగించారు.

Wednesday, 24 January 2024

ఆదాయానికి మించి ఆస్తులు.. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ రైడ్

 

ఆదాయానికి మించి ఆస్తులు.. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ రైడ్.                                హైదరాబాద్, జనవరి 24: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు (ACB Raids) కలకలం రేపుతున్నాయి. బుధవారం హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (HMDA Former Director Shiva Balakrishna) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివ బాలకృష్ణపై ఆదాయం మించి ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. శివ బాలకృష్ణ ఇళ్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. శివ బాలకృష్ణ తన పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ కీలక స్థానంలో పనిచేసిన విషయం తెలిసిందే.

Tuesday, 23 January 2024

ఉచిత్ విద్యుత్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, వచ్చే నెల నుంచి అమల్లోకి!

         ఉచిత్ విద్యుత్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, వచ్చే నెల నుంచి అమల్లోకి!

             తెలంగాణలో ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల నుంచి రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు వారికి ఉచిత కరెంట్ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

 ఉచిత్ విద్యుత్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, వచ్చే నెల నుంచి అమల్లోకి!

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

                 హైదరాబాద్‌: కరెంట్ బిల్లులపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (komatireddy venkatreddy) తెలిపారు. రెండు వందల యూనిట్లలోపు కరెంట్ బిల్లు వచ్చే వారికి ఫిబ్రవరి నెల నుంచి ఉచిత్ విద్యుత్ హామీ అమలులోకి వస్తుందని వెల్లడించారు. నగరంలోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ మంగళవారం సమావేశమైంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సభ్యులు శ్రీధర్‌ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల అమ‌లుపై చర్చించిన కమిటీ.. ఉచిత విద్యుత్ (Power bills up to 200 units) అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది.



గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు.. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. గత ప్రభుత్వం కారణంగా లాభాల్లో ఉన్న రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. అర్హులైన పేదలకు డ‌బుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు, నిరుద్యోగ భృతి లాంటి ఎన్నో హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. లక్ష కోట్లను కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట నీళ్లపాలు చేశారని విమర్శించారు.


అంతకుముందు నేటి ఉదయం నల్లగొండ కలెక్టరేట్‌లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తాను వదులుకున్నానని, అలాంటి తనపై బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్‌ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న భయంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.


గత కొన్ని రోజులుగా ఉచిత విద్యుత్ హామీ అమలుపై బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొత్త ఏర్పాటైన రోజు నుంచే ఎన్నికల హామీలను అమలు చేయాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు.. సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి కోమటిరెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. రైతు బంధు నిధుల విడుదల తక్షణమే జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన బీఆర్ఎస్ నేతలు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ హామీ ఏమైందని వీలు చిక్కినప్పుడల్లా నిలదీస్తున్నారు. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రాజెక్టులు, కరెంట్ పై విధివిధానాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత సాధ్యమైనంత త్వరగా ఉచిత విద్యుత్ ను అమలు చేసి అక్కాచెల్లెమ్మలకు ఆర్థిక భారం తొలగిస్తామని చెబుతూనే ఉన్నారు. ఒకవేళ సాధ్యమైనంత త్వరగా ఉచిత్ విద్యుత్ పై ప్రకటన చేయకపోతే, రాష్ట్రం నుంచి కరెంట్ బిల్లులను ఢిల్లీలోని సోనియా గాంధీ ఇంటికి పంపించే ఉద్యమాన్ని చేపడతామని కేటీఆర్ ట్వీట్లు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి రెండు వందల యూనిట్ల లోపు వారికి ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటన చేసింది.


అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా సమావేశం

 అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా సమావేశం






*దేశవ్యాప్తంగా వైశ్యులందరినీ ఒక ప్లాట్ ఫామ్ మీదకి తీసుకురావడమే అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ప్రధాన లక్ష్యం : అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త.*

ఈరోజు హైదరాబాద్ లోని  హైటెక్ సిటీ, హై స్టే హోటల్ లో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో  అంగరంగ వైభవంగా జరిగిన  *అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ సౌత్ ఇండియా మేనేజింగ్ కమిటీ మీటింగ్ సమావేశం  జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు,అశోక్  అగర్వాల్ గారు, IVF చైర్మన్ అడ్వైసరి బోర్డ్ సెంట్రల్ కమిటీ న్యూఢిల్లీ. గంజి రాజమౌళి  గుప్త గారు, మరియు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు  మరియు రాష్ట్ర టూరిజం పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తగారు  పాల్గొనడం జరిగింది.* అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ  భాగంగా జరిగిన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ సౌత్ ఇండియా సమావేశం కార్యక్రమానికి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకు మరియు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకి సంబంధించి అన్ని విభాగాలు, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మరియు అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు  ,డివిజన్ కమిటీ, మండల కమిటీ,యూత్ కమిటీ మహిళా కమిటీ, సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా  జ్యోతి ప్రజ్వలన చేసి  కార్యక్రమాన్ని ప్రారంభించి తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

*ఈ కార్యక్రమంలో..* IVF మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్-IVF స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, IVF మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి,  IVF రాష్ట్ర నాయకులు గంగిశెట్టి రఘు,  ముస్త్యాల సత్యనారాయణ, కోడిప్యాక నారాయణ, గౌరీ శెట్టి చంద్రయ్య, psr మూర్తి, కటకం శ్రీనివాస్,కాచం కృష్ణ మూర్తి, సుధాకర్ గుప్త,రమేష్ గుప్త, పురుషోత్తం, శంభు పాండు గుప్త, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు,  IVF తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్,తెలంగాణ స్టేట్  యూత్ జనరల్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్  తెలంగాణ స్టేట్ యూత్  వైస్ ప్రెసిడెంట్ కొల్పురి నరేష్ గుప్త ,గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా,సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ రావు, IVF రంగారెడ్డి .

Monday, 22 January 2024

అయోధ్యలో గర్భగుడిలో పూజలందుకుంటున్న బాలరాముడు.. తొలి విజువల్స్‌

 గర్భగుడిలో పూజలందుకుంటున్న బాలరాముడు.. తొలి విజువల్స్‌

                 500 ఏండ్ల కల నెరవేరింది. యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు.

 గర్భగుడిలో పూజలందుకుంటున్న బాలరాముడు.. తొలి విజువల్స్‌

             500 ఏండ్ల కల నెరవేరింది. యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో





 నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.




‘అభిజిత్‌ లగ్నం’లో (Abhijit) పెట్టిన 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో బాలరాముడు కొలువుదీరాడు. 12.29 నిమిషాల‌కు ముఖ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 84 సెక‌న్ల పాటు అస‌లు క్రతువును చేపట్టారు. ప్రాణ ప్రతిష్టాపన అనంతరం శ్రీరాముడికి తొలి పూజ నిర్వహించారు. ముందుగా ప్రధాని మోదీ రాముడికి హారతి ఇచ్చారు. స్వర్ణాభరణాలతో బాలరాముడు ధగధగా మెరుస్తూ దర్శనమిచ్చారు. కుడిచేతిలో బాణం, ఎడమచేతిలో విల్లుతో అభయమిచ్చారు.


గర్భగుడిలో జరిగిన ఈ పూజా క్రతువులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడి తొలి విజువల్స్‌ మీకోసం..

Saturday, 20 January 2024

Ayodhya ram lalla statue: అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రత్యేకతలు చూశారా?



  • Ayodha ram lalla statue: అయోధ్యలోని ఐదేళ్ల వయసు ఉన్న బాల రాముడి దివ్య సౌందర్యం అందరినీ మంత్ర ముగ్ధులని చేస్తుంది. ఈ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ

బాల రాముడి విగ్రహ ప్రత్యేకతలు
బాల రాముడి విగ్రహ ప్రత్యేకతలు.                                                బాల రాముడి విగ్రహ ప్రత్యేకతలు

Ayodhya ram lalla statue: దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు శ్రీరామ నామ జపాన్ని పటిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనుంది. దీని కోసం అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్య రామ మందిరం గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. కళ్ళకి గంతలు కట్టి ఉన్న బాల రాముడి విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మాచిద్విలాసంతో ఉన్న బాల రాముడి మోము ఎంతో సుందరంగా ఉంది. సాలగ్రామ రాతితో చేసిన ఈ విగ్రహం చూస్తే ఎవరైనా మంత్ర ముగ్ధులు కావాల్సిందే. అంతటి సౌందర్య రూపం చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. జనవరి 22 న ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనుంది. 23 వ తేదీ నుంచి భక్తులకి దర్శనం ఇస్తాడు. 51 అంగుళాల ఎత్తులో ఉన్న బాల రాముడి విగ్రహం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఈ విగ్రహం 200 కిలోల బరువు ఉంటుంది. కర్ణాటకకి చెందిన అరుణ్ యోగి దీన్ని రూపొందించారు.

రామ్ లల్లా విగ్రహ ప్రత్యేకతలు

శ్రీరాముని బాల్యరూపంలోని ఉన్న విగ్రహం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. చేతిలో బంగారు బాణం, బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది. రాముడి విగ్రహం చుట్టూ విష్ణు మూర్తి దశావతారాలు ఉన్నాయి. వాటితో పాటు విగ్రహం దిగువున ఒకవైపు హనుమంతుడు మరొక వైపు గరుడ దేవుడు ఉన్నాడు. తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంటుంది. రాముడు విష్ణు మూర్తి ఏడో అవతారంగా చెప్తారు.

రామ్ లల్లా విగ్రహం అంచుల మీద విష్ణు మూర్తి పది అవతారాలు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహావతారం, వామన అవతారం, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అవతారాలకి చెందిన చిన్న చిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు సూర్య భగవానుడు, శంఖం, స్వస్తిక్, సుదర్శన చక్రం, గద, ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి. దీని మీద చేసిన కళా ఖండాలు అద్భుతంగా ఔరా అనిపిస్తాయి. ఈ విగ్రహం తయారీకి ఒక రాయి మాత్రమే ఉపయోగించారు. ఏకశిలా విగ్రహంగా పేరొందింది. వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. నీరు, ఇతర ఏవైనా వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. వాటి వల్ల విగ్రహానికి ఎలాంటి హాని జరగదు.

నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షుడుగా డా. నాగం వర్షిత్ రెడ్డి

 

నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షుడుగా డా. నాగం వర్షిత్ రెడ్డి


Friday, 19 January 2024

పొంగులేటికి చిన్న పత్రికల గోడు చిన్న పత్రికలకు జీవం పోయండిబిల్లులు విడుదలకై భట్టికి వినతి

పొంగులేటికి చిన్న పత్రికల గోడు

చిన్న పత్రికలకు జీవం పోయండి

హైదరాబాద్ :ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉన్న చిన్న పత్రికల సమస్యల సమహారాన్ని  రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తెలంగాణ చిన్న మధ్య తరహా పత్రికల మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాస్ మాతంగి, గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనo, ప్రధాన కార్యదర్శి షేక్ అహమ్మద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు  యాదయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొమరాజు శ్రీనివాసులు, వేమిరెడ్డి సుభాష్ రెడ్డి బృందం తమ గోడుగా కూడిన వినతి పత్రాన్ని అందించింది. చిన్న మధ్య తరహా పత్రికలకు విడుదల చేసిన ప్రకటనల బిల్లులు ఏడాదిన్నర కాలంగా ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నాయని, ఆయా బిల్లులను వెంటనే  విడుదల చేసి చిన్న పత్రికల మనుగడకు ఊపిరి ఊదాలని కోరారు. ఆరేళ్లు 2018నుంచి అఫ్ గ్రేడ్ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నామని, గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు చిన్న మధ్య తరహా పత్రికల అఫ్ గ్రేడ్ ప్రక్రియ తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అడహక్ బేసిక్ లో 2020 లో కొన్ని పత్రికలకు ఎంపానల్ మెంట్ జరిగిందని, పూర్తి స్థాయి ఎంపానల్ మెంట్ చేపట్టి, మూడేళ్లుగా నీరీక్షిస్తున్న ఆయా పత్రికలను 

ఎంపానల్ మెంట్ చేసి ఆదుకోవాలన్నారు. ఐఅండ్ పిఆర్ కమీషనర్ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల 25 రోజుల అటెండెన్స్ ను పరిగణనలోకి తీసుకుని యాడ్ లు ఇస్తున్నప్పటికి వాటికి తోడు మునుపటి మాదిరిగా క్లాసిఫైడ్, ఎల్ ఏ యాడ్ లు ఇవ్వాలని, మ్యాగజైన్స్ కూడా ప్రతినెల యాడ్ లు ఇవ్వాలని మంత్రి దృష్టికి తెచ్చారు.ఐఅండ్ పిఆర్ కమీషనర్ అక్రిడిటేశన్ కార్డులు కల్గిన దిన పత్రికల ఎడిటర్లకు హైదారాబాద్ లో, మ్యాగజైన్స్ ఆయా జిల్లాలో ఇళ్ళ స్థలాలిచ్చి జర్నలిస్టులందరికీ గూడు కల్పించాలని విన్నవించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఐఅండ్ పిఆర్ స్పెషల్ కమీషనర్ ఆదేశించారు. అనంతరం ఐఅండ్ పిఆర్ స్పెషల్ కమీషనర్ అశోక్ రెడ్డిని కలసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రతి నెల రెగ్యులర్ గా ఇచ్చే యాడ్ లను పునరుద్ధరించాలని కోరారు.


బిల్లులు విడుదలకై భట్టికి వినతి 









ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర డిప్యూటి సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు కు వినతి పత్రాన్ని అందించింది. ఏడాదిన్నర కాలంగా ఆర్థిక శాఖలో చిన్న పత్రికల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, తక్షణమే విడుదల చేసి చిన్న పత్రికల జీవం పోయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో సంఘం  నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోటగిరి చంద్రశేఖర్,, ఎండి మక్సుద్,, వీరెల్లి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు

Wednesday, 17 January 2024

రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు*

 *రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు*



TS: వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటికే రిటైరైనప్పటికీ.. ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న అధికారుల వివరాలు రేపు సాయంత్రం 5 గంటల్లోగా ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఆర్కియాలజీ, MCHRD, ఎండోమెంట్ ఇలా పలు శాఖల్లో విశ్రాంత అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని తొలగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? అని చర్చ మొదలైంది.

ఆర్యవైశ్యులకు గుడ్ న్యూస్ హామీ నిలుపుకున్న మంత్రి - సీనియర్ జర్నలిస్టు కోటగిర దైవ దినం

 

ఆర్యవైశ్యులకు గుడ్ న్యూస్ హామీ నిలుపుకున్న మంత్రి - సీనియర్ జర్నలిస్టు కోటగిర దైవ దినం


 


ఆర్యవైశ్యులకు గుడ్ న్యూస్
హామీ నిలుపుకున్న మంత్రి - సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదీనం
నల్గొండ:- మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ  మంత్రి గౌరవనీయులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఇటీవల శాసన సభ ఎన్నికల సందర్బంగా వైశ్యులకు ఇచ్చిన హామీలలో ఒక దానిని నిలుపుకున్నారని సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదీనం  అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పట్టణంలోని వైష్యుల మనోభిప్రాయాలు దెబ్బతినే విధంగా బీట్ మార్కెట్లో మన కులదైవం వాసవి మాత ఆలయానికి వ్యతిరేకంగా మాంసం మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ముందుకు సాగారు. వైష్యులంతా మూకుమ్మడిగా వెళ్లి మాంసం మార్కెట్ వద్దని రెండు మూడు సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్డ్ అభ్యర్థి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా తాను గెలిచిన వెంటనే నాన్ వెజ్ మార్కెట్ తొలగిస్తానని హామీ ఇచ్చారు.
అందుకు అనుగుణంగా నేడు అనగా బుధవారం నాడు నల్గొండ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మొట్టమొదట నేరుగా మార్కెటును సందర్శించి ఇక్కడ నుండి నాన్ వెజ్ మార్కెటును తొలగించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆ ప్రాంతంలో గల షెడ్లు పూల మార్కెట్ కు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్ చేసిన సూచన మేరకు అక్కడ పూల మార్కెట్ ఏర్పాటు చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. దాంతో ఇక ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కాస్తా వెజిటబుల్ అండ్ ఫ్లవర్ మార్కెట్టుగా మారనుంది.
అంతేగాక మంత్రి  మనకు ఇచ్చిన ఇతర హామీలు కూడా త్వరలో నెరవేరుస్తారని గ్యారెంటీ ఏర్పడిందని, ఇందుకుగాను మంత్రి కి కృతజ్ఞతలు చెపుతూ,    పట్టణ ఆర్యవైస్యులు కూడా మంత్రికి కృతజ్ఞతలు చెప్పవలసిన భాధ్యత ఉంది అని అన్న  కోటగిరి దైవాదీనం.

Sunday, 14 January 2024

రాజా సింగ్‌కు బెదిరింపు ఫోన్ కాల్: ‘దమ్ముంటే రా’ అంటూ సవాల్

రాజా సింగ్‌కు బెదిరింపు ఫోన్ కాల్: ‘దమ్ముంటే రా’ అంటూ సవాల్


హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ చేసిన దుండగులు.. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ ఆయన్ను బెదిరించారు. దీంతో రాజా సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

        ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ ఎవరు చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా రాజా సింగ్ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపు కాల్ రావడం గమనార్హం. గతంలో కూడా ఆయనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.కాగా, చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపులు వచ్చాయి. దీనిపై స్పందించిన రాజాసింగ్... 'ఫోన్‌లో కాదు దమ్ము ఉంటే నేరుగా రావాలని' సవాళ్లు విసిరారు.7199942827, 4223532270 నెంబర్స్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజా సింగ్ తెలిపారు. అయ్యోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో రాజసింగ్‌కు తాజాగా బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది ఇలావుండగా3, కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే రాజా సింగ్.. అప్పటి రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కి లేఖ రాశారు. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకు ఏ ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో.. ఆ జాబితాను డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. తనను చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా వెల్లడించారు రాజా సింగ్.


మకర సంక్రాంతి రోజున తప్పకుండా తినాల్సిన పిండి వంటలు ఇవే!

 మకర సంక్రాంతి రోజున తప్పకుండా తినాల్సిన పిండి వంటలు ఇవే!

            : నూతన సంవత్సరం ప్రతి ఏడాది వచ్చే హిందువు పండుగలో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున  భోగి మంటలు, రంగురంగుల గాలిపటాలు  అలాగే వివిధ  సాంప్రదాయ వంటకాలు వండుతారు. అయితే ముఖ్యంగా ఈ రోజున తయారు చేసే స్పెషల్ వంటకాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

: భోగి పండగ శుభాకాంక్షలు, ప్రత్యేకమైన కోట్స్, వాట్సప్ స్టేటస్ పిక్స్‌, గ్రీటింగ్స్..

 సంక్రాంతి 2024 ప్రత్యేక ముగ్గులు మీ కోసం..వాకిలిని నింపేయండి..

 భోగి, సంక్రాంతి రోజు వేయాల్సిన ప్రత్యేక ముగ్గులు ఇవే.. సింపుల్‌గా వాకిలి నిండా వేయండి..

జీన్స్‌లో యాంకర్ రష్మీ బాప్‌ రే.. అదిరిపోయే పిక్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్

 మకర సంక్రాంతి రోజున తప్పకుండా తినాల్సిన పిండి వంటలు ఇవే! 

             కొత్త సంవత్సరం రోజున వచ్చే మొదటి పండుగ మకర సంక్రాంతి.  ఈ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడని పెద్దలు చెబుతారు. మకరరాశిలో ప్రవేశించడం వల్ల ఈ పండుగ మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ రోజు పవిత్ర జలంతో స్నానం చేసి సూర్యదేవడికి పూజలు చేస్తారు. అనంతరం ఎంతో ప్రత్యేకమైన, రుచికరమైన పిండి వంటలను తయారు చేస్తారు.  అయితే ఈ పండుగ రోజు చేసే ప్రత్యేక వంటకాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల లడ్డూలు: మకర సంక్రాంతి నాడు నువ్వులకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని శాస్త్రులు చెబుతున్నాయి. నువ్వుల లడ్డూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చు. దీని కోసం మీరు నువ్వులు, వేరుశెనగలు, బెల్లం, ఎండిన కొబ్బరి వంటి పదార్థాలు ఉపయోగించాలి. తరువాత ఒక పాన్‌లో బెల్లం వేడి చేసి కరిగించండి. అందులో నువ్వులు వేసి త్వరగా లడ్డూలు చేసుకోవాలి. ఈ విధంగా ఈ నువ్వుల లడ్డూను తయారు చేసుకోవాలి.


పురాన్ పోలి: పండుగ అంటే ముందు గుర్తుకు వచ్చేది పోలిలే. ఈ ప్రత్యేకమైన పండుగ రోజున చాలా మంది పోలి చేస్తారు.  ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది.  నా పప్పు, బెల్లం రుబ్బిన సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఈ సాంప్రదాయ వంటకం మహారాష్ట్ర వంటకాల నుండి వచ్చింది.


Saturday, 13 January 2024

భోగి రోజు రేగు పండ్లను పిల్లల తల మీద ఎందుకు పోస్తారు..

 భోగి రోజు రేగు పండ్లను పిల్లల తల మీద ఎందుకు పోస్తారు..

                :


 సంక్రాంతి సందడి భోగితోనే మొదలవుతుంది. భోగి సందర్భంగా ఆనాడు సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపండ్లు పోసే సంప్రదాయం ఉంది. రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను భోగి పండ్లుగా వాడతారు. రేగు పండ్లకు బదరీఫలాలని పేరు.


శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా, వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు. పెద్ద పండుగకు ముందురోజు వచ్చే భోగి వ్యవసాయదారులకు ప్రధానం. సంక్రాంతి వేళ పంటలు చేతికొచ్చి.. పల్లెలు ధనధాన్యరాశులతో తులతూగుతూ ఉంటాయి. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ ‘భోగి’తో భోగభాగ్యాలు తమ జీవితంలో ప్రసరించాలని రైతులు భావిస్తారు.


దీనికి ప్రతీకగా ఇన్నాళ్లూ తమను పట్టి పీడించిన దారిద్య్రాన్ని తరిమికొడుతూ, కష్టాలన్నిటినీ అగ్నిలో ఆహుతి చేస్తూ భోగిమంటలను వేయడం ఆచారంగా మారింది. ఈ మంటల వెనుక ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రీయ కోణమూ దాగి ఉంది. దక్షిణాయనంలో అధిక భాగం అనారోగ్యం కలిగించే వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో శ్వాస సంబంధమైన రోగాలు వ్యాపిస్తుంటాయి. వాటి నివారణ కోసం ఆవుపేడతో చేసిన పిడకలు, మామిడి, మేడిచెట్ల కొమ్మలతో భోగిమంటలు వేస్తారు. అందులో ఆవునెయ్యి వేస్తారు. భోగిమంటలు వెచ్చదనాన్ని ఇవ్వడంతోపాటు అందులోంచి వెలువడే శక్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే భోగిమంటలకు అంత ప్రాధాన్యం ఏర్పడింది.


Friday, 12 January 2024

యాదాద్రి జిల్లాలో ఏసీబీ రైడ్స్*

 యాదాద్రి జిల్లాలో ఏసీబీ రైడ్స్*




*రూ 5000 వేయ్యులు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు  చిక్కిన యాదాద్రి డిస్టిక్  ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ (DTO) సురేందర్ రెడ్డి*


*సురేందర్ రెడ్డి తో పాటుగా ఏజెంట్ లు అనిల్, సురేష్ లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ, 29000 రూపాయల స్వాధీనం, DTO డ్రైవర్ మల్లికార్జున్ పరారి లో ఉన్నట్లు తెలిపిన ఏసీబీ డీఏస్పీ  శ్రీనివాస రావు*

*రూ 5000 వేయ్యులు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు  చిక్కిన యాదాద్రి డిస్టిక్  ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ (DTO) సురేందర్ రెడ్డి*


*సురేందర్ రెడ్డి తో పాటుగా ఏజెంట్ లు అనిల్, సురేష్ లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ, 29000 రూపాయల స్వాధీనం, DTO డ్రైవర్ మల్లికార్జున్ పరారి లో ఉన్నట్లు తెలిపిన ఏసీబీ డీఏస్పీ  శ్రీనివాస రావు*

Thursday, 11 January 2024

అర్బన్ ఫారెస్ట్ కు కొత్త డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ కుమార్ శెట్టి


అర్బన్ ఫారెస్ట్ కు కొత్త డైరెక్టర్

బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ కుమార్ శెట్టి


*హైదరాబాద్* :  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ గా ఎస్.వి.ప్రదీప్ కుమార్ శెట్టి బుధవారం బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ ఆయనకు అర్బన్ ఫారెస్ట్ బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ ఉద్యోగుల సహకారంతో హెచ్ఎండిఏ ప్రాముఖ్యతను పెంచేందుకు కృషి చేస్తానని కొత్త డైరెక్టర్ ప్రసాద్ కుమార్ శెట్టి తెలిపారు.

Wednesday, 10 January 2024

BOMPALI MADHUSUDHAN GUPTHA*appointed as one of the Dharani Committee Members.*


*New TS Govt recognised the services of one more Rtd Guptha officer services and appointed as one of the Dharani Committee Members.*


*Sri. BOMPALI MADHUSUDHAN GUPTHA*
*Rtd Spl Grade Collecter*
*Rtd in the year 2002*
*2002 to 2005 - After his Retirement he served as OSD in Revenue Dept.*

*Special Thanks to Dynamic Leader & Hon'ble CM Sri. Revanth Reddy Garu for encouraging & recognising Trust Worthy Guptha officers.*🌹🌹

విప్ ను ఉల్లంఘించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోండి.. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

 విప్ ను ఉల్లంఘించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోండి.. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి


నల్లగొండ మున్సిపల్ చైర్మన్ 'మందడి సైదిరెడ్డి' మీద అవిశ్వాస తీర్మానం సందర్భంగా.. బీఆర్ఎస్ పార్టీ జారీ చేసిన విప్ ను ఉల్లంఘించిన ఆ పార్టీ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోవాలంటూ.. కలెక్టర్ హరిచందన కు ఫిర్యాదు చేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.*


Monday, 8 January 2024

updates జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హరిచందన దాసరి

 జిల్లా కలెక్టరేట్ చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ను ఛాంబర్లో ఎస్.పి.చందన దీప్తి, ఇంచార్జి కలెక్టర్ గా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)జె.శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, అర్.డి. ఓ .లు,మున్సిపల్ కమిషనర్ లు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలెక్టర్ కు పూల బొకేలు అందించి సాదరంగా కలిశారు.