దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు త్వరగా పూర్తి చేయాలి: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్
దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు త్వరగా పూర్తి చేయాలి: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్
హైదరాబాద్,: దుర్గం చెరువును తెలంగాణలో ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులు, ఎస్‌ఎన్‌డిపి, లేక్స్ విభాగాలతో రహేజా ఐటీ పార్క్ (హైదరాబాద్) ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు.
బుధవారం కమిషనర్ ఆర్.వి. కర్ణన్ దుర్గం చెరువును పరిశీలించి, చెరువు ప్రొటెక్షన్ పనులతో పాటు ప్రతిపాదిత అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో పరిసర కాలనీలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు చెరువు నీటి మట్టాన్ని FTL కంటే తక్కువగా ఉంచాలని లేక్స్ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు.
కమిషనర్ ప్రోత్సాహంతో రహేజా ఐటీ పార్క్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) పథకం కింద దుర్గం చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులకు నిధులు సమకూర్చడానికి ముందుకొచ్చింది. రెండు సంవత్సరాల పాటు చెరువును సంరక్షించడానికి ఆ సంస్థ బాధ్యత తీసుకుంది. ఇందులో భాగంగా చెరువు చుట్టూ కంచె ఏర్పాటు, నిరంతర శుభ్రపరిచే చర్యలు, నీటిమొక్కలు, తేలియాడే వ్యర్థాలను తొలగించడం, అలాగే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ల్యాండ్‌స్కేపింగ్, పచ్చదనం ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యాలు కల్పించనున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఆర్.వి. కర్ణన్, రహేజా ప్రతినిధులను పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే ఎస్‌ఎన్‌డిపి, లేక్స్ విభాగాలను కూడా లేక్ ప్రొటెక్షన్,అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
క్షేత్ర పరిశీలనలో జిహెచ్ఎంసి కమిషనర్ వెంట హెచ్.ఎమ్.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, శేరిలింగంపల్లి
జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, జీహెచ్ఎంసీ ఎస్.ఇ. శంకర్ నాయక్, రహేజా గ్రూప్ నుండి బాలరాజు, జీహెచ్ఎంసీ ఇ.ఇ. శిరీష, సీజీఎం (ఎస్‌టిపి) పద్మజ, లేక్స్ విభాగం డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్ లు ఉన్నారు.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home