కరోనా కలకలం, ఒక్క రోజులో భారీగా - ఏడు మరణాలు..!!
కరోనా కలకలం, ఒక్క రోజులో భారీగా - ఏడు మరణాలు..!!
మరోసారి భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 500కిపైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజా కేసులతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,866కి పెరిగింది. అత్యధికంగా కేరళలో 1,487 కేసులు వెలుగు చూడగా.. ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్‌లో 538, మహారాష్ట్రలో 526, గుజరాత్‌లో 508, కర్ణాటకలో 436, తమిళనాడులో 213 కేసులు నమోదయ్యాయి. ఏపీలో నూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
కాగా, గత 24 గంటల్లో ఏడు మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 5 నెలల చిన్నారి సహా ఇద్దరు మరణించారు. కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ముగ్గురు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 51కి పెరిగింది. ఏపీలోనూ రాష్ట్రంలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. నగరంలోని పాతూరుకు చెందిన ఓ మహిళకు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు అనుమానంతో మహిళలకు కొవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆస్పుపత్రిలో వైద్యం తీసుకోవాలని మహిళకు వైద్యులు సూచించారు.
బాధితురాలిని హోం ఐసోలేషన్ కు తరించారు. మరోవైపు తెలంగాణలో కూడా కరోనా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు నలుగురు కరోనా బారిన పడినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్‌కు అనుగుణంగా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తెలిపే మార్గదర్శకాలను పాటిస్తూ సహకరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా బారిన పడినప్పటికీ చికిత్స పొంది కోలుకోవచ్చని భయపడాల్సి అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1238 కొత్త కేసులు నమోదు అవగా.. ఏడుగురు మృతి చెందారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 4,866కు చేరాయి. అలాగే కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,955గా ఉంది. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు కరోనా బారిన పడి మృతి చెందారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home