TG: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం.. జూన్ 21లోపే..
TG: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం.. జూన్ 21లోపే..
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. వార్డుల విభజన ప్రక్రియను జూన్ 21 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఓఆర్‌ఆర్ బయట ఉన్న 30 పట్టణ సంస్థల్లో విభజన.. లోపలి 13 సంస్థలను ‘జి.హెచ్.ఎం.సి.’లో విలీనం చేస్తారు. మహబూబ్‌నగర్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో వార్డుల సంఖ్య పెంచనున్నారు. ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాను సవరించనుంది. త్వరలో రిజర్వేషన్లు ఖరారై, వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పుర పోరుకు రంగం సిద్ధం.
- పుర పోరుకు రంగం సిద్ధం
- వార్డుల విభజనకు షెడ్యూల్ విడుదల
- జూన్ 21 వరకు పూర్తి చేసేలా కసరత్తు . తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. జూలై నెలలో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో కీలకమైన అంశం వార్డుల విభజన. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 43 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండగా.. వాటిలో ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) బయట ఉన్న 30 పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే వార్డుల విభజన చేపట్టాలని నిర్ణయించారు. దీనికి కారణం.. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 13 పట్టణ స్థానిక సంస్థలను జి.హెచ్.ఎం.సి. (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) లో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించడం. ఈ విలీనం పూర్తయిన తర్వాత, ఆ ప్రాంతాల్లో వార్డుల విభజన చేపడతారు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home