ఆపరేషన్ తెలంగాణ, కీలక మలుపు - డేంజర్ బెల్స్..!!
ఆపరేషన్ తెలంగాణ, కీలక మలుపు - డేంజర్ బెల్స్..!!
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో బీజేపీ రెండు స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కోల్పోయింది. బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. అనూహ్య ఫలితాలతో ఒక్క సారిగా బీజేపీలో జోష్ పెరిగింది. ప్రధాని గెలిచిన ఎమ్మెల్సీలను అభినందించారు. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ తెలంగాణ మొదలైంది. ఈ ఎన్నికల తో రాజకీయంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అలర్ట్ కావాల్సింది ఎవరు.. ఏం జరుగుతోంది..
మారుతున్న లెక్కలు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్నాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫలితాలు భిన్నంగా వచ్చాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంది. బీజేపీ అనూహ్యంగా రెండు స్థానాలు గెలుచుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సిట్టింగ్ సీటును బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా భావించిన కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డి రెండో ప్రాధాన్యఓట్లతో విజయం సాధించారు.
కాంగ్రెస్ కు షాక్
ఇదే జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్నీ గెలుచుకున్న బీజేపీ.. పట్టభద్రుల ఎమ్ మెల్సీని కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరోసారి పట్టు నిరూపించు కుంది. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సిటింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఉన్నారు. ఈసారి పోటీకి ఆయన సుముఖత తెలపకపోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా, మిత్రపక్షంగా సీపీఐ మద్దతు ప్రకటించినా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకో లేకపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్ ప్రచారం చేసినా ప్రయోజనం దక్కలేదు. ఇదే నియోజకవర్గ రిధిలో ఏడు గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలను కలిగి ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించినా ఆలస్యంగా ప్రచారంలోకి దిగింది. అయినా అనూహ్యంగా పోటీ ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకొని ఈ ప్రాంతంలో పట్టును మరింత పెంచుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొత్త స్కెచ్ అమలు చేస్తోంది. కాంగ్రెస్ అంతర్గత పరిణామాలు తమకు మేలు చేస్తాయని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో బీజేపీ పుంజుకోవటం కాంగ్రెస్ తో పాటుగా బీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ గా మారుతున్నాయి. దీంతో.. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home