అంగరంగ వైభవంగా వి బి జి ఫౌండేషన్ వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
అంగరంగ వైభవంగా వి బి జి ఫౌండేషన్ వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తేదీ 03.03 2025 రోజున కర్మన్ఘాట్ లక్ష్మీ కన్వెన్షన్ వేదికగా వి బి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగినది కార్యక్రమానికి తెలంగాణ నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు మహారాష్ట్ర నుంచి మహిళలు పాల్గొనడం చాలా సంతోషకరం
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిగాల గణేష్ గుప్తా అన్న గారికి చికోటి ప్రవీణ్ అన్న గారికి మన వి బి జి ఫౌండేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻 మా సోదరీమణులు గుంతా మౌనిక గారికి ఉప్పల రాజ్యలక్ష్మి గారికి ఎర్రం పూర్ణ శాంతి గారికి జూలూరి స్వరూప గారికి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్ఎస్ కపుల్స్ గారికి కవిరాజ్ గారికి మామ్ అండ్ మీ టాక్స్ భీమవరం వారికి విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాల.
మాకు ఎంతో సహకరిస్తున్న మా స్పాన్సర్స్ దేవుళ్ళు అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు.
మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా వి బి జి ఫౌండేషన్ చైర్మన్ మడిపడిగా రామన్న గారికి ,వైస్ చైర్మన్ ఇమ్మడి రమేష్ అన్న గారికి, TSV ప్రసాద్ గారికి మరియు మా మేనేజింగ్ కమిటీ సభ్యులందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు.
కార్యక్రమంలో పేదలకు కుట్టుమిషన్లు నిత్యవసర సరుకులు పేద ఆర్యవైశ్య మహిళ ఇటీవలే తన భర్త చనిపోతే వారికి ఉపాధి కోసం 21000 ఆర్థిక సహాయం ఇంకా ఎన్నో బంగారు బహుమతులు వెండి బహుమతులు చీరలు స్కూటీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వడం జరిగినది.


















0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home